• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వలపు వల.. ఒక్కరు కాదు ముగ్గురు, మరెందరు.. ఇదీ సుహాసినీ కథ

|

వల విసిరుతోంది. అనాధ అని చెబుతోంది. ఇంకేముంది దగ్గరవుతుంది. తనకు ఎవరూ లేరని చెప్పి.. నమ్మిస్తోంది. పెళ్లి కూడా చేసుకుంటుంది. తర్వాత వారి వద్దనుంచి డబ్బులు, నగదు తీసుకుని పరార్ అవుతోంది. కిలాడీ లేడీని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ముగ్గురిని మోసం చేసిన.. తప్పించుకుంది. కానీ చివరకు ఇలా పట్టుబడింది.

ప్రేమ పెళ్లి ఆపై

ప్రేమ పెళ్లి ఆపై

చిత్తూరు జిల్లా విజయపురం మండలం నాగరాజ కండ్రిగకు చెందిన సునీల్ కుమార్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. తిరుపతిలో సత్యనారాయణపురంలో ఉంటున్నాడు. ఏడీబీ ఫైనాన్స్‌లో పనిచేసే సుహాసినితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమను సునీల్ ఇంట్లో పెద్దలు ఒప్పుకోవటంతో.. గతేడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు.

20 గ్రాముల బంగారం..

20 గ్రాముల బంగారం..

పెళ్లిలో సునీల్ తల్లితండ్రులు సుహాసినికి 20 గ్రాముల బంగారం కానుకగా ఇచ్చారు. సుహాసిని కాపురానికి వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి సునీల్ తండ్రి వద్ద రూ. 2లక్షలు తీసుకుంది. సునీల్‌కు తెలియకుండా అతని బంధువుల వద్ద కూడా అప్పు చేసింది. ఈ విషయం తెలిసిన సునీల్ ఆమెను నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గత నెల 8వ తేదీన సుహాసిని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించక పోవటంతో సునీల్ తెలిసిన చోట ఎంక్వైరీ చేశాడు. ఇంట్లో వెతకగా ఆమె ఆధార్ కార్డు దొరకింది. ఆధార్ కార్డ్ ప్రకారం విచారించగా ఆమెకు అప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.

వినయ్..

వినయ్..

రెండేళ్ల క్రితం కొత్తగూడెంకు చెందిన వినయ్ అనే వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుని అతడిని మోసం చేసినట్లు తెలిసింది. సుహాసినిపై అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం తిరుపతి స్విమ్స్, వివేకానంద సర్కిల్ వద్ద సుహాసిని కనపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం తనను సుహాసిని ఇలాగే మోసం చేసి మోసం చేసిందని.. కొత్తగూడెనికి చెందిన వినయ్ అనే వ్యక్తి ఇటీవల వీడియో విడుదల చేశాడు.

వెంకటేశ్వర్లు.. మొదటి భర్త

వెంకటేశ్వర్లు.. మొదటి భర్త

2018 లో సుహాసిని తనకు ఎవరూ లేని అనాధ అని చెప్పి పరిచయం చేసుకుందన్నారు. ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకోవాలని కోరటంతో 2019 మే 22న ప్రేమ వివాహం చేసుకున్నానని వినయ్ తెలిపాడు. పెళ్లి జరిగిన తర్వాత తన కుటుంబ సభ్యులు, బంధువులు వద్దనుంచి తనకు తెలియకుండా రూ.10 లక్షలు తీసుకుందని తెలిపాడు. పెళ్లైన రెండు నెలలకు ఆమె ప్రవర్తనలో మార్పు రావటం గమనించానని వినయ్ తెలిపాడు. నెల్లూరు జిల్లా కోనేటిరాజు పాళేనికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని తన మేనమామ అని పరిచయం చేసిందని చెప్పాడు. అతనే ఆమె మొదటి భర్త అని... అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు పుట్టారని వినయ్ చెప్పాడు.

పట్టించుకోని సీఐ

పట్టించుకోని సీఐ

స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ కేసు నమోదు చేయలేదని వినయ్ వాపోయాడు. పోలీసు కేసు పెడుతున్నానని తెలిసిన మరునాడే ఆమె ఇంటి నుంచి పరారయ్యిందని, పోలీసులు పట్టించుకోక పోవటంతో తానేమి చేయలేకపోయానని వీడియోలో వివరించాడు. పోలీసులు కూడా పట్టించుకోక పోవటంతో తననెవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఈ రకంగా చేస్తోందని వినయ్ వీడియోలో వివరించాడు. అలిపిరి పోలీసులకు చిక్కిన కిలాడీ లేడీ ఇంకెంత మందిని మోసం చేసిందో అని పోలీసులు విచారిస్తున్నారు.

English summary
alipiri police arrested cheated woman suhasini. she cheated three persons
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X