చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలం ఆలయంలో కీలక నిర్ణయాలు .. పాతాళగంగ స్నానాలు బంద్

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు కరోనా వైరస్ నేపధ్యంలో భక్తుల సందర్శన ఆపాలని నిర్ణయం తీసుకున్నాయి. చాలా క్షేత్రాలలో ఇప్పటికే భక్తుల రద్దీని నివారించటానికి ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని దేవాలయాలకు దేవాలయాలే మూసివేత నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల ప్రజలను కలవరపెడుతుంది.

కరోనాతో భగవంతుడికీ , ఆలయాలకు తప్పని తిప్పలు

కరోనాతో భగవంతుడికీ , ఆలయాలకు తప్పని తిప్పలు


భగవంతుడికి సైతం ధూప, దీప , నైవేద్యాలు లేకుండా కరోనా ప్రభావంతో ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి ఆలయ అర్చకులు వేదన చెందుతున్నారు. కానీ వ్యాధి వ్యాప్తి ఎలాగైనా జరిగే అవకాశం ఉన్న రీత్యా చాలా దేవస్థానాలలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న చోట ఆలయాలను మూసివేశారు. చాలా సుప్రసిద్ధ ఆలయాలు అయిన షిరిడీ సాయినాధుని ఆలయం , ఉజ్జయినీ మహంకాళి ఆలయం మూత పడ్డాయి.

శ్రీశైలంలో పాతాళగంగలో స్నానాలు రద్దు చేసిన దేవస్థానం

శ్రీశైలంలో పాతాళగంగలో స్నానాలు రద్దు చేసిన దేవస్థానం

ఇక కరోనా వైరస్ కారణంగా ఏపీలోనూ పలు ఆలయాలలో ఆంక్షలు విధించారు. తిరుమలలో గంటకు నాలుగు వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక శ్రీశైలం దేవస్థానం కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులలో కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంది. నేటి నుంచి శ్రీశైలంలోని పాతాళగంగలో భక్తుల పుణ్యస్నానాలను నిలిపివేసినట్టు దేవస్థానం అధికారులు వెల్లడించారు. అంతే కాదు భక్తులు రావద్దని ఇప్పటికే సూచనలు చేశారు. ఒకవేళ ఎవరైనా వస్తే కూడా వారిని స్క్రీనింగ్ చేశాకే ఆలయంలోనికి అనుమతిస్తున్నారు.

Recommended Video

Mega Star Chiranjeevi On Covid 19 | Megastar Chiranjeevi Message To People
ప్యాకెట్లలోనే అన్నప్రసాద వితరణ

ప్యాకెట్లలోనే అన్నప్రసాద వితరణ

ఇక స్వామి వారిని తాకకుండా ఆంక్షలు పెట్టారు. ఇక అన్నదాన మందిరంలో సైతం మార్పులు చేపట్టారు. అన్న ప్రసాద వితరణను వడ్డించే పద్ధతిలో కాకుండా ప్యాకెట్ల రూపంలో భక్తులకు అందజేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాల్నీ నేటి నుంచే అమలు చేయనున్నట్టు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. అంతేకాదు విదేశాల నుంచి వచ్చే భక్తులెవరూ శ్రీశైలానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం వచ్చిన భక్తులకు ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే 104కు సమాచారం అందించాలని ఈవో కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు. దయచేసి కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
Srisailam Temple has also made key decisions in the context of the spread of coronavirus. Devasthanam authorities have discontinued the shrine baths of pilgrimages to the Pathalanganga of Srisailam from today. It has already been suggested that devotees should not come. If anyone comes in, they are allowed into the temple only after screening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X