చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sasikala శపథం, పార్టీ నాదే, జెండా నాదే, నా సత్తా చూపిస్తా, వస్తా, నేను వాళ్లకే బానిస!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ బెంగళూరు/ న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ నటరాజన్ అలియాస్ చిన్నమ్మ శశికళ తమిళనాడు ప్రభుత్వానికి చాలెంజ్ చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా, అన్నాడీఎంకే పార్టీని, ఆ పార్టీ జెండాను స్వాధీనం చేసుకుంటా, అందుకు ఎంతవరకైనా వెళ్లడానికి నేను సిద్దంగా ఉన్నానని చిన్నమ్మ శపథం చేశారు.

తాను పార్టీ కార్యకర్తలకే బానిస, మరెవ్వరికి కాదు, త్వరలో నేను రాజకీయాల్లో రావడం కాయం, నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరని మంగమ్మశపథం టైపులో చిన్నమ్మ శశికళ శపథం చేసి తమిళనాడులోని అధికాపార్టీ నాయకులను హెచ్చరించారు. అమ్మ (జయలలిత) ఆశీర్వాదం, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల మద్దతు తనకే ఉందని శశికళ మరోసారి చెప్పడం కలకలం రేపింది.

Party flag: చిన్నమ్మ మీద చిందులు వేసిన కుష్బు, మేడమ్ కు సీన్ లేదు, వాళ్లు మా ఫ్రెండ్స్!Party flag: చిన్నమ్మ మీద చిందులు వేసిన కుష్బు, మేడమ్ కు సీన్ లేదు, వాళ్లు మా ఫ్రెండ్స్!

క్వారంటైన్ కోసం లేట్

క్వారంటైన్ కోసం లేట్

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో నాలుగు ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన చిన్నమ్మ శశికళ ఇటీవల జైలు శిక్ష ముగించుకుని బయటకు వచ్చారు. కరోనా బారినపడిన శశికళ బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తరువాత దేవనహళ్ళి సమీపంలోని ప్రైవేటు రిసార్టులో విశ్రాంతి తీసుకున్నారు. కరోనా సోకిన తరువాత శశికళ క్వారంటైన్ లో కొంతకాలం గడిపారు.

అదిరిపోయే వెల్ కమ్

అదిరిపోయే వెల్ కమ్

బెంగళూరు నగర శివార్లలోని రిసార్టు నుంచి శశికళ జయలలిత ఉపయోగించిన కారులో తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ జెండాతో హోసూరు మీదుగా చెన్నైకి చేరుకున్నారు. తమిళనాడులోని హోసూరులో అడుగుపెట్టిన శశికళకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శశికళ తమిళనాడు ఎంట్రీకి అదిరిపోయే వెల్ కమ్ పార్టీ ఏర్పాటు చేసి నానా హంగామా చేశారు.

కుప్పంలో ఏం చెప్పారంటే?

కుప్పంలో ఏం చెప్పారంటే?

కర్ణాటక సరిహద్దులోని క్రిష్ణగిరి జిల్లాలోని (తమిళనాడు) కందికుప్పంతో పాటు అనేక ప్రాంతాల్లో చిన్నమ్మ శశికళ కారులో నుంచే అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. నన్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తే బంతిలాగా పైకి ఎగిరి వస్తానని, నన్ను అణిచివేయాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని చిన్నమ్మ శశికళ తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

డ్రామాలు ఆడుతున్నారు

డ్రామాలు ఆడుతున్నారు

మంగళవారం వేకువ జామున 4 గంటల సమయంలో చెన్నై చేరుకున్న శశికళ నటరాజన్ మెరీనా బీచ్ లోని అమ్మ సమాధిని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం టీ నగర్ లోని ఎంజీఆర్ నివాసంలో అమ్మ జయలలిత చిత్రపఠానికి, ఎంజీఆర్ విగ్రహానికి చిన్నమ్మ శశికళ, ఆమె మేనల్లుడు, చెన్నై ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ నివాళులు అర్పించారు. తన విషయంలో తమిళనాడు ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని, అందరి సంగతి త్వరలోనే చూస్తానని శశికళ తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పిన్ టూ పిన్ చెబుతా

పిన్ టూ పిన్ చెబుతా

చెన్నైలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన శశికళ త్వరలో తాను మీడియా ముందుకు వస్తానని, తన కార్యచరణ గురించి పిన్ టూ పిన్ చెబుతానని, తాను క్రీయాశీల రాజకీయాల్లోకి వస్తానని, తనను ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. కరోనా వచ్చినా అమ్మ జయలలిత ఆశీర్వాదంతో తాను త్వరగా కోలుకున్నానని, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల అసలైన మద్దతు తనకే ఉందని శశికళ ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ నాదే... జెండా నాదే

పార్టీ నాదే... జెండా నాదే

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా, అన్నాడీఎంకే పార్టీని, ఆ పార్టీ జెండాను స్వాధీనం చేసుకుంటా, అందుకు ఎంతవరకైనా నేను సిద్దంగా ఉన్నానని చిన్నమ్మ శపథం చేశారు. తాను పార్టీ కార్యకర్తలకే బానిస, మరెవ్వరికి కాదు, త్వరలో నేను రాజకీయాల్లో రావడం కాయం, నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరని శశికళ మంగమ్మశపథం టైపులో తమిళనాడులోని అధికాపార్టీ నాయకులను హెచ్చరించారు.

కారు నాదే.... ఆ హక్కు నాకు ఉంది

కారు నాదే.... ఆ హక్కు నాకు ఉంది

అమ్మ ఆశీర్వాదం, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల మద్దతు తనకే ఉందని శశికళ మరోసారి చెప్పడం కలకలం రేపింది. అంతకు తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో ముందు శశికళ కారుకు ఉన్న అన్నాడీఎంకే పార్టీ జెండాను తొలగించడానికి తమిళనాడు పోలీసులు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. అన్నాడీఎంకే పార్టీ నుంచి పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి అనంతరం శశికళ వర్గంలోకి జంప్ అయిన ఓ నాయకుడు ఆ కారు నాదే అని వాదించడం, ఆ పార్టీ జెండాను ఉపయోగించుకోవడం తన హక్కు అని వాదించడంతో పోలీసులు చేతులు ఎత్తేసి ఏమీ చెయ్యలేకపోయారు.

English summary
VK Sasikala reaches Chennai At today early morning 4 am. She travelled Chennai with big welcome.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X