• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: భర్త కోటీశ్వరుడు, భార్య కామాంధురాలు, సోషల్ మీడియా లవర్స్, శ్రీలంక ఆంటీ!

|

చెన్నై/ తంజావూర్/ తిరుచ్చి: విదేశాల్లో ఒకరిని ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు ఇద్దరూ విదేశాల్లో ఎంజాయ్ చేశారు. తరువాత అసలు కథ మొదలైయ్యింది. భర్త పేరుతో భారీగా దిక్కులేని ఆస్తులు ఉన్నాయని భార్యకు తెలిసింది. అంతే తన అందాన్ని అడ్డం పెట్టుకుని ఫేస్ బుక్ లవర్స్, కొందరు న్యాయవాదులు, కిరాయి హంతకులతో భర్తను లేపేయాలని ప్లాన్ వేసింది.

భార్య మర్డర్ ప్లాన్ ఆలస్యం అయినా అందమైన భార్య ఐదు మంది ప్రియులతో హైవేలో ఒకే సారి భర్తను చంపించేసింది. అయితే చనిపోయిన భర్త కలలోకి వచ్చి బెదిరించాడో ? ఏమో ? మొదట పోలీసుల ముందు సినిమా స్టోరీ చెప్పింది. అయితే సీన్ మొత్తం రివర్స్ కావడంతో తనకుతానుగానే భార్య పోలీసులకు చిక్కిపోయింది.

Super wife: క్యాషియర్ భర్త, నా భార్యను చూస్తే మూడ్ రాదు, మెరుపుతీగ అమ్మాయిలు, కంతిరీగ ఆంటీలతో జల్సా!Super wife: క్యాషియర్ భర్త, నా భార్యను చూస్తే మూడ్ రాదు, మెరుపుతీగ అమ్మాయిలు, కంతిరీగ ఆంటీలతో జల్సా!

శ్రీలంక కంత్రీ ఫిగర్

శ్రీలంక కంత్రీ ఫిగర్

శ్రీలంకకు చెందిన హసీనా (42), తమిళనాడుకు చెందిన యూసఫ్ కొన్ని సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా కువైట్ వెళ్లారు. కువైట్ లో హసీనా, యూసఫ్ కు పరిచయం అయ్యింది. ఇద్దరు ఒకే మతానికి చెందిన వారు కావడంతో మరింత దగ్గర అయ్యారు. ఐదు సంవత్సరాల క్రితం యూసఫ్ హసీనా మీద మోజుపడి శారీరకంగా దగ్గర అయ్యాడు. హసీనా యూసఫ్ కు శారీరక సుఖం ఇచ్చి అతన్ని వలలో వేసుకుని పెళ్లి చేసుకుంది.

ఓ హసీనా అంటూ తంజావూర్ షిఫ్ట్... డ్యూయెట్స్

ఓ హసీనా అంటూ తంజావూర్ షిఫ్ట్... డ్యూయెట్స్

కువైట్ నుంచి యూసఫ్, హసీనా తమిళనాడులోని తంజావూరు చేరుకుని కాపురం పెట్టారు. తరువాత యూసఫ్ తన కుటుంబ సభ్యుల ఇంటికి వెలుతున్నానని చెప్పి తరచుగా తిరుచ్చి వెళ్లి వస్తున్నాడు. ఈ సమయంలో క్రిమినల్ మైండ్ ఉన్న హసీనాకు అనుమానం వచ్చి ఆరా తీసింది. ఇంతకు ముందే యూసఫ్ కు పెళ్లి అయ్యిందని, భార్య, పిల్లలు తిరుచ్చిలో ఉన్నారని, అక్కడికే అతను వెళ్లి వస్తున్నాడని హసీనా పసిగట్టింది. అయితే కోటీశ్వరుడు అయిన యూసఫ్ తిరుచ్చిలోని మొదటి భార్య, పిల్లలకు, తంజావూరులోని రెండో భార్య హసీనాకు అన్ని విధాలుగా న్యాయం చూస్తూనే వచ్చాడు. హసీనా మోజులో ఆమె ఇంటిలోనే యూసఫ్ కాలం గడిపాడు.

