• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Wife: పర్సనల్ లైఫ్ లో టార్చర్, భర్త, అత్త ఎంట్రీ, వీడియో తీసి భార్య ఆత్మహత్య, అదే మ్యాటర్ లో!

|

చెన్నై/తుత్తకూడి: పెళ్లి చేసుకుని అత్తగారింటిలో అడుగుపెట్టిన యువతి భర్తతో సంతోషంగా కాపురం చేస్తూ పిల్లాపాపలతో కలిసి జీవించాలని కలలుకనింది. తల్లిదండ్రులు చూపించిన వ్యక్తినే వివాహం చేసుకున్న ఆ యువతి భర్తతో చక్కగా కాపురం చేస్తోంది. అదే సమయంలో కట్నం దాహంతో మొగుడు, అత్తా తదితరులు కలిసి యువతిని చిత్రహింసలకు గురి చేశారు.

పెద్తలు చాలాసార్లు రాజీ చేసి వారి కాపురం చక్కదిద్దాలని అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. భర్తకు ఫోన్ చేసిన భర్త అమ్మనాబూతులు తిట్టి గొడవ పెట్టుకున్నాడు. భర్తతో వీడియో కాల్ లో మాట్లాడిన తరువాత జీవితంపై విరక్తి చెందిన భార్య 7 నెలల కొడుకును పక్క రూమ్ లో వదిలేసి తన భర్త, అత్త తనను ఎలా టార్చర్ పెట్టారో పూర్తిగా వివరిస్తూ ఓ వీడియో తీసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Illegal affair: పూజారికి గుడిలో అసిస్టెంట్, ఇంట్లో ఆంటీకి ?, పువ్వులు పట్టిన చేతితో కత్తి!Illegal affair: పూజారికి గుడిలో అసిస్టెంట్, ఇంట్లో ఆంటీకి ?, పువ్వులు పట్టిన చేతితో కత్తి!

ఆరోజు గ్రాండ్ గా పెళ్లి

ఆరోజు గ్రాండ్ గా పెళ్లి

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా కోవిల్ పట్టిలోని సుబర్ నగర్ లోని సుదర్శన్ గార్డెన్ లో నివాసం ఉంటున్న సుజాత అలియాస్ సుజా (29) అనే యువతి తల్లిదండ్రులతో కలిసి చాలా సంతోషంగా జీవనం సాగించేది. విరూద్ నగర్ జిల్లా మణిరపట్టికి చెందిన వీరరాఘవన్ (31) అనే యువకుడితో సుజా వివాహం చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. 2019లో తల్లిదండ్రులు చూపించిన వీరరాఘవన్ తో సుజా వివాహం గ్రాండ్ గా జరిగింది.

భారీ మొత్తంలో కట్నం

భారీ మొత్తంలో కట్నం

కోవిల్ పట్టి ప్రాంతంలో వీరరాఘవన్ సొంతంగా ఆటోమొబైల్ షోరూమ్ నిర్వహిస్తున్నాడు. వీరరాఘవన్ కు పెద్ద వ్యాపారం ఉండటంతో తమ కుమార్తె సుజా చాలా సంతోషంగా గడుపుతుందని ఆలోచించిన ఆమె తల్లిదండ్రులు పెళ్లి సమయంలో కట్నం కింద భారీ మొత్తంలో డబ్బు, బంగారు నగలు, విలువైన వస్తువులు తీసిచ్చారని తెలిసింది.

7 నెలల కొడుకు

7 నెలల కొడుకు

వీరరాఘవన్, సుజా దంపతులకు 7 నెలల కొడుకు ఉన్నాడు. పండంటి బిడ్డ పుట్టడంతో కొడుకును చూసుకుంటూ సుజా చాలా సంతోషంగా జీవిస్తోంది. ఇదే సమయంలో తాను వ్యాపారం విస్తరించడానికి అదనంగా నువ్వు కట్నం తీసుకురావాలని భర్త వీరరాఘవన్ భార్య సుజాకు చెప్పాడు. తాను కట్నం తీసుకురాలేనని, మా తల్లిదండ్రుల దగ్గర అంత డబ్బులు లేవని సుజా భర్త వీరరాఘవన్ కు నచ్చచెబుతూ వస్తోంది.

