చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీకాంత్ యూటర్న్ తో పొలిటికల్ స్క్రీన్ పైకి ఇళయదళపతి విజయ్..31న పార్టీ ప్రకటన?

|
Google Oneindia TeluguNews

తమిళనాడు రాజకీయాల్లో శర వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయాల్లో చక్రం తిప్పుతాడు అనుకుంటే, అనూహ్యంగా ఆయన రాజకీయ పార్టీ పెట్టకుండానే ప్రజలకు సేవ చేస్తా అంటూ, పార్టీ ప్రకటనను విరమించుకున్నారు. నో పాలిటిక్స్ అని తేల్చి చెప్పేశారు. ఇదిలా ఉంటే మరో స్టార్ హీరో ఇప్పుడు తమిళ పొలిటికల్ స్క్రీన్ పైకి రావడానికి సన్నద్ధమవుతున్నట్లుగా తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

విజయ్ రాజకీయ ఆరంగేట్రంపై తమిళనాడు రాజకీయాలలో చర్చ

విజయ్ రాజకీయ ఆరంగేట్రంపై తమిళనాడు రాజకీయాలలో చర్చ

ఇళయదళపతి విజయ్ రాజకీయ ఆరంగేట్రంపై తమిళనాడు రాజకీయాలలో చర్చ జరుగుతోంది. విజయ్ తన పార్టీ పేరును ఎన్నికల సంఘంలో కూడా రిజిస్ట్రేషన్ చేయించినట్టు వార్తలొచ్చాయి. పీపుల్స్ మూమెంట్ సంస్థ పెట్టి సామాజిక కార్యక్రమాలతో దూసుకుపోతున్న విజయ్ తన పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం .ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కం గా విజయ్ పార్టీ పేరు ఉండనుందని, విజయ్ పీపుల్స్ మూమెంట్ గా ఉన్న సంస్థను పార్టీగా మారుస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

మీ కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైందని అభిమానులకు చెప్పిన విజయ్

మీ కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైందని అభిమానులకు చెప్పిన విజయ్

గత కొద్దిరోజులుగా రాజకీయాలపై దృష్టి సారించి ఏం జరుగుతుందో అని జాగ్రత్తగా గమనిస్తున్న విజయ్ ప్రస్తుతం రజనీకాంత్ పార్టీ పెట్టడంపై వెనక్కి తగ్గడంతో, విజయ్ ఎంట్రీ ఇస్తాడు అని అభిమానులు భావిస్తున్నారు .ఇప్పటికే తమిళనాడు సీఎం పళని స్వామిని కలిసిన విజయ్ , రాజకీయంగా వేస్తున్న అడుగులపై రాజకీయ విశ్లేషకులు దృష్టిసారించారు ఇటీవల రాజకీయ ప్రవేశంపై అభిమానులను సంతృప్తి పరిచే ప్రకటన చేసిన విజయ్ మీ కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైందని అభిమానులకు చెప్పారు.

ఈనెల 31వ తేదీన విజయ్ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని చర్చ

ఈనెల 31వ తేదీన విజయ్ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని చర్చ

ఇప్పటివరకు మక్కల్ ఇయ్యక్కంలో ఉన్న అభిమానులకు ఇతర పార్టీల్లోకి వెళ్లవద్దని సందేశం పంపారు. ఇక తాజాగా ఈనెల 31వ తేదీన విజయ్ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని తమిళ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. ఈనెల 31వ తేదీన పార్టీని ప్రకటిస్తానని రజనీకాంత్ ప్రకటన చేసి వెనక్కి తగ్గగా , అదే రోజు విజయ్ పార్టీ ప్రకటన ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత అనేది ఈ రెండు రోజుల్లోనే తేలనుంది.

ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ ప్రచార హోరు .. తమిళనాట రసవత్తర రాజకీయం

ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ ప్రచార హోరు .. తమిళనాట రసవత్తర రాజకీయం

ఇప్పటికే తమిళ రాజకీయాలో సంచలనం సృష్టించటానికి కమల్ హాసన్ రంగంలోకి దిగారు . ఇప్పటి నుండే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు . రజనీకాంత్ పార్టీ పెడితే పొత్తుపై చర్చిస్తానని చెప్పారు. ఇప్పుడు రజనీకాంత్ పార్టీ పెట్టనని ప్రకటన చెయ్యటంతో రజనీకాంత్ ను తన పార్టీకి మద్దతుగా నిలవాలని కోరే అవకాశం కూడా లేకపోలేదు .ఇదే సమయంలో విజయ్ కూడా పార్టీ పెట్టాలని పావులు కదుపుతున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ తమిళనాడు రాజకీయాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలు, ఊహించని పరిణామాలకు, అనుకోని రాజకీయ పార్టీలకు, రసవత్తర ఘట్టాలకు వేదిక కాబోతుంది అనేది మాత్రం వాస్తవం.

English summary
Ilayathalapathy Vijay's political entry is being discussed in Tamil Nadu politics. Rajinikanth's party on the 31st december has backfired, and the news on the same day Vijay party announcement is hot topic now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X