చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సర్కారుకు హైకోర్టులో మరో షాక్- అమర రాజా కేసులో గల్లా ఫ్యామిలీకి ఊరట..

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా ఇన్ ప్రా సంస్ధకు గతంలో కేటాయించిన భూముల్లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకుంటూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో చుక్కెదురైంది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అమరరాజా ఇన్ ఫ్రాకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకునే అదికారం ప్రభుత్వానికి లేదంటూ ఆ సంస్ధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... స్టే రూపంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Recommended Video

కోర్టు ని అడ్డుపెట్టుకుని TDP ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకుంటుంది - YS Jagan || Oneindia Telugu
ap high court stays jagan governments order over taking back amara raja infra lands


2009లో అప్పటి రోశయ్య ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమార్ కుటుంబానికి చెందిన అమర్ రాజా ఇన్ ఫ్రా సంస్ధకు 483.27 ఎకరాల భూమిని డిజిటల్ వరల్డ్ సిటీ నిర్మాణానికి కేటాయించారు. పదేళ్లు పూర్తవుతున్నా కాంట్రాక్టు నిబందనల ప్రకారం ఉద్యోగాలు కల్పించకపోవడంతో ఈ భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల కల్పన లేకపోవడంతో పాటు సంస్ధ విస్తరణ కూడా చేపట్టకపోవడంతో ఈ భూములు వెనక్కి తీసుక్కోవాలని ఏపీఐఐసీకి జారీ చేసిన ఆదేశాల్లో పరిశ్రమల శాఖ పేర్కొంది.

English summary
andhra pradesh high court on monday issued stay on state government's orders over amara raja infra's lands issue. jagan govt had issud orders for taking back lands alloted earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X