చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనూ సూద్, రైతు నాగేశ్వరరావు మాటా మంతీ, ఊరికి రావాలని కోరిన రైతు, వస్తానని రియల్ హీరో హామీ

|
Google Oneindia TeluguNews

అవును.. ఆ పేద రైతుల పాలిత అతను కనిపించే భగవంతుడు. తన కష్టాన్ని చూసి చలించి స్పందించిన సోనూ సూద్ తమ పాలిట దైవం అని అంటోంది నాగేశ్వరరావు ఫ్యామిలీ. ఈ నెల 30వ తేదీ గురువారం సోనూ సూద్ బర్త్ డే సందర్భంగా ఓ టీవీ చానెల్ ఆయనను లైవ్‌లోకి తీసుకొచ్చింది. ఇటు ట్రాక్టర్ బహుమతి పొందిన నాగేశ్వరరావుకు కూడా కాల్ కలుపగా.. వారిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. తమ ఊరికి రావాలని నాగేశ్వరరావు కోరగా.. అందుకు సోనూ సూద్ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా వస్తానని తన వీర భక్తుడికి మాట ఇచ్చారు.

సోనూసూద్ మరో సంచలనం, టెకీ శారదకు జాబ్, సోనూ తెలుగింటి అల్లుడే, అతని ఆస్తి ఎంతో తెలుసా..?సోనూసూద్ మరో సంచలనం, టెకీ శారదకు జాబ్, సోనూ తెలుగింటి అల్లుడే, అతని ఆస్తి ఎంతో తెలుసా..?

వెళ్లి దున్ని వస్తా.. కానీ

వెళ్లి దున్ని వస్తా.. కానీ

లైవ్‌లోనే నాగేశ్వరరావు భావోద్వేగానికి గురయ్యారు. మీ దయగుణాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని సోనూతో అన్నారు. మీరు అందజేసిన స్ఫూర్తితో తాను కూడా పేద రైతులకు సాయం చేస్తానని తెలిపారు. ఇదివరకు బతకుదెరువు కోసం మదనపల్లెలో టీ స్టాల్ నడిపానని నాగేశ్వరరావు గుర్తుచేశారు. ఇక పల్లెలో ఉండి.. ట్రాక్టర్ నడుపుతూ జీవిస్తానని చెప్పారు. దుక్కి దున్నేందుకు ఇబ్బంది పడే పేద రైతులు ట్రాక్టర్ కావాలని కోరితే తనే స్వయంగా వెళ్లి దున్ని వస్తానని చెప్పారు. కానీ ఆ రైతు మాత్రం డీజిల్ మాత్రం పోయించుకోవాలని కోరారు.

ఆ వస్తా.. పొలంలో ట్రాక్టర్ దున్నడం కూడా చూస్తా...

ఆ వస్తా.. పొలంలో ట్రాక్టర్ దున్నడం కూడా చూస్తా...

తమ గ్రామానికి రావాలని నాగేశ్వరరావు సోనూసూద్‌ను కోరారు. లాక్ డౌన్ వల్ల షూటింగులు రద్దు చేసుకున్నానని సోనూ చెప్పారు. ఈసారి తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా వస్తానని.. అలా వచ్చినప్పుడు పొలంలో ట్రాక్టర్ దున్నడం చూస్తాను అని తెలిపారు. దీంతో నాగేశ్వరరావు, ఫ్యామిలీ తెగ సంబరపడిపోయింది. తాను పిలవగానే వస్తానని చెప్పినందుకు ఖుషీ అయిపోయారు. నిన్న వరంగల్ టెకీ శారదకు సోనూసూద్ ఉద్యోగం కల్పించిన సంగతి తెలిసిందే. మంచి మనసుతో పేదలకు సోనూ సూద్ సాయం చేస్తున్నారు.

Recommended Video

Sonu Sood Help to AP Farmer With Tractor
తెలుగు విద్యార్థులకు సాయం

తెలుగు విద్యార్థులకు సాయం

మరోవైపు లాక్ డౌన్ వల్ల కిర్గిస్తాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు కూడా సోనూసూద్‌ సాయం చేశారు. 250 మంది తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీరభద్రాపురానికి చెందిన కొర్ల భార్గవచౌదరి.. కిర్గిస్థాన్‌లోని బిస్కెక్‌ ఆసియన్‌ వర్సిటీలో ఎంబీబీఎస్‌ చేస్తున్నారు. స్వస్థలానికి వచ్చేందుకు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేయగా.. వీడియో చూసి సోనూ సూద్ స్పందించారు. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో మాట్లాడారు. ప్రత్యేక విమానం ఏర్పాటుచేసి.. అందులో వారిని స్వస్థలాలకు రప్పించారు సోనూ సూద్.

English summary
chittur farmer nageshwar rao asked to sonu sood come to village, he promise to farmer when i came to tirupati.. will come.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X