• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మరిదితో అక్రమ సంబంధం.. కొడుకు లైంగికంగా వేధిస్తున్నాడని.. చివరకు ఏమైందంటే..!

|

చిత్తూరు : అక్రమ సంబంధాలు వావి వరసలు లేకుండా చేస్తున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. బంధాలను తెంచుతూ ఫ్యామిలీ పరువును బజారున పడేస్తున్నాయి. అదే క్రమంలో చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన సభ్యసమాజానికి ఏం మేసేజ్ ఇస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. తల్లి స్థానంలో చూడాల్సిన వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఆ విషయం ఆమె కొడుకు కంటపడటంతో బాబాయ్‌తో ఇదేం పని అని నిలదీశాడు. అయినా కూడా ఆమె తన ప్రవర్తన మార్చుకోవడంతో తల్లిని దారుణంగా హత్య చేశాడు. బాబాయ్‌పై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డాడు.

బాబాయ్‌తో తల్లి ఎఫైర్.. వారించినా వినకుండా..!

బాబాయ్‌తో తల్లి ఎఫైర్.. వారించినా వినకుండా..!

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని రెట్టగుంట దళితవాడకు చెందిన 43 సంవత్సరాల జ్యోతి.. స్థానికుడైన డేవిడ్ రాజుతో ప్రేమలో పడి 25 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 24 ఏళ్ల కూతురు సౌందర్య.. 22 సంవత్సరాల కుమారుడు ప్రేమ్ ఉన్నారు. అయితే పదేళ్ల కిందట డేవిడ్ రాజు అనారోగ్యం బారిన పడ్డారు. ఆ క్రమంలో ఆయన మతిస్థిమితం కోల్పోయారు. అప్పుడు జ్యోతి వయసు 33 ఏళ్లు. అదలావుంటే భర్త తమ్ముడు అవివాహితుడైన సుందర రాజుతో కొన్నాళ్లుగా ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది. అతడు జడ్పీ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు.

బాబాయ్‌తో తన తల్లి అక్రమ సంబంధం కొనసాగిస్తోందనే విషయం ఆరు నెలల కిందట ప్రేమ్ గమనించాడు. ఆ క్రమంలో తల్లిని వారించాడు. పద్దతి మార్చుకోవాలంటూ హితవు పలికాడు. అయినా కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా కొడుకును బ్లేమ్ చేస్తూ మాటల యుద్దానికి తెరలేపింది.

చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదు.. ఎలుగుబంటి పాలన.. వైసీపీ నేతల సెటైర్లు..!

 మరిదితో అక్రమ సంబంధం.. కొడుకు లైంగికంగా వేధిస్తున్నాడని..!

మరిదితో అక్రమ సంబంధం.. కొడుకు లైంగికంగా వేధిస్తున్నాడని..!

మరిదితో సక్రమంగా సాగుతున్న తన అక్రమ సంబంధానికి కొడుకు అడ్డొస్తున్నాడని ఆ తల్లి భావించింది. ఆ నేపథ్యంలో అతడు తీరు మార్చుకోవాలంటూ తనను బెదిరించడంతో కక్ష గట్టింది. దాంతో కొడుకుపై నిందలు మోపుతూ చుట్టుపక్కల ప్రేమ్ గురించి చెడుగా ప్రచారం చేసింది. తనతో అక్రమ సంబంధం కొనసాగించాలంటూ కొడుకు వేధిస్తున్నాడనే ఆరోపణల పర్వానికి తెరలేపింది.

బాబాయ్‌తో పెట్టుకున్న అక్రమ సంబంధంపై నిలదీస్తే.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తుందనే విషయం ప్రేమ్ దృష్టికి వచ్చింది. ఆ క్రమంలో తన తల్లిని మరోసారి నిలదీశాడు. గురువారం నాడు రాత్రి మద్యం తాగొచ్చి తల్లితో గొడవపడ్డాడు. నువ్వు తప్పు చేస్తూ నన్ను అప్రతిష్టపాలు చేస్తావా అంటూ కోపంతో ఊగిపోయాడు.

తల్లిని దారుణంగా చంపి.. బాబాయ్‌ని కత్తితో పొడిచి

తల్లిని దారుణంగా చంపి.. బాబాయ్‌ని కత్తితో పొడిచి

కొడుకు గొడవపడటంతో అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. మద్యం తాగి గొడవ చేస్తున్నాడంటూ పోలీసులకు తెలిపింది. దాంతో వారింటికి వెళ్లిన పోలీసులు ప్రేమ్‌కు సర్ధిచెప్పారు. అంతటితో గొడవ సద్దుమణిగిందని పోలీసులు వెళ్లిపోయారు. వాళ్లు అలా వెళ్లారో లేదో ప్రేమ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అలా గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమ్.. తిరిగి శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు ఇంటికొచ్చాడు.

ఆ సమయంలో తన తల్లి జ్యోతి, బాబాయ్ ఒకే దగ్గర కలిసి ఉండటం చూసి ఆవేశంతో రగిలిపోయాడు. వెంటనే వారిపై కత్తితో దాడి చేశాడు. గొంతుకోసి తల్లిని హతమార్చాడు. అయితే ప్రేమ్‌ దాడిలో కత్తిపోట్లకు గురైన సుందర్‌ రాజు కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగు స్పందించారు. ప్రేమ్‌ను అడ్డుకోవడంతో సుందర్ రాజు ప్రాణాలతో బయటపడగా.. జ్యోతి మాత్రం స్పాట్‌లోనే చనిపోయింది.

వామ్మో ఇస్త్రీపెట్టెల్లో బంగారం.. 3 కోట్ల గోల్డ్ దుబాయ్ టు హైదరాబాద్.. శంషాబాద్‌లో ఫసక్..!

అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా..!

అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా..!

తల్లిని చంపిన తర్వాత నింపాదిగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు ప్రేమ్. అయితే తల్లిని కొడుకు చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రేమ్ చేతిలో కత్తిపోట్లకు గురైన సుందర్‌ రాజును వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి గుడిపాల ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదలావుంటే తల్లి పేరును పలకడానికి కూడా ఇష్టపడని ప్రేమ్.. చివరకు ఆమె అంత్యక్రియల్లో కూడా పాల్గొనకపోవడం గమనార్హం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Illegal relationships are being done without incest. Family defamation is breaking the bonds. At the same time, the event in Chittoor district has left a messy situation for the members of the society. An enlightened man had an illicit affair with his sister in law. As her son found the matter, he murdered mother and attacked on uncle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more