• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏది నిజం... సోను సూద్ ట్రాక్టర్ కొనిచ్చిన వ్యవహారంలో మరో ట్విస్ట్... రాజకీయ రంగు...

|

చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన నాగేశ్వరరావు అనే రైతుకు నటుడు సోను సూద్ ట్రాక్టర్ కొనిచ్చిన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వ్యవసాయం చేసేందుకు ఎద్దులు లేకపోవడంతో నాగేశ్వరరావు కుమార్తెలే కాడెద్దుల్లా మారి దుక్కి దున్నిన వీడియో వైరల్ కావడంతో సోను సూద్ స్పందించారు. తమ జిల్లాకు చెందిన రైతును ఆదుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా సోను సూద్‌కి ఫోన్ చేసి అభినందించారు. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు జోక్యం చేసుకున్నప్పటి నుంచి ఇది రాజకీయ రంగును పులుముకోవడం గమనార్హం.

దుష్ప్రచారం వద్దని నాగేశ్వరరావు విజ్ఞప్తి...

దుష్ప్రచారం వద్దని నాగేశ్వరరావు విజ్ఞప్తి...

తాజాగా రైతు నాగేశ్వరరావు మాట్లాడుతూ... తన పేదరికాన్ని గుర్తించి ఎక్కడో ముంబైలో ఉన్న ఆ మహానుభావుడు ట్రాక్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే సోను సూద్‌ను అభినందించి,తన ఇద్దరు బిడ్డలను చదివిస్తానని హామీ ఇచ్చారో.. అప్పటినుంచి తమపై బురదజల్లే కార్యక్రమం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలుగుదేశం,వైసీపీల్లో దేనికి చెందినవాడిని కాదని,పౌర హక్కుల సంఘంలో జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నానని చెప్పారు. తమ గురించి ఏమీ తెలియకుండా సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. తమ స్థితి గతులను చూసి,వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. అంతే తప్ప ఏదీ తెలియకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడి తమ బతుకులు రోడ్డు పాలు చేయవద్దని... చేతులెత్తి నమస్కరిస్తున్నానని విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాలో రకరకాల కథనాలు...

సోషల్ మీడియాలో రకరకాల కథనాలు...

నాగేశ్వరరావుపై రకరకాల కథనాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. నిజానికి ఆయన పేద రైతేమీ కాదని... ఆయన కుమార్తెలు ఏదో సరదాకి కాడెద్దుల్లా మారి దుక్కి దున్నారని ప్రచారం జరుగుతోంది. వీరి కుటుంబం చాలా ఏళ్ల క్రితమే మదనపల్లెకి వెళ్లి ఓ టీ షాపు నడుపుకుంటోందని... కరోనా నేపథ్యంలో ఇటీవలే స్వగ్రామం మహల్ రాజుపల్లెకి చేరారని తెలుస్తోంది. ఆయన కడు పేదరికంలో ఏమీ లేరని,ప్రభుత్వం తరుపున అన్ని పథకాలు అందుతున్నాయని స్థానిక అధికారులు కూడా చెబుతున్నారు. అంతేకాదు,2009లో ఆయన లోక్ సత్తా పార్టీ తరుపున అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఫించన్ పైనే ఆధారపడ్డామన్న నాగేశ్వరరావు...

ఫించన్ పైనే ఆధారపడ్డామన్న నాగేశ్వరరావు...

నిజానికి వ్యవసాయ పనుల కోసం నాగేశ్వరరావు కుటుంబం ట్రాక్టర్ అద్దెకు తీసుకుందని... అది వచ్చేలోపు ఆయన కుమార్తెలు కాడెద్దుల్లా మారి దుక్కి దున్నారని కలెక్టర్ భరత్ వెల్లడించారు. అయితే అది సరదాగా చేశారా... లేక అవసరమై చేశారా అన్నది చెప్పలేమన్నారు. కరోనా వల్ల ఆ కుటుంబం నష్టపోయిందనడంలో సందేహం లేదన్నారు. నాగేశ్వరరావు బీబీసీతో మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలు అందిన మాట నిజమేనని.. అయితే ప్రస్తుతం తన తండ్రికి వచ్చే ఫించను పైనే తన కుటుంబం ఆధారపడిందని చెప్పారు. ప్రభుత్వం ఆదుకోలేదని తాను ఎక్కడా చెప్పలేదని... సోను సూద్ ట్రాక్టర్ కొనివ్వడం ఎంత పనైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  Sonu Sood Help to AP Farmer With Tractor
  పేదవాడా... కాదా... రాజకీయం తగునా..?

  పేదవాడా... కాదా... రాజకీయం తగునా..?

  సోను సూద్ నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌కి కొనిచ్చిన తర్వాత... ఏపీ ప్రభుత్వం ఆయన స్థితి గతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆయన మరీ అంత పేదవాడేమీ కాదని సోషల్ మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడటంతో.. ఇది రాజకీయ రంగు పులుముకుంది. దీంతో ఒక వర్గం సోషల్ మీడియాలో నాగేశ్వరరావును పేదవాడు అని చెబుతుండగా... మరో వర్గం కాదని ఖండిస్తోంది. ఈ ప్రచారంతో నాగేశ్వరరావు విసిగెత్తిపోతున్నారు. ఏదో సోను సూద్ దయతలచి తనకో ట్రాక్టర్ కొనిపెట్టినందుకు ఇంత రాద్దాంతం అవసరమా అని వాపోతున్నారు.

  English summary
  Nageshwara Rao,a farmer from chitoor district who got a tractor from actor Sonu Sood appealed people to stop false propaganda against them on social media.Nageshwara Rao said that he never belongs to any party.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X