Wife: ఆరు హత్యలు, ఫేమస్ రౌడీషీటర్ మిస్సింగ్, సుబ్బలక్ష్మి w/o late అని రాసింది, మ్యాటర్ లీక్, మరిదితో!
చెన్నై/ విరూద్ నగర్: రౌడీషీటర్ గా పేరు పొందిన వ్యక్తి ఆ ప్రాంతంలోని ప్రజలకు నిద్రలేకుండా చేశాడు. ఆరు హత్యలు చేసిన ఆ రౌడీషీటర్ మీద ఇప్పటికే డజనుకు పైగా క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. రౌడీషీటర్ కు భార్య ఉంది. రౌడీషీటర్ కు చెల్లెలితో పాటు బంధువులు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. హత్య కేసులతో పాటు అనేక కేసులు వాయిదాలకు వెళ్లి వస్తున్న రౌడీషీటర్ నాలుగు సంవత్సరాల క్రితం ఒక్కసారిగా మాయం అయ్యాడు. పోలీసులు రెండు సంవత్సరాలు పాటు అతని కోసం గాలించినా అతని ఆచూకి చిక్కలేదు.
రౌడీషీటర్ కనపడటం లేదని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టకపోవడంతో ధరిద్రం పోయిందని స్థానిక పోలీసులు సైలెంట్ అయిపోయారు. ఇటీవల రౌడీషీటర్ భార్య, ఆమె అడపడుచు మధ్య డబ్బు విషయంలో తేడాలు వచ్చాయి. తన భర్త దగ్గర తన ఆడపడుచు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుందని, డబ్బు తిరిగి ఇవ్వడం లేదని పోలీసు కేసు పెట్టింది. రౌడీషీటర్ భార్యను, ఆ రౌడీ చెల్లెలిని పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. ఆ సమయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యాలని ఎస్ఐ రౌడీషీటర్ భార్యకు చెప్పాడు.
ఆ సమయంలో రౌడీషీటర్ భార్య ఆమె భర్త పేరు ముందు దివంగత అని రాయడంతో ఎస్ఐ షాక్ అయ్యాడు. రౌడీషీటర్ చనిపోయాడా ?, ఎలా చనిపోయాడు ?, ఎవరు చంపేశారు ?, అతను చనిపోయినట్లు పోలీసు రికార్డుల్లో లేదని ,ఆ విషయం ఇంత వరకు బయటకు రాలేదు కదా అంటూ ఆరా తీశాడు. భార్య చేసిన చిన్నపొరపాటుతో పోలీసులు రంగంలోకి దిగారు. రౌడీషీటర్ హత్య కేసులో నాలుగు సంవత్సరాల తరువాత అతని భార్య, ఆమె సోదరి భర్త పేరు బయటకు రావడంతో పోలీసులతో పాటు రౌడీషీటర్ కుటుంబ సభ్యులు హడలిపోయారు. రౌడీషీటర్ ను ఎందుకు హత్య చేశారు అనే విషయాన్ని అతని భార్య నోటి నుంచి పిన్ టూ పిన్ బయటకులాగేశారు.
Illegal
affair:
ప్రియుడి
కోసం
కిలాడీ
తల్లి
బిడ్డలను
ఏం
చేసిందంటే
?,
భర్తకు
ఫోన్
చేసి
డ్రామాలు,
చరణ్!

ఆరు హత్య కేసులు... లెక్కకు మించి క్రిమినల్ కేసులు
తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లాలోని సితూర్ ప్రాంతంలో మాదస్వామి అలియాస్ స్వామి అనే రౌడీషీటర్ నివాసం ఉంటున్నాడు. రౌడీషీటర్ గా పేరు పొందిన మాదస్వామి ఆ ప్రాంతంలోని ప్రజలకు నిద్రలేకుండా చేశాడు. ఆరు హత్యలు చేసిన రౌడీషీటర్ మాదస్వామి మీద ఇప్పటికే డజనుకు పైగా క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.

నాలుగేళ్ల క్రితం మాయం
రౌడీషీటర్ మాదస్వామికి సుబ్బలక్ష్మి అలియాస్ సుబ్బు అనే భార్య ఉంది. నేరాలు చేస్తున్న మాదస్వామి అతని భార్య సుబ్బలక్ష్మితో సంతోషంగానే కాలం గడిపేవాడు. రౌడీషీటర్ కు చెల్లెలు రాజ్యలక్ష్మితో పాటు పాటు బంధువులు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. హత్య కేసులతో పాటు అనేక కేసులు వాయిదాలకు వెళ్లి వస్తున్న రౌడీషీటర్ మాదస్వామి నాలుగు సంవత్సరాల క్రితం ఒక్కసారిగా మాయం అయ్యాడు.

