చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నరాలు తెగేంత ఉత్కంఠ మధ్య జరిగిన చంద్రగిరి రీపోలింగ్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయ్ ?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే ..ఎన్నికల నేపథ్యలంలో అధికారుల మార్పిడి..ఓవైపు అయితే మరోవైపు ఉప ఎన్నికలు నిర్వహించడంతో రాష్ట్ర్రంలో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం పరిస్థితులు నెలకోన్నాయి. మొదటి దశలోనే ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రిగ్గుంగుకు పాల్పడడంతోపాటు స్వేచ్చగా ఓట్లు వేయనీయ లేదనే ఫిర్యాదుతో చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలీంగ్‌కు ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చంద్రగిరి నియోజక వర్గంపై ప్రజల్లో అటెన్షన్ నెలకొంది.కాని ఫలితాల సరళీ చూస్తే మాత్రం స్వల్ప తేడాలు కనిపించాయి.

నలబై రోజులకు చంద్రగిరిలో రీపోలింగ్..

నలబై రోజులకు చంద్రగిరిలో రీపోలింగ్..

ముఖ్యంగా ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో రీపోలీంగ్ నిర్వహణ ఉహించని పరిణామం..సాధారణంగా ఎన్నికలు జరుగుతున్న
సంధర్భంలోనే పోలింగ్‌ బూత్‌లలో జరిగే ఘర్షణలను బట్టి రీపోలీంగ్‌కు వెంటనే ఎన్నికల కమీషన్ ఆదేశిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పోలీంగ్ జరిగిన నెల రోజుల తర్వాత ఎన్నికల కమీషన్ రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈనేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే.

వైకాపా ఫిర్యాదుతో రీపోలింగ్‌కు ఆదేశించిన ఈసీ

వైకాపా ఫిర్యాదుతో రీపోలింగ్‌కు ఆదేశించిన ఈసీ

చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్లలో రిగ్గింగ్‌కు పాల్పడడంతో పాటు స్వేఛ్చగా ఓట్లు వేయనీయలేదనే వైసీపీ నేతలు ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదును చేశారు,. చంద్రగిరి నియోజక వర్గంలో జరిగిన పోలీంగ్ సరళీ వీడియో రికార్డ్‌లను ఈసీ పరీశీలించిన అనంతరం మొత్తం అయిదు చోట్ల రీపోలింగ్‌కు అవకాశం కల్పించింది.దీంతో టీడీపీ సైతం ఈసీకి పిర్యాధు చేసింది. రీపోలింగ్‌ను కనీసం 40 చోట్ల నిర్వహించాలని కోరింది. దీంతో మరో ప్రాంతాల్లో రీపోలింగ్ కు ఆదేశించిన ఈసీ రెండు పార్టీల పిర్యాధు మేరకు మొత్తం ఏడు చోట్ల పోలీంగ్‌కు ఆదేశించింది.

ఏడు చోట్ల రీపోలింగ్

ఏడు చోట్ల రీపోలింగ్

దీంతో చంద్రగిరి నియోజక వర్గంలో పులివర్తి నారపల్లే, కాళేపల్లి, వెంకట్రామాపురం, కొత్తకండ్రీగ, కమ్మపల్లే, ఎన్.ఆర్ కమ్మపల్లే, కుప్పంబాదూరు పోలింగ్ కేంద్రాల్లో మే 19న రీపోలింగ్ జరిగింది.అయితే ఈ రీపోలింగ్‌లో వైసీపీ ,టీడీపీల మధ్య రాజకీయ ఉద్రిక్తలు చెలరేగిన విషయం తెలిసిందే..దీంతో ఉప ఎన్నికలు జరుతున్న ఏడు ప్రాంతాలు రాష్ట్ర్ర ప్రజలను అటెన్షన్‌లో పెట్టాయి. అంతకు ముందు జరిగిన ఎన్.ఆర్ కమ్మపల్లేలో అటు వైసీపీ, టీడీపీ అభ్యర్థులను అడ్డుకోవడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు రీపోలింగ్ ప్రాంతాల్లో నెలకొన్నాయి.అయితే రీపోలింగ్ జరగిన ప్రాంతాల్లో పడిన ఓట్ల సరళీని చూస్తే మాత్రం రెండు చోట్ల వైకాపాకు, ఐదు చోట్ల టీడీపీకే అధిక్యతను ఇచ్చారు ప్రజలు.

ఏడు ప్రాంతాల్లో పోలైన ఓట్ల వివరాలు

ఏడు ప్రాంతాల్లో పోలైన ఓట్ల వివరాలు


ఈనేపథ్యంలోనే వైసీపీకి కుప్పంబాదురు లో టీడీపీకి 137 ఓట్లు పోలవగా, వైసీపికి 659, కాళేపల్లిలో వైసీపీకి 447 ఓట్లు పోలవగా , టీడీపీకి 78 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక మిగతా అయిదు ప్రాంతాల్లో టీడీపీకే మెజారీటీ ఓట్లు పోలయ్యాయి.అందులో పులివర్తి నారపల్లేలో టీడీపీకి 612,వైకాపాకు, 129, వెంకట్రామాపురంలో,టీడీపీ, 301,వైసీపికి, 26 ,కొత్త కండ్రీగలో టీడీపీకి 544,వైసీపీకి 231, కమ్మపల్లేలో టీడీపీకి 544, వైసీపీకి 272,ఎన్.ఆర్ కమ్మపల్లేలో టీడీపీకి 413, వైసీపీకి 164 ఓట్లు పోలయ్యాయి.

ఇక 2014 ఎన్నికల్లో పోలిస్తే వైకాపాకు వెంకట్రామాపురంలో ఓక్క ఓటు పడితే ఈసారి మాత్రం అది 26 ఓట్లకు పెరిగింది.ఎన్.ఆర్ కమ్మపల్లే కూడ గతంలో రెండు ఓట్లు పోలైతే, ఈసారి 164ఓట్లు పోలయ్యాయి. దీంతో మరో చోట్ల గతంకంటే నూట యాబై ఓట్లు అధికంగా ఓట్లు పోలయ్యాయి.

English summary
we know that this time in Andhra Pradesh elections had been known very tention atmosphere.re polling of the Chandragiri constituency also had been completely tense atmosphere.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X