• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

స్కూల్‌లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్.. బాలిక ఫిదా.. ఇదో కొత్త కహానీ..!

|

చిత్తూరు : అతనో డ్యాన్స్ మాస్టర్. జీవనోపాధి కోసం డ్యాన్స్ ప్రదర్శనలు ఇస్తుంటాడు. ఆ క్రమంలో అతడి స్టెప్పులకు ఓ స్కూల్ విద్యార్థిని ఫిదా అయింది. దాంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే సదరు డ్యాన్స్ మాస్టర్ మాత్రం ఆ పరిచయాన్ని అలుసుగా తీసుకున్నాడు. నాలుగు మాయమాటలు వల్లించి కిడ్నాప్ చేశాడు.

చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బైకుపై ప్రయాణిస్తూ వివిధ ప్రాంతాలకు మారుతున్న సదరు నిందితుడ్ని పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. సినిమా సీన్ తలపిస్తున్న ఈ కిడ్నాప్ ఉదంతం చివరకు ఎలాంటి మలుపులు తిరుగుతుందోననే టెన్షన్ సీన్ క్రియేట్ అయింది.

డ్యాన్స్‌తో అట్రాక్ట్.. ఆ తర్వాత అపహరణ

డ్యాన్స్‌తో అట్రాక్ట్.. ఆ తర్వాత అపహరణ

చిత్తూరు జిల్లాలోని చిన్నగొట్టిగల్లుకు చెందిన 24 ఏళ్ల పవన్‌కుమార్‌ డ్యాన్స్ మాస్టర్‌గా జీవనోపాధి పొందుతున్నాడు. ఆ క్రమంలో బెంగళూరులోని ఓ డ్యాన్స్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. అయితే రొంపిచెర్లలోని ఓ ప్రైవేట్ స్కూలుకు సంబంధించిన వార్షికోత్సవ వేడుకల్లో డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దాదాపుగా మూడేళ్ల నుంచి ఆ స్కూల్ డే ఫంక్షన్‌లో పాల్గొంటున్నాడు.

అయితే అతను చేసే డ్యాన్సులతో, స్టెప్పులతో ఓ విద్యార్థిని అట్రాక్ట్ అయింది. మూడేళ్ల నుంచి అతడు క్రమం తప్పకుండా తమ స్కూల్‌లో డ్యాన్స్ ప్రదర్శన ఇస్తుండటంతో పరిచయం పెంచుకుంది. అది కాస్తా ప్రస్తుతం కిడ్నాప్ వ్యవహారానికి దారి తీసినట్లు తెలుస్తోంది.

గెలిస్తే సీఎం, ఐదేళ్లు కష్టం.. రామనగర కథ.. రాజకీయంలో సెంటిమెంట్లు..!

9వ తరగతి బాలిక.. డ్యాన్స్ మాస్టర్

9వ తరగతి బాలిక.. డ్యాన్స్ మాస్టర్

బొమ్మయ్యగారి పల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం కాలనీకి చెందిన ఓ బాలిక రొంపిచెర్లలోని ప్రైవేట్ స్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దాంతో సదరు బాలిక ఎక్కడకు వెళ్లిందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆ క్రమంలో డ్యాన్స్ మాస్టర్ పవన్ కుమార్ ఆ అమ్మాయిని తీసుకెళ్లినట్లు క్లూ దొరకడంతో పోలీసులను ఆశ్రయించారు.

అయితే బాలికను తన వెంట తీసుకెళ్లడానికి పవన్ కుమార్‌కు అతని స్నేహితులు గోవిందరాజులు, రమ్య సహకరించారని తెలుస్తోంది. వాళ్లు కూడా బెంగళూరులోనే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీరితో పాటు మరో ఇద్దరు కూడా పవన్ కుమార్‌కు సాయం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అందులో సాయికుమార్ అనే వ్యక్తి నిందితుడికి సోదరుడని తేలింది.

పోలీసులకు ఫిర్యాదు.. నిర్భయ, ఫోక్సో చట్టం కింద కేసు

పోలీసులకు ఫిర్యాదు.. నిర్భయ, ఫోక్సో చట్టం కింద కేసు

తమ కూతురు కనిపించడం లేదంటూ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. చిత్తూరుకు చెందిన గోవిందరాజులు, రమ్యతో పాటు చిన్నగొట్టిగల్లుకు చెందిన సాయికుమార్, కుమ్మరపల్లెకు చెందిన మునిరత్నంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గోవిందరాజులు, సాయికుమార్, మునిరత్నం రొంపిచెర్ల క్రాస్‌ రోడ్డులో ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన పవన్‌కుమార్‌పై నిర్భయ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మందుబాబుల ఐడియా షాక్.. పోలీసులకు బ్రేక్.. వామ్మో ఇస్మార్ట్ శంకర్లు

 మాయమాటలు చెప్పి కిడ్నాప్..!

మాయమాటలు చెప్పి కిడ్నాప్..!

డ్యాన్స్ మాస్టర్ తన స్టెప్పులతో అలరించి బాలికకు మాయమాటలు చెప్పి అపహరించారనే కోణంలో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. స్థానికుల నుంచి కొంత సమాచారం సేకరించి నిందితుడి కదలికలను గమనిస్తున్నారు. తొలుత సదరు బాలికను రొంపిచెర్ల నుంచి తీసుకెళ్లే క్రమంలో పీలేరు మీదుగా బెంగళూరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పీలేరులోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి ఆ మేరకు నిర్ధారించారు. మొదటగా ఆ బాలికను బెంగళూరు తీసుకెళ్లిన పవన్ కుమార్ ఆ తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆ క్రమంలో అతడి కదలికలను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ కేసు చేధించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Dance Master Pavan Kumar who employed in Bangalore and conducting dance programmes in chittoor district private school since three years. In that way, one of the ninth class girl attracted to his dance. Then she maintained friendship with him. So, Pavan kumar taken away that girl to bangalore. The girl parents filed a case against four people including pavan kumar and his supporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X