• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబుకే దిక్కులేదు...ఇచ్చే పనైతేనే ఈ రూట్ లో రా!:చెక్ పోస్ట్ కలెక్షన్ ఏజంట్ వీరంగం

|

చిత్తూరు:మామూళ్ల మత్తులో జోగుతున్న ప్రభుత్వ శాఖల్లో కాసులు దండిగా గలగలలాడతుండటంతో అవినీతి ఉద్యోగులకు కన్నూమిన్నూగానడం లేదనడానికి ఇదే ఉదాహరణ. రవాణా శాఖలోని ఒక అనధికార ఉద్యోగి ఏకంగా సిఎం చంద్రబాబునే...'వాడికే దిక్కులేదు' అని తూలనాడటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.

అది కూడా సిఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పైగా ఒక లారీ డ్రైవర్ నుంచి మామూళ్లు వసూళ్లు చేసుకునే సందర్భంలో ఆ రవాణా శాఖ కలెక్షన్ ఏజంట్ ముఖ్యమంత్రిని ఈ విధంగా దూషించగా...ఈ ఉద్యోగి తీరుతెన్నులు గమనించిన ఆ లారీడ్రైవరే ఇతగాడి వ్యవహారాన్ని వీడియో తీసి రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంలకు పంపించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఇక్కడి భాగోతమంతా బైటపడింది. వివరాల్లోకి వెళితే...

Corruption peaks in Transport department...Corrupted employees abusing even Chief Minister for Bribes!

తమిళనాడుకు జిప్సం లోడుతో వెళుతున్న ఓ లారీ చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నరహరిపేట ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు మీదుగా ప్రయాణించాల్సివుంది. ఈ క్రమంలో ఆ చెక్‌పోస్టులోని రవాణా సిబ్బంది ఈ లారీని ఆపారు. అయితే వారడిగిన వివరాలు తెలిపిన లారీడ్రైవర్ తాను సరైన టన్నేజీతోనే లారీ తీసుకెళ్తున్నానని వారితో చెప్పాడు. అయితే అందుకు స్పందించిన అక్కడి కలెక్షన్ ఏజంట్ అయినా సరే నువ్వు మామూలు ఇచ్చి వెళ్లాల్సిందేనని హుకుం జారీ చేశాడు.

దీంతో ఆ లారీడ్రైవర్ ఆ ఉద్యోగిని బ్రతిమలాడుతూ...నేను ఎప్పుడూ ఈ రూట్ లోనే తిరుగుతూ ఉంటా...నేను కూడా ఆంధ్రావాడినే...వదిలేయండి అన్నా అంటూ బ్రతిమలాడాడు. దీంతో రెచ్చిపోయిన సదరు కలెక్షన్ ఏజంట్...''ఇక్కడ చంద్రబాబుకే దిక్కులేదు. ఆంధ్రా గీంద్రా అని మాట్లాడొద్దు...సరే ఈ సారికి పంపిస్తా...కానీ డబ్బులు ఇచ్చే పనైతేనే ఈ రూట్‌లో రా...లేదంటే అసలు ఇటు రావద్దు'' అని తేల్చి చెప్పేశాడు. దీనితో అతడి వైఖరిపై కోపం వచ్చిన లారీడ్రైవరు కలెక్షన్ ఏజంట్ తో...'అంతమాటన్నావేంటన్నా...అయితే చంద్రబాబుకే దిక్కు లేదంటారా?'...అని రెట్టించాడు.

దీంతో మరింతగా రెచ్చిపోయిన ఆ ఉద్యోగి ఈసారి సిఎం పేరును చంద్రబాబు అని కూడా ఉచ్చరించకపోగా...ఏకంగా 'అవును...వాడికే దిక్కులేదు' అంటూ పొగరుగా సమాధానమిచ్చాడని తెలిసింది. ఆ ఉద్యోగి వాలకాన్ని గమనించి ముందే సెల్ రికార్డ్ ఆన్ చేసి ఉంచుకున్న ఆ లారీ డ్రైవర్... బుధవారం జరిగిన ఈ ఘటన గురించి రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, రవాణా కమిషనర్‌ బాలసుబ్రమణ్యంలకు ఫిర్యాదు చేస్తూ ఈ వీడియోను పంపించాడు. అయితే ఇతడు ఇంతగా రెచ్చిపోయి సిఎంనే దూషిస్తున్నా అక్కడే పక్కనే ఉన్న రవాణా శాఖ అధికారి గాని, సిబ్బంది గాని వారించే ప్రయత్నం చేయలేదని కూడా తెలిపాడు.

దీంతో ఈ ఉదంతంపై సీరియస్‌ అయిన మంత్రి, కమిషనర్‌ వెంటనే డీటీసీ ప్రతాప్‌కు ఫోన్ చేసి ఘటన గురించి చెప్పి సీఎంనే దూషిసున్నా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటన గురించి డీటీసీ ప్రతాప్‌ గురువారం చిత్తూరు డీఎస్పీ సుబ్బారావుకు ఫిర్యాదు చేయడంతో పాటు అప్పుడు డ్యూటీలో ఉన్న అసిస్టెంట్‌ ఎంవీఐ రవిశంకర్‌ నాయక్‌కు మెమో ఇచ్చారని తెలిసింది. అయితే ఈ ఉదంతంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరపగా ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూసినట్లు తెలిసింది.

సీఎంని దూషించిన వ్యక్తి అసలు రవాణా శాఖ ఉద్యోగే కాదని...కేవలం చెక్‌పోస్టులోని సిబ్బంది మామూళ్ళ వసూళ్ళ కోసమే నియమించుకున్న ప్రైవేటు వ్యక్తి అని వెల్లడయిందని అంటున్నారు. అంతేకాదు ఈ నెల 13వ తేదీన ఏసీబీ అధికారులు ఈ చెక్‌పోస్టుపై దాడి చేయగా ఆ సమయంలో ఈ ఘటనలో తాజాగా సస్పెండైన ఇదే అసిస్టెంట్‌ ఎంవీఐ రవిశంకర్‌ నాయక్‌ అప్పుడూ డ్యూటీలో వున్నారని తెలిసింది. ఆ రోజు ఆయన డ్యూటీలోకి ఎక్కిన 4 గంటల వ్యవధిలోనే అక్కడ రూ.41 వేలు అనధికారిక నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగి కనీసం 10 రోజులైనా గడవకముందే అక్కడి ఉద్యోగులు ప్రత్యేకంగా ఒక ప్రైవేటు కలెక్షన్‌ ఏజెంటును కూర్చోబెట్టి మరీ మామూళ్ళు వసూళ్ళు చేస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

English summary
Chittoor: This is an example of corrupt employees who have been able to enraged with that corrupted money. This is a situation made it clear that where an unauthorized employee of Transport department abused to the Chief Minister Chandra babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X