చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మమ్మల్ని వదిలి వెళ్లొద్దు మేడం అంటూ ..టీచర్ ను ఆపి కన్నీరు మున్నీరైన విద్యార్థులు

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ పాఠశాలలు అనగానే సమయానికి రాని టీచర్లు, విద్యా బోధన సరిగా చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న టీచర్లు, అసలు పాఠశాలలకు రాని టీచర్ల గురించి అందరూ చర్చించుకుంటారు. కానీ ఉన్నత విలువలతో విద్యార్థులకు విద్యా బోధన చేయడమే కాకుండా,వారిని తన బిడ్డల్లా ప్రేమతో చూసి,వారికి కావలసిన మౌలిక వసతులు సమకూర్చి విద్యా బోధన చేస్తున్న టీచర్లు కూడా ఉన్నారు.అందుకే అలాంటి టీచర్లు బదిలీ అయితే విద్యార్థుల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. వెళ్లొద్దు మేడం అంటూ ఆ టీచర్ ను పట్టుకుని కన్నీరుమున్నీరయ్యే విద్యార్థుల ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా శాంతిపురంలో చోటుచేసుకుంది.

టీచర్ కోసం ఏడ్చిన జెడ్పీ స్కూల్ విద్యార్థులు

టీచర్ కోసం ఏడ్చిన జెడ్పీ స్కూల్ విద్యార్థులు

శాంతిపురం మండలం సి. బండపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో మూడేళ్లుగా టీ. వేదవతి తెలుగు టీచర్ గా పనిచేస్తునారు. తాజాగా ఆమె బదిలీపై వేరే స్కూలుకు వెళుతున్న ఈ క్రమంలో విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. బోరున ఏడ్చారు. మేడమ్‌ మమ్మల్ని వదిలి వెళ్లొద్దంటూ పిల్లలంతా ఆమె చుట్టూ చేరి ఎనలేని ప్రేమ చూపించారు. చివరకు చెప్పలేనంత బాధతోనే ఆమెకు వీడ్కోలు పలికారు.

 విద్యాబోధనే కాదు విద్యార్థుల అవసరాలు తీర్చిన టీచర్

విద్యాబోధనే కాదు విద్యార్థుల అవసరాలు తీర్చిన టీచర్

ఇంతకీ విద్యార్థులు ఇంతగా బాధ పడ్డారు అంటే ఆ టీచర్ ఏం చేశారు.ఎందుకు అంతగా విద్యార్థులు ఆ టీచర్ కోసం ఏడ్చారు అంటే తెలుగు టీచర్ వేదవతి తనదైన శైలిలో పాఠ్యాంశాలు బోధిస్తూ విద్యార్థులకు చేరువయ్యారు. తెలుగు పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా విద్యార్థులకు అవసరమైన క్రమశిక్షణ,మానవతా విలువలు వంటి అనేక అంశాలను ఆమె బోధించేవారు.అంతేకాదు పేద విద్యార్థుల అవసరాలు తెలుసుకుని వారికి పుస్తకాలు, దుస్తులు కొనిచ్చేవారు. అవసరమైన చోట వారికి ఆర్థిక సహాయం కూడా చేసేవారు.

స్కూల్ లో విద్యార్థులు కోసం తరగతి గది నిర్మించి ఇచ్చిన తెలుగు టీచర్

స్కూల్ లో విద్యార్థులు కోసం తరగతి గది నిర్మించి ఇచ్చిన తెలుగు టీచర్


ఇక విద్యార్థులకు తరగతి గది లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో పాఠశాలకు రూ.6 లక్షలతో తరగతి గదిని నిర్మింఛి ఇచ్చారు అంటే ఆ టీచర్ ఔదార్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా జరిగిన బదిలీల్లో ఆమె పదోన్నతిపై విజయపురం మండలానికి బదిలీ అయ్యారు.రిలీవయ్యేందుకు బుధవారం సి.బండపల్లె పాఠశాలకు చేరుకొన్న ఆమెను చూసి విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు మేడం అంటూ ఆమె చుట్టూ చేరారు.

బదిలీ వెళ్తున్న ఆమెను ఆపి వెళ్లొద్దు టీచర్ అంటూ బోరున విలపించిన విద్యార్థులు .. కన్నీరు పెట్టుకున్న టీచర్

బదిలీ వెళ్తున్న ఆమెను ఆపి వెళ్లొద్దు టీచర్ అంటూ బోరున విలపించిన విద్యార్థులు .. కన్నీరు పెట్టుకున్న టీచర్

ఇంతకాలం తమకు విద్యాబోధన చేసి, తమ అవసరాలు కూడా తీర్చిన టీచర్ వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోయారు. స్కూల్లో ఉన్న పిల్లలందరూ వేదవతి టీచర్ కోసం విలపించిన తీరు మిగతా టీచర్లందరినీ షాక్ కి గురి చేసింది. తనకోసం విలపిస్తున్న చిన్నారుల బాధ చూసి వేదవతి కూడా కన్నీరు పెట్టారు. చక్కగా చదువుకోవాలి అని చెప్పి బాధాతప్త హృదయంతో అక్కడి నుండి నిష్క్రమించారు. ఇక ఈ విషయం తెలిసిన వారంతా టీచర్లందరూ అలా ఉంటే విద్యార్థులు ఉన్నతంగా ఎదుగుతారని, విద్యార్థులకు విద్యా బోధన చేయడమే కాకుండా, వారు ఉన్నతంగా ఎదగడానికి ప్రతి టీచర్ వ్యక్తిగత శ్రద్ధ తో దోహదం చేస్తే బావుంటుందని భావన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వేదవతి టీచర్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు.

English summary
Vedavati worked in chittur district Shantipuram Zone c. Bandapalle ZP High School since three years . Vedavathi works as a Telugu teacher. The students shed tears as they headed to a different school on her latest transfer. they hold her and wept vigorously. Madam don't leave us the students said to the teacher. and all the children joined with her and showed great love.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X