వంతపాడిన అత్తా, బంధువులు

వంతపాడిన అత్తా, బంధువులు

అదనపుకట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేస్తున్న భర్త వీరరాఘవన్ కు ఆమె తల్లిదండ్రులు కందస్వామి, అముతా వత్తాసు పలుకుతూ కొడలు సుజాను హింసించడం మొదలుపెట్టారని తెలిసింది. ఇదే సమయంలో సత్తూరులో నివాసం ఉంటున్న వీరరాఘవన్ మేనత్త తికలవతి కూడా రంగంలోకి దిగి సుజాను మరింత చిత్రహింసలకు గురి చేసిందని తెలిసింది.

పెద్దలు రాజీ చేసినా?

పెద్దలు రాజీ చేసినా?

తన భర్త వరకట్నం తీసుకురావాలని చిత్రహింసలుకు గురి చేస్తున్నారని, తాను టార్చర్ తట్టుకోలేకపోతున్నానని, తాను ఇంటికి వచ్చేస్తానని సుజా ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. 7 నెలల పసికందును తీసుకుని నువ్వు పుట్టింటికి వచ్చేస్తే అందరూ లేనిపోని మాటలు అంటారని సుజాకు ఆమె తల్లిదండ్రులు నచ్చచెప్పారు. పెద్దలు అనేకసార్లు వీరరాఘవన్, సుజా దంపతులకు రాజీ చేసినా మళ్లీ పాత కథే జరుగుతోంది.

పుట్టింటికి వెళ్లిపోయిన సుజా

పుట్టింటికి వెళ్లిపోయిన సుజా

భర్త వీరరాఘవన్, అత్త అముదా టార్చర్ ఎక్కువ కావడంతో తట్టుకోలేని సుజా ఏప్రిల్ 19వ తేదీన 7 నెలల కొడుకును ఎత్తుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ రోజు నుంచి భర్త వీరరాఘవన్ పుట్టింటిలో ఉంటున్న భార్య సుజాకు ఫోన్ చేసి నువ్వు మర్యాదగా ఇంటికి రావాలని, నువ్వు అక్కడే ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని బెదిరిస్తూనే ఉన్నాడు.

  Irrfan Khan పై కొడుకు Babil Khan ఎమోషనల్.. నాన్నకు ప్రేమతో..!! || Oneindia Telugu
  వీడియో తీసి ఆత్మహత్య

  వీడియో తీసి ఆత్మహత్య

  రాత్రి 9 గంటల సమయంలో భర్త వీరరాఘవన్ భార్య సుజాకు వీడియో కాల్ చేసి ఆమెతో గొడవపెట్టుకున్నాడు. ఆ సందర్బంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ సమయంలో వీడియో కాల్ లో మాట్లాడిన సుజా నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని, నువ్వు సుఖంగా ఉండాలని భర్తకు చెప్పి ఫోన్ కట్ చేసింది.

  వెంటనే రూమ్ లోకి వెళ్లిన సుజా తన భర్త, అత్త తనను ఎలా టార్చర్ పెడుతున్నారో అని వివరిస్తూ ఓ వీడియో తీసి తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీడియో కాల్ లో ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి మరీ 7 నెలల చిన్నారి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సుజా ఆత్మహత్యతో ఆమె భర్త వీరరాఘవన్, అత్త అముతా తదితరులు పరారైనారని పోలీసులు అంటున్నారు.

  English summary
  Wife: Husband and mother-in-law are cruel women commits suicide after recording video in Tamil Nadu
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X