ధరిద్రం పోయిందని అనుకున్న పోలీసులు
పోలీసులు రెండు సంవత్సరాలు పాటు రౌడీషీటర్ మాదస్వామి కోసం గాలించినా అతని ఆచూకి చిక్కలేదు. రౌడీషీటర్ మాదస్వామి కనపడటం లేదని అతని భార్య సుబ్బలక్ష్మితో పాటు అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టకపోవడంతో ధరిద్రం పోయిందని స్థానిక పోలీసులు సైలెంట్ అయిపోయారు. మాదస్వామి పరారీలో ఉన్నాడని పోలీసులు రికార్డుల్లో ఎక్కించారు.

డబ్బుల విషయంలో ఆడపడుచుల మద్య తేడా వచ్చింది
ఇటీవల రౌడీషీటర్ భార్య సుబ్బలక్ష్మి, ఆమె అడపడుచు రాజ్యలక్ష్మిల మధ్య డబ్బు విషయంలో తేడాలు వచ్చాయి. తన భర్త మాదస్వామి దగ్గర తన ఆడపడుచు రాజ్యలక్ష్మి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుందని, ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదని రౌడీషీటర్ మాదస్వామి భార్య సుబ్బలక్ష్మి పోలీసు కేసు పెట్టింది. రౌడీషీటర్ మాదస్వామి భార్య సుబ్బలక్ష్మిని, ఆ రౌడీ చెల్లెలు రాజ్యలక్ష్మిని పోలీసులు స్టేషన్ కు పిలిపించారు.

భర్త పేరు ముందు దివంగత అని రాసిన భార్య
ఆ సమయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యాలని ఎస్ఐ మహాలింగం రౌడీషీటర్ మాదస్వామి భార్య సుబ్బలక్ష్మికి చెప్పాడు. ఆ సమయంలో రౌడీషీటర్ మాదస్వామి భార్య సుబ్బలక్ష్మి పోలీసులకు రాసి ఇచ్చిన అర్జీలో సుబ్బలక్ష్మి, w/o మాదస్వామి (late) అని రాసి ఇచ్చింది. సుబ్బలక్ష్మి ఆమె భర్త మాదస్వామి పేరు ముందు దివంగత అని రాయడంతో ఎస్ఐ మహాలింగం షాక్ అయ్యాడు.

మ్యాటర్ మొత్తం లాగేసిన ఎస్ఐ
ఎస్ఐ మహాలింగం ఆయన పోలీసు మైండ్ ఉపయోగించి చిన్నగా ఆరా తీశారు. రౌడీషీటర్ మాదస్వామి చనిపోయాడా ?, ఎలా చనిపోయాడు ?, అతన్ని ఎవరైనా చంపేశారా ?, అతను చనిపోయినట్లు పోలీసు రికార్డుల్లో ఎక్కడా లేదని, అతను మిస్సింగ్ అని మాత్రమే ఉందని, ఆ విషయం ఇంత వరకు ఎందుకు బయటకు రాలేదు అని ఎస్ఐ మహాలింగం ఆరా తీశాడు.

నాలుగేళ్ల ముందే చంపేసిన భార్య, మరిది
రౌడీషీటర్ మాదస్వామి భార్య సుబ్బలక్ష్మి చేసిన చిన్నపొరపాటుతో పోలీసులు రంగంలోకి దిగారు. రౌడీషీటర్ మాదస్వామి హత్య కేసులో నాలుగు సంవత్సరాల తరువాత అతని భార్య సుబ్బలక్ష్మి, ఆమె సోదరి భర్త విజయ్ కుమార్ పేరు బయటకు రావడంతో పోలీసులతో పాటు రౌడీషీటర్ కుటుంబ సభ్యులు హడలిపోయారు.

పిన్ టూ పిన్ చెప్పిన భార్య
రౌడీషీటర్ మాదస్వామిని ఎందుకు హత్య చేశారు అనే విషయాన్ని అతని భార్య సుబ్బలక్ష్మి నోటి నుంచి పిన్ టూ పిన్ బయటకులాగేశారు. నాలుగు సంవత్సరాల క్రితం తన సోదరి మీద తన భర్త మాదస్వామి దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో విజయ్ కుమార్ అతన్ని చంపేశాడని సుబ్బలక్ష్మి పోలీసులకు చెప్పింది. మాదస్వామిని హత్య చేసిన తరువాత శవాన్ని గోనె సంచిలో మూటకట్టి ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ కనుమల్లోని భూమిలో పాతిపెట్టామని సుబ్బలక్ష్మి అంగీకరించింది.

చేసిన పాపం ఊరికే పోతుందా?
సుబ్బలక్ష్మి ఇచ్చిన సమాచారం మేరకు నాలుగు సంవత్సరాల తరువాత రౌడీషీటర్ మాదస్వామి శవాన్ని పాతిపెట్టిన ప్రాంతంలో తవ్విన పోలీసులు ఎముకలు తీసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. భార్య సుబ్బలక్ష్మి చేసిన చిన్న పొరపాటుతో నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన రౌడీషీటర్ మాదస్వామి హత్య కేసు బయటకు కావడం హాట్ టాపిక్ అయ్యింది.