• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Marriage scam: జెండా ఎత్తేసిన భార్య, 20 మందితో ఎంజాయ్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు హార్డ్ వేర్ సమస్య, స్కెచ్!

|

చెన్నై/ సౌదీ/ బెంగళూరు: ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయిల పిచ్చి ఉండటంతో ఉద్దరగా డబ్బులు సంపాధించాలని అత్యాశ అతనిలో పెరిగిపోయింది. బాగా డబ్బున్న అమ్మాయిలను పెళ్లి పేరుతో ఎంజాయ్ చెయ్యడం, తరువాత చిక్కినకాడికి దోచుకోవడం అతనికి అలవాటుగా మారిపోయింది. బాగా చదువుకున్న ఆ యువకుడు ఒకేఒక హాలీవుడ్ నిమాను 50 సార్లు చూశాడు. అంతే ఆ హాలీవుడ్ సినిమాలో విలన్ చేసినట్లు 20 మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడి వారికి గులాబ్ జామూన్ తినిపించాడు. అయితే చివరిగా ఓ అమ్మాయి విషయంలో పప్పులోకాలేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు హార్డ్ వేర్ సమస్యతో అడ్డంగా బుక్కైపోయి కటకటాలపాలైనాడు.

Violent wife: అర్దరాత్రి వెళ్లి దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న భర్త, విరహం తట్టుకోలేని భార్య, రివర్స్ గేర్ లో'

 సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం.... అయితే

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం.... అయితే

చెన్నై సిటీలోని అవడి సమీపంలోని తిరుములైవాయల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాకేష్ శర్మ (36) ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేశాడు. చదువులో ముందుండే రాకేష్ శర్మకు మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్న రాకేష్ శర్మాకు ఆ డబ్బులు సరిపోలేదు. ఎలాగైనా ప్రతినెల లక్షల లక్షలు డబ్బులు సంపాధించాలని రాకేష్ ఆలోచించాడు.

సూపర్ ఫిగర్ ఎంట్రీతో !

సూపర్ ఫిగర్ ఎంట్రీతో !


చెన్నైలోని కొడుంగైయూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతిని రాకేష్ శర్మ లైన్ లో పెట్టాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని, ఈ జీవితానికి నువ్వే నాదేవత, నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధిస్తాను అంటూ రాకేష్ శర్మ భారీ సినిమా డైలాగులు చెప్పాడు. అయితే రాకేష్ శర్మ ప్రవర్తనపై ఆమెకు అనుమానం వచ్చింది. యువతి ఆమె తండ్రికి అసలు విషయం చెప్పడంతో ఆయన కోడుంగైయూర్ పోలీసులకు రాకేష్ శర్మ మీద ఫిర్యాదు చెయ్యడంతో అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.

 క్రిమినల్ మైండ్.... లవర్ కు బ్లాక్ మెయిల్

క్రిమినల్ మైండ్.... లవర్ కు బ్లాక్ మెయిల్

యువతితో సన్నిహితంగా తీసుకున్న ఫోటోలు, కొన్ని వీడియోలు రాకేష్ శర్మ దగ్గర ఉన్నాయి. ఆ ఫోటోలు వీడియోలు అడ్డం పెట్టుకున్న రాకేష్ శర్మ తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే తనకు డబ్బులు ఇస్తే నిన్ను వదిలి వెళ్లిపోతానని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. యువతి తండ్రి మళ్లీ కొడుంగైయూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్లాన్ ప్రకారం డబ్బులు తీసుకోవడానికి మాధవరం ప్రాంతం దగ్గరకు రావాలని ఆమె రాకేష్ శర్మకు ఫోన్ చేసి చెప్పింది.

 సూపర్ స్కెచ్ తో హడల్

సూపర్ స్కెచ్ తో హడల్

యువతి చెప్పిన మాధవరంలోని ప్రాంతానికి వెళ్లిన రాకేష్ శర్మ డబ్బులు తీసుకుని హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. అసలే ఆ డ్రామా స్కెచ్ వేసిన పోలీసులు ఎంట్రీ ఇచ్చి డబ్బుతో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించి రాకేష్ శర్మను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుకోవడంతో అతని దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. తరువాత రాకేష్ శర్మాను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బెండ్ తీశారు.

 జెండా ఎత్తేసిన టెక్కీ భార్య

జెండా ఎత్తేసిన టెక్కీ భార్య

రాకేష్ శర్మకు ఇంతకు ముందే పెద్దలు నిశ్చయించిన అమ్మాయితో వివాహం అయ్యిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే రాకేష్ శర్మ ప్రవర్తనపై విసిగిపోయిన భార్య జెండా ఎత్తేసిందని వెలుగు చూసింది. రాకేష్ శర్మాకు దూరంగా ఉంటున్న అతని భార్య పుట్టింటిలో ఉంటున్నదని పోలీసులు అన్నారు. భార్యకు దూరంగా ఉంటున్న రాకేష్ శర్మ అమాయకులైన అమ్మాయిలకు వలవేసి పెళ్లి పేరుతో వారిని నిలువుదోపిడీ చేస్తున్నాడని చెన్నై సిటీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

హాలీవుడ్ సినిమా 50 సార్లు చూసిన టెక్కీ

హాలీవుడ్ సినిమా 50 సార్లు చూసిన టెక్కీ


రాకేష్ శర్మ ఖతార్ లో ఉద్యోగం చేసేవాడు. ఆ సమయంలో రాకేష్ శర్మ I'M NOT HIM సినిమా 30 సార్లు చూశాడు. సినిమా సీన్లలో లీనమైపోయిన రాకేష్ శర్మకు అంతకు ముందే అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉండటంతో ఎలాగైనా సినిమా స్టైల్లో యువతులను మోసం చెయ్యాలని స్కెచ్ వేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమ్మాయిలకు అనుమానం వచ్చి రాకేష్ శర్మను ప్రశ్నిస్తే I'M NOT HIM, అతను వేరే, నేను వేరు అంటూ సినిమా డైలాగులు చెప్పి చాకచక్యంగా తప్పించుకుంటున్నాడని పోలీసులు అన్నారు.

 అమ్మాయిలతో ఎంజాయ్.... రూ. లక్షలు లూటీ

అమ్మాయిలతో ఎంజాయ్.... రూ. లక్షలు లూటీ


ప్రేమ, పెళ్లి పేరుతో రాకేష్ శర్మ ఇప్పటి వరకు సుమారు 20 మంది అమాయకులైన యువతులను మోసం చేశాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అమ్మాయిలను మోసం చేస్తున్న రాకేష్ శర్మ వారితో ఎంజాయ్ చేసిన తరువాత చిక్కినకాటికి రూ. లక్షల రూపాయలు, భారీ మొత్తంలో బంగారు నగలు లూటీ చేశాడని పోలీసులు చెప్పారు. రాకేష్ మాయమాటలతో మోసపోయిన యువతులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చెయ్యాలని, అతని బండారం బయటపెట్టిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని చెన్నై సిటీ పోలీసులు ఇప్పటికే చెప్పారు. 20 మంది అమ్మాయిలకు గులాబ్ జామున్ తినిపించిన రాకేష్ శర్మను పోలీసులు బెండ్ తీసి జైల్లో పెట్టారు.

English summary
Year Ender 2020: Engineering graduate arrested for Marriage scam in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X