చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాళ్లు సంక్షోభాన్ని జయించారు... ఖండాంతరాలు దాటేశారు... పాల గుట్టపల్లె ఇప్పుడు వరల్డ్ ఫేమస్...

|
Google Oneindia TeluguNews

'అతను అడవిని జయించాడు..' తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపుకు లోను చేసిన నవల ఇది. చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత కేశవరెడ్డి ఒక ఎరుకల వృద్దుడి అస్తిత్వ సంఘర్షణను... నిసర్గ సౌందర్యంతో.. వివశత్వానికి లోను చేసే శైలితో.. పాఠకులను కట్టిపడేసేలా ఆవిష్కరించాడు. ఇదే చిత్తూరు జిల్లాకు చెందిన పాల గుట్టపల్లె దళిత వాడ మహిళలు కూడా ఒకానొక సంఘర్షణను తీవ్రంగా ఎదుర్కొని... చివరకు 'సంక్షోభాన్ని' జయించి... తమను తాము ప్రపంచం ముందు సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు. కనీసం పక్కా రోడ్లు కూడా లేని ఓ కుగ్రామం నుంచి నేడు ఖండాంతారాలు దాటి తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. రెండు,మూడేళ్ల క్రితం గూగుల్ మ్యాప్‌లో కూడా లేని ఆ గ్రామం ఇప్పుడు వరల్డ్ ఫేమస్. వీళ్ల ప్రయాణం ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునే ప్రతీ మహిళకూ స్పూర్తిదాయకం.

పాల గుట్టపల్లె... ఆ ఆలోచన ఎలా మొదలైంది...

పాల గుట్టపల్లె... ఆ ఆలోచన ఎలా మొదలైంది...

చిత్తూరు జిల్లాలో పాల గుట్టపల్లె అనే దళిత వాడ ఉంది. ఈ గ్రామానికి వెళ్లేందుకు కనీసం పక్కా రోడ్లు గానీ మార్గాన్ని సూచించే బోర్డులు గానీ లేవు. ఇక్కడ దాదాపు 70 దళిత కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వ్యవసాయమే వీరి జీవనాధారం. ఇందుకోసం వర్షాల పైనే ఎక్కువగా ఆధారపడుతారు. ఏడేళ్ల క్రితం వర్షాభావ పరిస్థితులతో తీవ్ర కరువు వచ్చి పడింది. ఆ సమయంలో ఒక్క పూట తిండికే తీవ్రంగా అలమటించాయి. ఇక ఇంతేనా మన పరిస్థితి అనుకుంటున్న తరుణంలో ఓ వ్యక్తి, ఆలోచన వారి జీవితాలను మార్చివేసింది.

ఆమె సహాయంతో...

ఆమె సహాయంతో...

చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అపర్ణ కృష్ణన్... పాల గుట్టపల్లెలో కొంత భూమి తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. గ్రామ ప్రజలు కరువుతో తల్లడిల్లుతుంటే వారి కోసం ఏమైనా చేస్తే బాగుండు అన్న ఆలోచన ఆమెలో మెదిలింది. గ్రామంలో కొంతమంది మహిళలకు కుట్టు మెషిన్లు ఉండటం ఆమెకు తెలుసు. దీంతో కాటన్ లేదా జూట్ బ్యాగులు తయారుచేసే ఆలోచన గురించి వారికి చెప్పింది. చెప్పడమే కాదు.. తనకు తెలిసిన ఓ ఫేస్‌బుక్ ఫ్రెండ్ ద్వారా 100 బ్యాగుల ఆర్డర్ ఇప్పించింది. తనే కొంత ఆర్థిక సాయం కూడా చేసింది. అలా వాళ్లు బ్యాగులు తయారుచేసి పంపించారు. ఆ బ్యాగులు బాగున్నాయంటూ మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో వారిలో ఉత్సాహం మరింత పెరిగింది.

వరుస ఆర్డర్స్.. గ్రామంలోనే తయారీ యూనిట్...

వరుస ఆర్డర్స్.. గ్రామంలోనే తయారీ యూనిట్...

హైదరాబాద్ ఆర్డర్ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి 2000 బ్యాగులకు ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత ముంబైలోని పలు రిటైల్ షాపుల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అలా మౌత్ టాక్ ద్వారానే వీరి పనితనం రాష్ట్రాలు,దేశాలు దాటింది. అలా అమెరికా,కెనడా,యూరోప్ నుంచి కూడా ఆర్డర్స్ రావడం మొదలైంది. అంతే,ఇక వీరు తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. మొదట్లో నలుగురు మహిళలతో మొదలైన ఈ ప్రయాణం... ఆ తర్వాత ఆర్డర్స్ పెరిగే కొద్ది క్రమంగా 9 మందికి చేరింది. పాల గుట్టపల్లిలోనే ఒక చిన్న గదిలో బ్యాగ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

ట్రెండ్‌కు తగ్గట్టు రకరకాల డిజైన్స్‌తో....

ట్రెండ్‌కు తగ్గట్టు రకరకాల డిజైన్స్‌తో....

బ్యాగ్స్ తయారుచేసి.. సప్లై చేయడం మొదలుపెట్టిన కొద్దిరోజులకు... ట్రెండ్‌కు తగ్గట్టు బ్యాగుల డిజైన్‌ను కూడా మార్చాలని ఆ మహిళలు ఆలోచించారు. ఇందుకోసం విఘ్నేశన్ అనే ఓ వలంటీర్ వారికి సహకరించాడు. చెన్నైకి వెళ్లి స్క్రీన్ ప్రింటింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇందుకు అవసరమయ్యే మెషినరీని కూడా కొనుగోలు చేశారు. అలా బ్యాగ్స్‌పై ఆకర్షణీయమైన ప్రింటింగ్స్‌ వేయడం మొదలుపెట్టాక ఆర్డర్స్ మరింత పెరిగాయి. బ్యాగ్స్ తయారీ బృందంలో ఒకరైన అనిత దీని గురించి మాట్లాడుతూ... 'సాదాసీదా బ్యాగ్స్ మొదలు వెజిటేబుల్ క్యారీ బ్యాగ్స్,హ్యాండ్ బ్యాగ్స్,స్కూల్ బ్యాగ్స్,ల్యాప్ ట్యాప్ క్యారీ బ్యాగ్స్,ఫ్రిజ్ కవర్స్ వరకు మేము తయారుచేస్తున్నాం.' అని చెప్పారు.

పోస్టాఫీస్ ద్వారా పార్శిల్స్...

పోస్టాఫీస్ ద్వారా పార్శిల్స్...


ఒక ఆర్డర్ వచ్చాక... మొదట ఈ టీమ్ అంతా తమ తయారీ కేంద్రంలో సమావేశమవుతారు.ఆర్డర్‌ను బట్టి కాటన్ లేదా జూట్‌ను అందరూ సమ భాగాలుగా పంచుకుంటారు. ఆ తర్వాత ఇంటికెళ్లి కస్టమర్స్ అభిరుచికి అనుగుణంగా వాటిని కుడుతారు. పని పూర్తయ్యాక తిరిగి అందరూ ఆ తయారీ కేంద్రంలోనే సమావేశమవుతారు. ఏవైనా లోటు పాట్లు ఉంటే సరిచేసుకుంటారు. తక్కువ ఆర్డర్స్ అయితే సమీపంలోని పట్టణానికి వెళ్లి పోస్ట్ ఆఫీస్ ద్వారా పార్శిల్ చేస్తారు. బల్క్ ఆర్డర్స్ అయితే తిరుపతి పట్టణంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి పార్శిల్స్ చేసి వస్తారు.

Recommended Video

Solar Eclipse 2020 : సూర్యగ్రహణం రోజున Srikalahasthi Temple ఒక్కటే ఎందుకు తెరిచి ఉంటుంది..?
ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో...

ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో...

బ్యాగ్స్ మాత్రమే కాదు ఇప్పుడు వీరు రుచికరమైన పచ్చళ్లు కూడా అమ్ముతున్నారు. వీరికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ http://paalaguttapalle.com/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌కు అందుబాటులో ఉన్నాయి. రూ.40 మొదలు రూ.450 వరకూ వీరి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాపారం మొదలుపెట్టాక ఇక్కడి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారు. కనీసం నెలకు ఒక్కొక్కరు రూ.6వేలు వరకు సంపాదిస్తున్నారు. ఇప్పుడు కరువొచ్చినా... భవిష్యత్ ఎట్లా అన్న బెంగ లేదు. పిల్లల చదువుల గురించి ఆందోళన అవసరం లేదు. ఈ టీమ్‌లోని మహిళల్లో కొందరు బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్లు కూడా నిర్మించుకున్నారు.

సికింద్రాబాద్‌లోనూ అందుబాటులో...

సికింద్రాబాద్‌లోనూ అందుబాటులో...

సికింద్రాబాద్‌లోని 'Our Sacred Space'లోనూ పాల గుట్టపల్లె మహిళలు తయారుచేసిన బ్యాగ్స్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి విజిట్ చేసే చాలామంది పాల గుట్టపల్లె బ్యాగ్స్‌ను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ కూడా మౌత్ టాక్‌ తోనే ఆ బ్యాగ్స్‌కు మంచి గిరాకీ ఏర్పడింది. ప్లాస్టిక్ బ్యాగ్స్‌కు బదులు వీటిని వాడితే పర్యావరణానికి మేలు చేయడమే కాదు... ఇలా తమ కాళ్లపై నిలబడ్డ మహిళలకు ఒక చేయూత అందిచ్చినవారవుతారు.

English summary
When Paalaguttapalle, a village in chittoor, andhra Pradesh suffered from droughts seven years ago, the village faced extreme poverty and unemployment. However, women of this village have turned things around. To support their families and build a substantial income, these women have started to stitch bags and sell pickles. Today they are exporting their products to foreign countries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X