మొగుడి ఆస్తులతో జల్సా... సోషల్ మీడియా లవర్స్

మొగుడి ఆస్తులతో జల్సా... సోషల్ మీడియా లవర్స్

భర్త యూసఫ్ పేరుతో భారీగా ఆస్తులు ఉన్నాయని, బ్యాంకు లాకర్లో 300 సవర్ల బంగారు నగలు, నగదు, ఆస్తి పత్రాలు ఉన్నాయని హసీనా గుర్తించింది. ఇదే సమయంలో ఉద్యోగరీత్యా యూసఫ్ కువైట్ వెళ్లిపోయాడు. తంజావూరులో ఒంటరిగా ఉంటున్న హసీనా ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యింది. హసీనా విషయాలు కువైట్ లో ఉంటున్న భర్తకు త్వరగా తెలీకపోవడంతో ఆమె మరింత రెచ్చిపోయింది. ఇదే సమయంలో ఫేస్ బుక్ లో హసీనాకు చాలా మంది యువకులు పరిచయం అయ్యారు.

తన అందాన్ని అడ్డం పెట్టుకున్న హసీనా ఫేస్ బుక్ లో పరిచయం అయిన తనకంటే వయసులో చిన్నవారైన నలుగురు యువకులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. తరువాత నలుగురు న్యాయవాదులను శారీరకంగా హసీనా లొంగదీసుకుంది. ఫేస్ బుక్ లవర్స్, తనకు శారీరకంగా లొంగిపోయిన న్యాయవాదుల సహాయంతో తన భర్త ఆస్తి కొట్టేయాలని హసీనా ప్లాన్ వేసింది.

బ్యాంకు మేనేజర్ ను వదలని హసీనా

బ్యాంకు మేనేజర్ ను వదలని హసీనా

యూసఫ్ బ్యాంకు అకౌంట్ లు, లాకర్లు ఉన్న బ్యాంకు మేనేజర్ కు హసీనా గాలం వెయ్యడానికి ప్రయత్నించింది. అయితే బ్యాంకు మేనేజర్ మొదట బెట్టు చేశాడు. తరువాత హసీనా తన అందాన్ని వలవేసి బ్యాంకు మేనేజర్ ను లొంగదీసుకుని అతనికి స్వర్గం చూపించడంతో అతను ఆమెకు దాసోహం అయ్యాడు.

ఇదే సమయంలో బ్యాంకులో ఉన్న యూసఫ్ లాకర్లు తీసిన హసీనా అతని బంగారు నగలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకుంది. నీ భార్య హసీనా నీ కొంప ముంచుతోందని, నీ బ్యాంకు లాకర్లలోని బంగారు నగలు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకుందని తంజావూరులోని ఓ స్నేహితుడి ద్వారా కువైట్ లో ఉంటున్న యూసఫ్ కు సమాచారం అందింది.

భర్త ప్యాంట్ తడిసిపోయింది.... భర్య రెచ్చిపోయింది

భర్త ప్యాంట్ తడిసిపోయింది.... భర్య రెచ్చిపోయింది

గత జనవరి నెలలో కువైట్ నుంచి తమిళనాడు చేరుకున్న యూసఫ్ బ్యాంకు మేనేజర్ ను తన నగలు, ఆస్తి పత్రాలు ఎక్కడా అని నిలదీశాడు. తరువాత రెండో భార్య హసీనాకు విడాకులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. ఇదే సమయంలో హసీనా స్వాధీనం చేసుకున్న ఆస్తులను చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని యూసఫ్ గుట్టుచప్పుడు కాకుండా న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యాడు.

