chandrababu chandrababu naidu angry police opposition leader tdp leaders permission covid 19 ycp ysr congress party jagan ys jagan ycp leaders చంద్రబాబు నిర్బంధం చంద్రబాబు నాయుడు ఆగ్రహం పోలీసులు అనుమతి నిరాకరణ కోవిడ్ 19 వైసిపి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ వైయస్ జగన్
తన గొంతు నొక్కలేరన్న చంద్రబాబు... రికార్డింగ్ డ్యాన్సులకు కరోనా అడ్డు రాలేదా ? టీడీపీ నేతల ధ్వజం
రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించడం పై టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా అయిదు వేలమంది టిడిపి శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించాలని భావించిన చంద్రబాబుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఎయిర్ పోర్టులోనే చంద్రబాబు ధర్నా ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రేణిగుంట విమానాశ్రయం వద్ద చంద్రబాబు ధర్నా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

జగన్ సర్కార్ పై విరుచుకుపడిన చంద్రబాబు
పోలీస్ చర్యలతో తమ సంకల్పాన్ని అడ్డుకోలేరని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనను ఎవరూ అడ్డుకోలేరని, తన గొంతు ఎవరు నొక్క లేరని ట్విట్టర్ వేదికగా ఆయన జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవడం తగదని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు. జగన్ ఇంకా రాజకీయ పరిణతి సాధించాలని విమర్శించారు. భయపెట్టి ఎన్నిరోజులు పాలన సాగిస్తారని ప్రశ్నించిన చంద్రబాబు జగన్ తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
టీడీపీ సోషల్ మీడియాలో జగన్ సర్కార్ పై విమర్శల వెల్లువ
ఇదిలా ఉంటే భారతదేశం అంటే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజలను కలవకుండా ప్రభుత్వమే అడ్డుకుంటున్న నియంతృత్వాన్ని దేశం మొత్తం చూస్తూ నివ్వెర పోతోంది అంటూ టీడీపీ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకోవడంపై మండిపడుతోంది. కాబోయే ముఖ్యమంత్రి అంటూ థర్డ్ గ్రేడ్ చిందులు లేవు. పోలీసులను గుర్తుంచుకుంటాఅంటూ బెదిరింపులు లేవు. ప్రజాస్వామ్యం మీద వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ప్రజల కోసం ఎన్నో అవమానాలు నిర్బంధాలను ఎదుర్కునే సహనం ఉంది.

చంద్రబాబు నిర్బంధంపై టీడీపీ నేతల ఫైర్
ఇదే కదా అసలైన ప్రజా నాయకుని పోరాటం అంటూ రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు నాయుడు ఆందోళన తెలియజేస్తున్న తీరుపై టిడిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
పోలీసు చర్యలతో చంద్రబాబును అడ్డుకోలేరని తెలుగుదేశం పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకోవడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. సీనియర్ నేతలైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు ,ధూళిపాళ్ల నరేంద్ర, కాలువ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి ,గద్దె రామ్మోహన్, బండారు సత్యనారాయణమూర్తి, పీతల సుజాత తదితరులు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అరెస్ట్ పై ధ్వజమెత్తారు.

రికార్డింగ్ డాన్సులకు అడ్డురాని కరోనా చంద్రబాబు పర్యటనకు అడ్డు వచ్చిందా ?
రాజారెడ్డి రాజ్యాంగానికి తాజా పరిణామాలే పరాకాష్ట అంటూ నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకుల రికార్డింగ్ డాన్సులకు అడ్డురాని కరోనా చంద్రబాబు పర్యటనకు ఎలా అడ్డు వచ్చిందని ప్రశ్నించారు. జగన్ తుగ్లక్ పాలన పై ప్రజలు తిరగబడతారని ఉద్దేశంతోనే తమ అధినేత చంద్రబాబు ను ఎయిర్ పోర్ట్ లో నిర్బంధించారని టిడిపి నేతలు మండిపడ్డారు. జగన్ ను ఓటమి భయం ఇంకా వెంటాడుతోందని, అందుకే అడుగడుగునా టిడిపి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు