AP Panchayat elections AP Panchayat elections 2021 ycp chandrababu democracy defeat election commission complaints kuppam Pulivendula jagan mohan reddy ap government mind game andhra pradesh ys jagan amaravati vijayawada ap local body elections local body elections tdp chandrababu naidu వైసిపి చంద్రబాబు ప్రజాస్వామ్యం ఓటమి ఎన్నికల కమిషన్ ఫిర్యాదులు కుప్పం పులివెందుల ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైయస్ జగన్ అమరావతి విజయవాడ టిడిపి చంద్రబాబు నాయుడు politics
కుప్పం ఫలితాలపై చంద్రబాబు స్పందన.. ప్రజాస్వామ్యం ఓడిందని టీడీపీ అధినేత ఆవేదన
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో కుప్పంలో తాము గెలవకపోవడంపై స్పందించారు. ఇప్పటికే వైసీపీ మంత్రులు కుప్పంలో ఓటమితో చంద్రబాబును రాజకీయాల నుండి వైదొలగాలని తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే, చంద్రబాబు నాయుడు కుప్పం లో ఏం జరిగిందో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు సిగ్గుపడాలి, కుప్పం ఫలితాల తర్వాత రాజకీయాల నుండి తప్పుకోవాలి : మంత్రి వెల్లంపల్లి

కుప్పంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొంటుంటే అధికారులేం చేశారు : చంద్రబాబు ప్రశ్న
కుప్పంలో తాము గెలవకపోవడం కాదని ప్రజాస్వామ్యం కుప్పంలో ఓటమి పాలైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు . కుప్పంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొంటుంటే అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పంలో వైసీపీ గెలవలేదని, ప్రజాస్వామ్యం ఓటమి పాలైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుప్పం ప్రజలు నా కుటుంబ సభ్యులు.. అని పేర్కొన్న చంద్రబాబు కుప్పాన్ని కలుషితం చేస్తారా అంటూ మండిపడ్డారు.

ఇలాంటి రాజకీయ నేతల కోసం తాను రాజీనామా చెయ్యాలా?
తాను రాజీనామా చేయాలని అంటున్నారని, ఇలాంటి రాజకీయ నేతల కోసం తాను రాజీనామా చెయ్యాలా అని ప్రశ్నించారు చంద్రబాబు. కుప్పంలో తన పీఏ పై మీద కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు . వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్ లు పెట్టి తనతో మైండ్ గేమ్ ఆడ లేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
అధికార పార్టీ నాయకులు తనతో మైండ్ గేమ్ ఆడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు. వైసిపి కి ఓటేయని వారిపై దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుప్పం నియోజకవర్గాన్ని మరో పులివెందులగా మారుస్తారా ?
కుప్పం తో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని పేర్కొన్న చంద్రబాబు శాంతికి మారుపేరుగా ఉండే కుప్పం నియోజకవర్గాన్ని కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు తన కుటుంబ సభ్యులని పేర్కొన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని మరో పులివెందుల గా మారుస్తారా అంటూ ప్రశ్నించారు.
ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు పాల్పడిందని, డబ్బు పంపిణీ తో పాటుగా అరాచకాలపై ఆధారాలు పంపినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు.

అక్రమాలను అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకని చంద్రబాబు ప్రశ్న
అక్రమాలను అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. చాలావరకు ఏజెన్సీ ప్రాంతాలలో టిడిపి మద్దతుదారులు గెలిచారని పేర్కొన్న చంద్రబాబు అధికార పార్టీ నేతలు చేసే విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు కూడా మూడో విడత పంచాయతీ ఎన్నికల అక్రమాలపై లేఖ రాసిన చంద్రబాబు వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమీషన్ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ మద్దతుదారులను బెదిరించిన పోలీసుల పేర్లతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.