చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు: భయంతో జనాలు వీధుల్లోకి పరుగులు
చిత్తూరు: జిల్లాలోని సోమల మండలంలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఏటివన్, ఉప్పరపల్లి, శిలంవారిపల్లి, కమ్మపల్లి, ఎస్వీ ఎడ్లపల్లి, ఎస్వీ దళితవాడ, నంజేంపేట దిగువీధిలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది.

Sonu Sood Help to AP Farmer With Tractor
క్షణాలపాటు ఊగిపోయినట్లు కావడంతో ఇళ్లల్లోంచి జనం బయటికి పరుగులు తీశారు. శబ్దాలతో గోడలకు పగుళ్లు వచ్చాయని, ఇళ్లల్లోని పాత్రలు కిందపడిపోయాయని భూ ప్రకంపనల ప్రభావిత ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. అయితే, ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.