చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

US election 2020: జయహో కమలా హ్యారీస్, తమిళనాడులో కులదైవానికి పూజలు, హోమాలు, విక్టరీ!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (74), ఎన్నికల బరిలో ఉన్న డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ (77) నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ (55)కు ఇండియన్ అమెరికన్లు దాదాపుగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారీస్ ఉపాధ్యక్షురాలిగా విజయం సాధించాలని తమిళనాడులోని ఆమె సొంత ఊర్లో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు చేస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారీస్ తన సత్తాచాటుకుని భారతీయులు గర్వంగా తల ఎత్తుకునేలా ఆమెను ఆశీర్వదించాలని తమిళనాడులోని ఆమె సొంత గ్రామ ప్రజలు దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

friend wife: బిగ్ షాట్ కోడలు, స్టార్ హోటల్స్ లో ప్రియుడితో జల్సాలు, రూ. 20 కోట్లు గోవిందా గోవింద !friend wife: బిగ్ షాట్ కోడలు, స్టార్ హోటల్స్ లో ప్రియుడితో జల్సాలు, రూ. 20 కోట్లు గోవిందా గోవింద !

తంజావూర్ లో కమలా ఫ్యాన్స్

తంజావూర్ లో కమలా ఫ్యాన్స్

తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోని కమలా హ్యారీస్ స్వగ్రామంలో సందడి నెలకొనింది. అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో ఆదేశ ఉపాధ్యక్ష ఎన్నికల్లో మా ఆడబిడ్డ కమలా హ్యారీస్ విజయం సాధించాలని అమెరికాలో ఎన్నికల పొలింగ్ జరుగుతున్న సందర్బంగా స్థానిక ప్రజలు కమలా హ్యారీస్ కులదేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

అమ్మ ఆశీస్సులు

అమ్మ ఆశీస్సులు

భారత సంతతికి చెందిన కమలా హ్యారీస్ ఇప్పటికే కాలిఫోర్నియా సెనేటర్ గా పని చేస్తున్నారు. కమలా హ్యారీస్ తల్లి చమల గోపాలన్ తమిళనాడులోని చెన్నైలోనే పెరిగారు. కమలా హ్యారీస్ తల్లి చెన్నై నివాసి. తండ్రి జమైకాకు చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. తమిళనాడులో పుట్టి పెరిగిన చమలా గోపాలన్ ఆశీస్సులతో పాటు ఆ అమ్మవారి ఆశీస్సులు కమలా హ్యారీస్ పుష్కలంగా ఉన్నాయని, ఆమె కచ్చితంగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా విజయం సాధిస్తారని తంజాపూర్ ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

తాత అభిమానులు, బంధువర్గం

తాత అభిమానులు, బంధువర్గం

కమలా హ్యారీస్ తల్లి చమల గోపాలన్ తల్లిదండ్రులు తంజావూర్ లోని మన్నార్ గుడి ప్రాంతానికి చెందిన వారు. కమలా హ్యారీస్ తాత గోపాలన్ పైంగనాడు సమీపంలోని తులసేంద్రపురానికి చెందిన వారు. బ్రిటీష్ కాలంలో కమలా హ్యారీస్ తాత గోపాలన్ సివిల్ సర్వీస్ అధికారిగా పని చేస్తూ మంచి పేరుప్రతిష్టలు సంపాధించుకున్నారు. 1930 తరువాత కమలా హ్యారీస్ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

 రికార్డుల కమలా హ్యారీస్ !

రికార్డుల కమలా హ్యారీస్ !

కమలా హ్యారీస్ 2016లో కాలిఫోర్నియా నుంచి సెనేటర్ గా ఎన్నికయ్యారు. గతంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో అటర్నీ జనరల్ గా పని చేసిన కమలా హ్యారీస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పని చేస్తూ అందరిలో మంచి పేరుప్రతిష్ట్రలు సంపాధించుకున్నారు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారీస్ పని చేస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారీస్ విజయం సాధించాలని ఆమె సొంత ఊర్లో ఇప్పుడు కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

కమలా హ్యారీస్ కులదైవం

కమలా హ్యారీస్ కులదైవం

తంజావూర్ లోని మన్నార్ గుడి సమీపంలోని తులసేంద్రపురంలోని గిరిజన దేవత అయిన అయ్యనార్ ఆలయంలో కమలా హ్యారీస్ పేరుతో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారీస్ విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తూ సోమవారం నుంచి ప్రత్యేక ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు.

 కమలా హ్యారీస్ ఫ్లెక్సీలు, బ్యానర్స్

కమలా హ్యారీస్ ఫ్లెక్సీలు, బ్యానర్స్

స్థానిక ప్రజలు కమలా హ్యారీస్ తాత గోపాలన్ అభిమానులు ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఇదే సందర్బంగా మన్నార్ గుడితో పాటు తులసేంద్రపురం పరిసర ప్రాంతాల్లోని రహదారుల్లో కమలా హ్యారీస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు భారీగా ఏర్పాటు చేసి ఆమె కచ్చితంగా విజయం సాధిస్తారని స్థానిక ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారీస్ విజయం సాధించాలని తమిళనాడులోని అనేక జిల్లాల్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

English summary
US election 2020: A special Pooja was held at the Kula Deivam Temple in her hometown of Kamala Harris to win the US Vice Presidential election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X