చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sasikala: చిన్నమ్మకు సినిమా కష్టాలు, దెబ్బతో సీన్ ఫుల్ రివర్స్, కోర్టుకు ఫ్యామిలీ, కథ వేరేగా ఉంది!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే. శశికళ నటరాజ్ కు మెరుగైన చికిత్స అందించడానికి ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి కోర్టును ఆశ్రయించాలని చిన్నమ్మ కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వీకే. శశికళ ప్రస్తుతం కరోనా పాజిటివ్ తో బెంగళూరులోని శివాజీనగర్ లోని బౌరింగ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పోందుతున్నారు. బౌరింగ్ ఆసుపత్రి నుంచి వీకే. శశికళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి అనుమతి కోసం ఆమె కుటుంబ సభ్యులు నేడు (శుక్రవారం) కోర్టును ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఐదు రోజుల్లో జైలు నుంచి విడుదల కావాల్సిన నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి చిన్నమ్మ అంటూ ఆమె అభిమానులు విచారంలో మునిగిపోయారు.

lover boy: వీడు పోటుగాడురా బుజ్జీ, 22 ఏళ్లకే 11 పెళ్లిళ్లు, ఫస్ట్ నైట్ పనిమనిషితో, బెడ్ రూమ్ లో భార్యకు సినిమాlover boy: వీడు పోటుగాడురా బుజ్జీ, 22 ఏళ్లకే 11 పెళ్లిళ్లు, ఫస్ట్ నైట్ పనిమనిషితో, బెడ్ రూమ్ లో భార్యకు సినిమా

జైలు నుంచి బౌరింగ్ వరకు చిన్నమ్మ

జైలు నుంచి బౌరింగ్ వరకు చిన్నమ్మ

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళ ఇదే నెల 27వ తేదీ బుధవారం జైలు నుంచి విడుదల కావలసి ఉంది. ఇదే సమయంలో శశికళ అనారోగ్యానికి గురి కావడంతో ఆమెకు బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. మొదట జ్వరం అని వెలుగు చూసినా సీటీ స్కానింగ్ లో శశికళకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆమెను బెంగళూరులోని శివాజీనగర్ లోని బౌరింగ్ ఆసుపత్రిలోకి కరోనా వార్డుకు తరలించారు.

హెల్త్ బులెటిన్ తో బేజారు

హెల్త్ బులెటిన్ తో బేజారు

శుక్రవారం ఉదయం బౌరింగ్ ఆసుపత్రి వర్గాలు వీకే. శశికళ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శశికళకు కరోనా వైరస్ తో బాధపడుతున్నారని, ఆమెకు నిరంతరం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శశికళ ఆరోగ్యంపై ఆమె కుటుంబ సభ్యులతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (MMMK) పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కోర్టుకు చిన్నమ్మ ఫ్యామిలీ

కోర్టుకు చిన్నమ్మ ఫ్యామిలీ

అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వీకే. శశికళ ప్రస్తుతం కరోనా పాజిటివ్ తో బెంగళూరులోని శివాజీనగర్ లోని బౌరింగ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పోందుతున్నారు. బౌరింగ్ ఆసుపత్రి నుంచి వీకే. శశికళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి అనుమతి కోసం ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యారు. శశికళకు ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించి ఆమె కోలుకునేలా చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

బెంగళూరు టూ చెన్నైకి భారీ ర్యాలీ

బెంగళూరు టూ చెన్నైకి భారీ ర్యాలీ


జనవరి 27వ తేదీన శశికళ జైలు నుంచి విడుదలై ఉంటే ఆ కథ వేరుగా ఉండేది. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ నుంచి నేరుగా హోసూరు మీదుగా చెన్నై వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ వర్గాలు నిర్ణయించాయి. హోసూరు నుంచి చెన్నై వరకు ఇప్పటికే శశికళ ఫెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చెయ్యడంలో టీటీవీ. దినకరన్ వర్గీయులు బిజీ అయ్యారు. అయితే సీన్ రివర్స్ కావడంతో శశికళ వర్గీయులు ఆయోమయంలో పడిపోయారు.

English summary
VK Sasikala health: Sasikala treated with oxygen support for lungs infection in Victoria government hospital in Bangalore. Her family is planning to move court to shifting her to a private hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X