• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో కోరనా: కొంపముంచిన ఎమ్మెల్యే.. మర్కజ్‌లాగా ట్రాక్టర్ల ర్యాలీలో వైరస్ బ్లాస్ట్.. రెట్టింపైన కేసు

|

లాక్ డౌన్ కొనసాగుతుండగా అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు భారీ ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టిడం, అదికాస్తా దేశవ్యాప్త చర్చకు దారితీయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతా భయపడ్డట్లే.. ఆ ర్యాలీలో వైరస్ విస్పోటనం చెందింది. అప్పటిదాకా కొద్దోగొప్పో కంట్రోల్ లో ఉన్న చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులు చేయిదాటినట్లు కనిపిస్తోంది. దీనంటికీ కారణమైన ఎమ్మెల్యేపై విమర్శలు రెట్టింపయ్యాయి.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

ఏపీలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు, వైరస్ బారినపడినవాళ్లకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపతికన చర్యలు చేపట్టింది. అసలే ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రం కావడంతో చన్నీళ్లకు వేన్నీళ్లలా ముఖ్యమంత్రి సహాయనిధికి దాతల నుంచి విరాళాలు కోరారు. పలు జిల్లాల నుంచి బడాబాబులందరూ తోచినంత డబ్బు పంపారు. అలా డబ్బు పంపినవాళ్లను సన్మానించడంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓ వింత కార్యక్రమం చేపట్టారు. దాతల ఫొటోలతో ఫ్లెక్సీలు తయారుచేయించి, వాటిని ట్రాక్టర్లపై ఉంచి ఏప్రిల్ 11న శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ తీశారు. దాని పర్యవసానాలు 10 రోజులకే బయటపడ్డాయి..

మర్కజ్ మాదిరిగా..

మర్కజ్ మాదిరిగా..

లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిపిన సామూహిక ప్రార్థనలు తీవ్ర దుష్ప్రభావాన్ని చూపాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 30 శాతం మర్కజ్ తో సంబంధం ఉన్నవే కావడం గమనార్హం. అచ్చం అదేతీరుగా, ఏపీలోని చిత్తూరు జిల్లాలోనూ ట్రాక్టర్ల ర్యాలీలో వైరస్ ప్రబలింది. సోమవారం ఒక్కరోజే జిల్లాలో 29 కొత్త కేసులు వెలుగుచూడగా, అందులో మెజార్టీ కేసులు ట్రాక్టర్ల ర్యాలీతో లింకు ఉన్నవేనని తేలింది. మంగళవారం నాటికి చిత్తూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 53గా ఉంది.

11 మంది ప్రభుత్వ సిబ్బందికి..

11 మంది ప్రభుత్వ సిబ్బందికి..


శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో ప్రభుత్వ అధికారులు కూడా పాలుపంచుకోవడం విశేషం. అయితే అందులో 11 మంది ఇప్పుడు వైరస్ కాటుకు గురయ్యారు. ఏప్రిల్ 11న ర్యాలీలో వైరస్ వ్యాప్తి చెందగా, పదిరోజుల వ్యవధిలోనే పలువురిలో లక్షణాలు బయటపడి ఆస్పత్రుల్లో చేరారు. వ్యాప్తి భయాల నేపథ్యంలో ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న అందరి వివరాలు కనిపెట్టేందుకు యంత్రాంగం ప్రయత్నిస్తున్నది. త్వరలోనే ఇక్కడ కేసులు భారీగా పెరగొచ్చని అధికారులు గుబులుచెందుతున్నారు.

ఎమ్మెల్యేపై విమర్శలు..

ఎమ్మెల్యేపై విమర్శలు..

లాక్ డౌన్ ఆదేశాలను ధిక్కరించిమరీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టడం, అది కాస్తా వైరస్ వ్యాప్తికి ఊతమివ్వడంతో శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వాధికారులకు కరోనా సోకిందన్న వార్తపై పలు జాతీయ చానెళ్లలోనూ చర్చ జరిగింది. ఇంత జరిగినా సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రతిపక్ష టీడీపీ తప్పుపట్టింది. అధికార పార్టీకి చెందినవాళ్లే వైరస్ ను వ్యాపింపజేస్తోంటే, సీఎం జగన్ ఏం చేస్తున్నారని టీడీపీ ప్రశ్నించింది. ఏపీలో సోమవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 757కు పెరిగింది.

  Lockdown : Students In Hyderabad Donating Food & Grocery For 1500 People In Balanagar
  English summary
  During Lockdown, on April 11, srikalahasthi YSRCP MLA biyyapu Madhusudhan Reddy holds a tractor Rally. Now 11 fo AP govt Officials who participated in that rally tests Positive for coronavirus. covid cases in chittoor district increased
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X