చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యేక హోదా సాధనకై: వెరైటీ గెటప్స్‌తో నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎంపీ శివప్రసాద్

|
Google Oneindia TeluguNews

చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా, రాజకీయనాయకుడిగా శివప్రసాద్ సుపరిచితుడు. తనకు నటనంటే చాలా ఇష్టమని తన జీవితంలో నటన ఓ భాగమైపోయిందని పలు సందర్భాల్లో చెప్పారు. ముఖ్యంగా రాజకీయ వేదికలపై శివప్రసాద్ పోషించే అలనాటి పాత్రలు చాలా మంది ఆసక్తితో తిలకించేవారు. తన డైలాగులతో అందరినీ ఆకట్టుకునే వారు ఈ మాజీ ఎంపీ.

కొంతకాలంగా అస్వస్థత: చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్ మృతికొంతకాలంగా అస్వస్థత: చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత శివప్రసాద్ మృతి

విభిన్న వేషాలు వేసిన మాజీ ఎంపీ శివప్రసాద్

విభిన్న వేషాలు వేసిన మాజీ ఎంపీ శివప్రసాద్

ఏపీ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ను విభజించరాదని చెబుతూ పలు వేషధారణలతో తన నిరసనను తెలిపారు. ఇక రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కూడా విభజన హామీల అమలు కోసం, ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడారు. పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో ప్రతిరోజు ఓ విభిన్నమైన వేషం వేసి ఇటు ప్రాంతీయ మీడియానే కాకుండా అటు జాతీయ మీడియాను కూడా ఆకట్టుకున్నారు. పార్లమెంటు భవనంలోకి వెళ్లే ఇతర ఎంపీలు కూడా శివప్రసాద్ వేసే వేషధారణలను ఆసక్తికరంగా తిలకించే వారు. ఇలా ఒక్కో రకమైన వేషధారణతో తన నిరసన తెలిపేవారు శివప్రసాద్.

హిజ్రా వేషంలో శివప్రసాద్

హిజ్రా వేషంలో శివప్రసాద్

ఇక 2018లో పార్లమెంటు సమావేశాల సమయంలో శివప్రసాద్ హిజ్రా గెటప్ వేసి తన నిరసనను తెలిపారు. రోజూ ఎన్ని వేషాలు వేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌పై ప్రధాని మోడీ మనసు మాత్రం కరగడం లేదని వ్యాఖ్యానించారు. అందుకే తను హిజ్రా వేషం వేయాల్సి వచ్చిందని చెప్పారు. "మోడీ బావా ఎన్ని మాటలు చెప్పావు.. చేతల్లో చూపించలేదు ప్రత్యేక హోదా ఇవ్వవా " అనే డైలాగులు చెప్పారుశివప్రసాద్. ఇక రోజూ విచిత్ర వేషాలు వేస్తూ తమ నిరసనను తెలిపిన శివప్రసాద్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా అభినందించారు.

తమిళ ఎంపీల మద్దతు కోరుతూ కరుణానిధిగా..

తమిళ ఎంపీల మద్దతు కోరుతూ కరుణానిధిగా..

ఏపీకి అన్యాయం జరిగిందంటూ చెబుతూ ఫ్లకార్డులతో టీడీపీ నిరసన వ్యక్తం చేస్తుండగా... శివప్రసాద్ మాత్రం శ్రీరాముడి వేషం వేసి అక్కడి మీడియాను, ఎంపీలను ఆకట్టుకున్నారు. పద్యాలు చెబుతూ ఏపీకి జరిగిన అన్యాయంను వివరించారు. ఓ సారి మత్స్యకారుని వేషం, మరోరోజు పిట్టలదొర వేషం, ఓ సారి నారదుడి వేషం వేసి పార్లమెంటు ముందు ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇతర రాష్ట్ర ఎంపీలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఓ సారి తమిళనాడు ఎంపీల మద్దతు కోరుతూ కరుణానిధి, ఎంజీఆర్ వేషాలు కూడా వేశారు.

హిట్లర్‌గా శివప్రసాద్..

హిట్లర్‌గా శివప్రసాద్..

మరోసారి స్వాతంత్ర్య సమరయోధుడి అవతారం ఎత్తారు శివప్రసాద్. అల్లూరి సీతారామరాజు వేషం ధరించారు. మరోసారి మోడీ ఎంత చెప్పినా తమ గోడు వినడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నియంత హిట్లర్ వేశం వేశారు. మోడీని నియంతతో పోల్చి ఆ సమయంలో జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించారు. ఒకసారి యమధర్మరాజుగా, మరోసారి మాంత్రికుడి వేషం వేసి డైలాగులు చెప్పి ఆకట్టుకున్నారు.

ఇలా రోజుకోవేషం వేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన ప్రత్యేక హోదాను నిత్యం వెలుగులో ఉండేలా పార్లమెంటు ముందు తన నిరసనను వ్యక్తం చేసి ప్రధాన వార్తల్లో నిలిచారు మాజీ ఎంపీ శివప్రసాద్.

English summary
Chittoor Former TDP MP Siva Prasad who passed away was always in news for his fight for special status to AP.As a part of protest he played many roles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X