• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Wife: హ్యాపీలైఫ్, 19 ఏళ్ల క్రితం పెళ్లి, విడాకుల కేసు, కోర్టు ఆవరణంలో భార్య ఇష్టం వచ్చినట్లు పొడిచిన భర్త!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ పెరంబలూరు: కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లి చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులను చూసి వాళ్లు, కుటుంబ సభ్యులు, బంధువులు చాలా సంతోషించారు. దంపతులు అంటే ఇలా ఉండాలి అంటూ వాళ్లను పొగిడేశారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కలిసి కాపురం చెయ్యలేమని డిసైడ్ అయిన దంపతులు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.

విడాకుల కోసం కొన్ని సంవత్సరాల నుంచి దంపతులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు విచారణకు హాజరైన దంపతులు వాయిదా ముగించుకుని కోర్టు బయటకు వెళ్లారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త కోర్టు ఆవరణంలోనే కత్తి తీసుకుని అతని భార్యను దారుణంగా పొడిచేయడం కలకలం రేపింది.

Illegal affair: భార్య లేడీస్ టైలర్, భర్తకు 24 గంటలు డౌట్, సీక్రేట్ ఏజెంట్ ?, సింపుల్ గా చంపేసి డ్రామా!Illegal affair: భార్య లేడీస్ టైలర్, భర్తకు 24 గంటలు డౌట్, సీక్రేట్ ఏజెంట్ ?, సింపుల్ గా చంపేసి డ్రామా!

19 ఏళ్ల క్రితం పెళ్లి

19 ఏళ్ల క్రితం పెళ్లి

తమిళనాడులోని పెరంబూరులో కామరాజ్, సుధా నివాసం ఉంటున్నారు. 19 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లి చేసుకున్న కామరాజ్, సుధా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. కామరాజ్, సుధా దంపతులను చూసి వాళ్లు, కుటుంబ సభ్యులు, బంధువులు చాలా సంతోషించారు. దంపతులు అంటే ఇలా ఉండాలి అంటూ సుధా, కామరాజ్ ను పొగిడేశారు.

దంపతుల మద్య తేడాలు

దంపతుల మద్య తేడాలు

కొన్ని సంవత్సరాల క్రితం కామరాజ్, సుధా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రతిరోజు కామరాజ్, సుధా ఇంటిలో గొడవపడ్డారు. ఓ వ్యక్తి కారణంగా కామరాజ్, సుధా దంపతులు రాయి, టెంకాయిలా తయారైనారు.

విడాకుల కోసం కోర్టుకు దంపతులు

విడాకుల కోసం కోర్టుకు దంపతులు

రానురాను ఇంట్లో కామరాజ్, సుధా పోట్లాడుకోవడం ఎక్కువ అయ్యింది. ఇక కలిసి కాపురం చెయ్యలేమని డిసైడ్ అయిన కామరాజ్, సుధా దంపతులు 7 సంవత్సరాల క్రితం విడాకుల కోసం పెరంబూరు జిల్లా కోర్టును ఆశ్రయించారు. విడాకుల కోసం కొన్ని సంవత్సరాల నుంచి కామరాజ్, సుధా దంపతులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.

కోర్టు ఆవరణంలో భార్యను పొడిచేసిన భర్త

కోర్టు ఆవరణంలో భార్యను పొడిచేసిన భర్త

విడాకుల పిటిషన్ విచారణ కోసం కోర్టుకు హాజరైన కామరాజ్, సుధా దంపతులు కోర్టు వాయిదా ముగించుకుని కోర్టు బయటకు వెళ్లారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన కామరాజ్ కోర్టు ఆవరణంలోనే కత్తి తీసుకుని అతని భార్య సుధాను అనేక చోట్ల దారుణంగా పొడిచేయడం కలకలం రేపింది. సుధాను దారుణంగా పొడిచేసిన కామరాజ్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. సుధా పరిస్థితి విషమంగా ఉందని, ఆమె చికిత్స పొందుతున్నదని, కామరాజ్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Wife: A woman was stabbed several times by her husband outside a court in the Perambalur in Tamil Nadu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X