చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మదపపల్లె టమాటా మార్కెట్ సందర్శనకు అనుమతి నిరాకరణ... ఎవరు ఆపుతారో చూస్తానంటూ పవన్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేతకు రాష్ర్ట ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గురువారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లే టమాటా మార్కెట్‌ను సందర్శించేందుకు పవన్ కల్యాణ్‌కు అనుమతిని నిరాకరించింది. అయితే అధికారుల నిర్ణయంపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ చర్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. రైతులను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే తాను చేతులు ముడుచుకుని కూర్చోనని స్పష్టం చేశారు. తన పర్యటనను ఎవరొచ్చి ఆపుతారో చూస్తానంటూ పవన్ సవాల్ విసిరారు. మార్కెట్ ముందే కూర్చుని రైతులతో మాట్లాడతానని అన్నారు.

రాయలసీమ జిల్లాలో పవన్ కల్యాన్ యాత్ర రోజురోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై పలు సంధర్భాల్లో విరుచుకుపడుతున్నారు. గత రెండు రోజులుగా పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ గురువారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లె టమాటా మార్కెట్‌ను సందర్శించి అక్కడి రైతులను మాట్లాడని నిర్ణయించారు. అయితే అందుకు సంబంధించి అధికారులు అనుమతి నిరాకరించారు.

AP government has given a shock to the Janasena chief PawanKalyan

దీంతో అనుమతి నిరాకణపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. పర్మిషన్ ఇవ్వకపోతే చేతులు ముడుచుకుని కూర్చుంటామా అని హెచ్చరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావాలను పునికి పుచ్చుకున్నవాళ్లమని, ప్రభుత్వ బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే తాను మార్కెట్‌కు ఎలాగైన వెళ్లి తీరతానని, ఏ వైసీపీ ఎమ్మెల్యే వచ్చి అడ్డుకుంటాడో చూస్తానని సవాల్ విసిరారు. ఇందుకోసం జనసైనికులు అంతా సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

English summary
The state government has given a shock to the Janasena chief Pawan Kalyan. permission refused to visit Madanapalle Tomato Market in Chittoor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X