చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప‌ది మంది పోలింగ్‌ అధికారులపై వేటు : చ‌ంద్ర‌గిరి ఎఫెక్ట్‌: ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం..!

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వివాదాస్ప‌దంగా మారిన పోలింగ్ వ్య‌వ‌హారం పైన ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అయిదు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జ‌ర‌గ‌టానికి స‌హ‌క‌రించార‌నే కార‌ణంతో అక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న ప‌ది మంది పోలింగ్ అధికారులపై వేటు వేసింది.

ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం...
చంద్రగిరి నియోజకవర్గంలో అక్రమాలపై ఈసీ చర్యలు తీసుకుంది. రిగ్గింగ్ జ‌రిగింద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన ఎన్నిక‌ల సంఘం అక్క‌డ రీ పోలింగ్‌కు ఆదేశించింది. రిగ్గింగ్‌కు స‌హ‌క‌రించార‌నే కార‌ణంతో ఆ అయిదు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ విధులు నిర్వ‌హిస్తున్న ప్రిసైడింగ్..స‌హాయ ప్రిసైడింగ్ అధికారుల పైన వేటు వేసింది. ఎన్.ఆర్ కమ్మపల్లి, పులవర్తిపల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకట్రామపురం కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులను సస్పెండ్ చేసింది. ఆ అధికారులపై శాఖా పరమైన చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఐదు పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడిన.. అనధికార వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కూడా ఈసీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వీరి స‌హాకారంతోనే అక్క‌డ ఓ పార్టీ రిగ్గింగ్ చేయ‌గలిగింద‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ధార‌ణ‌కు వ‌చ్చి ఈ నిర్ణ‌యం తీసుకుంది.

CEC taken action against polling officers who cooperated for Rigging in Chandragiri constituency

రీ పోలింగ్ కు కార‌ణం అదే..
చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని అయిదు పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ అభ్య‌ర్ది నుండి ఫిర్యాదు రావ‌టంతో ఎన్నిక‌ల సంఘం ఆ పోలింగ్ కేంద్రాల్లోని వీడియో ఫుటేజ్‌ను ప‌రిశీలించారు. అందులో ఒక పార్టీకి చెందిన వారు పోలింగ్ కేంద్రంలోకి వ‌చ్చిన ఓట‌ర్ల‌కు సిరా వేసి..ఓటు వేయ‌నీయ‌కుండా పంపించి వేయ‌టం..వారి ఓటు వీరే రిగ్గింగ్ చేయ‌టం స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతో..రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి అస‌లు ప్ర‌జాస్వామ్యంలో ఇలా జ‌రుగుతుందా అనే అనున‌మానం వ్య‌క్తం చేసారు. జిల్లా క‌లెక్ట‌ర్ నుండి నివేదిక కోరారు. అనంత‌రం అక్క‌డ అయిదు కేంద్రాల్లో ఆ త‌రువాత మ‌రో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించారు. ఆ నిర్ణ‌యం రాజ‌కీయంగా ప‌లు విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైంది. అయితే, ప్ర‌త్యేక ఏర్పాట్ల‌తో అక్క‌డ రీ పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రిగింది.

English summary
Election Commission taken serious decision on co operated presiding officers in Chandragiri constituency polling booths. Presiding and assistant presiding officers suspended and ordered for departemental action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X