తన ఆధీనంలో ఉన్న ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి తన భర్త ప్రయత్నిస్తున్నాడని పసిగట్టిన హసీనా అతన్ని చంపేయాలని ప్లాన్ వేసింది. నలుగురు న్యాయవాదుల సలహాతో ఫేస్ బుక్ లో లింక్ పెట్టుకున్న ఐదు మంది ప్రియులకు విషయం చెప్పింది. ఫేస్ బుక్ ప్రియులు, న్యాయవాదుల సహకారంతో కిరాయి హంతకులను కలిసిన హసీనా తన భర్తను చంపేస్తే రూ. 10 లక్షలు ఇస్తానని డీల్ మాట్లాడింది. ఇదే సమయంలో 2020 ఏప్రిల్ నుంచి లాక్ డౌన్ అమలు కావడంతో యూసఫ్ మర్డర్ ప్లాన్ రోజురోజుకు ఆలస్యం అవుతూ వచ్చింది.

ప్రియురాలి భర్తను పిండేశారు

ప్రియురాలి భర్తను పిండేశారు

2020 జూన్ 27వ తేదీ యూసఫ్ కారులో తిరుచ్చి- సమయనల్లూరు హైవేలో వెలుతున్నాడు. ఆ సమయంలో హసీనా ప్రియులు ఐదు మంది పక్కాప్లాన్ ప్రకారం పట్టపగలు యూసఫ్ ను వెంటాడి వేటాడి అతి కిరాతకంగా హత్య చేశారు. యూసఫ్ దారుణ హత్య తిరుచ్చిలో కలకలం రేపింది. యూసఫ్ హత్యకు గురైన ప్రాంతం సమీపంలోనే తిరుచ్చి జిల్లా ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలు ఉండటంతో తిరుచ్చి పోలీసులు యూసఫ్ హత్య కేసు సవాలుగా స్వీకరించారు. యూసఫ్ ను ఆమె బంధువులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం పెరిగింది.

మొదటి భార్య టార్గెట్.... దెబ్బకు రెండో భార్య ?

మొదటి భార్య టార్గెట్.... దెబ్బకు రెండో భార్య ?

యూసఫ్ హత్య జరిగిన తరువాత నలుగురు న్యాయవాదులను వెంట పెట్టుకుని నేరుగా తిరుచ్చి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన హసీనా ఓ సినిమా స్టోరీ చెప్పింది. ఆస్తి కోసం యూసఫ్ ను మొదటి భార్య, ఆమె బంధువులు హత్య చేసి ఉంటారని పోలీసులను నమ్మించడానికి హసీనా అనేక ప్రయత్నాలు చేసింది. తాము హసీనాను టచ్ చెయ్యకపోయినా ఏకంగా నలుగురు న్యాయవాదులను వెంట తీసుకు వచ్చిన హసీనా భర్త యూసఫ్ హత్య గురించి వివరాలు చెప్పడంతో తిరుచ్చి పోలీసులకు అనుమానం వచ్చింది. అంతే హసీనాను అదుపులోకి తీసుకున్న తిరుచ్చి మహిళా పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారణ చేశారు.

నా మొగుడు కామాంధుడు..... నేను ?

నా మొగుడు కామాంధుడు..... నేను ?

తన భర్త యూసఫ్ కు ప్రతిరోజు ఓ పరాయి మహిళ కావాలని, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నాడని, అందుకే అమాయకులైన అమ్మాయిల జీవితాలు కాపాడటానికి తాను చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నానని హసీనా మరోసారి మలయాళం సినిమా స్టోరీ చెప్పింది. మళ్లీ పోలీసులు హసీనాను బెండ్ తియ్యడంతో హసీనా తాను ఆస్తికోసం యూసఫ్ ను హత్య చేయించానని అంగీకరించింది. లాక్ డౌన్ సమయంలో పక్కా స్కెచ్ తో భర్త యూసఫ్ ను చంపించిన హసీనాను పోలీసులు అరెస్టు చెయ్యడం 2020లో కలకలం రేపింది. ప్రస్తుతం హసీనా అండ్ కో జైల్లో ఉంటున్నారు.

English summary
Year Ender 2020: Wife killed husband due to illegal relationship and family issue near Trichy in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X