చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ ఎంపీ శివప్రసాద్ చనిపోలేదు..! తప్పుడు వార్తలు ఆపాలంటున్న కుటుంబ సభ్యులు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : తెలుగు మీడియాకు తొందరెక్కువైనట్టు కనిపిస్తోంది. కొన్ని వార్తలను నిర్ధారించుకోకుండానే ప్రసారం చేస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అదే మరణ వార్తల్ల్ో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన మీడియా బ్రేకింగ్ న్యూస్ కోసం, రేటింగ్స్ కోసం డాక్టర్లు, కుటుంబ సభ్యులు దృవీకరించకపోయినా మరణ వార్తలను హెడ్ లైన్స్ లో పెట్టి చూపిచండం కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా పరిణమించినట్టు తెలుస్తోంది.

గతంలో చాలా మంది మరణ వార్తల విషయంలో మీడియా పొరపాట్లు చేసి నాలుక కరుచుకుంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు మాజీ ఎంపీ ఎస్ శివప్రసాద రావు చనిపోయాడంటూ బ్రేకింక్ వార్తలు ప్రచురించడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. చనిపోని వ్యక్తిని ఎలా చనిపోయినట్టుగా వార్తలు ప్రచురిస్తారని ప్రశ్నిస్తున్నారు.

Former MP Naramalli Sivaprasad is not dead..Family members trying to stop the false news..!!

అంతే కాకుండా శివ ప్రసాద్ మేనల్లుడు నరసింహ ప్రసాద్ ఆ వార్తలపై భగ్గుమన్నారు. అంతే కాకుండా వార్తలను ప్రచురించిన మీడియా సంస్థలకు వార్తలని ఆపాలని సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. దాంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివప్రసాద్ పరిస్థితిపై ఆయన సోషల్ మీడియాలో ఓ మెస్సెజ్ కూడా పోస్ట్ చేసారు.

టిడిపి మాజీ ఎంపీ శివప్రసాద్ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుతున్నారని, అయితే ఆయన మరణించినట్లుగా వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, అని శివప్రసాద్ మేనల్లుడు నరసింహ ప్రసాద్ ఖండించారు. శివప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నదని వెల్లడించారు. వందతులను నమ్మవద్దని ఆయన సోషల్ మీడియా ద్వారా మీడియాకు విజ్ఞప్తి చేసారు.

English summary
Naramalli Sivaprasad's nephew Narasimha Prasad condemned the fact that TDP's former MP Shivprasad is being treated in Chennai's Apollo hospital, but there is no truth in the news that he is going viral as he died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X