ఎంతపనయిపాయే సతీశా.. పరీక్ష రాసేందుకు వెళ్లి.. మృత్యు ఒడిలోకి
దాదాపు రెండేళ్ల తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కరోనా దెబ్బకు టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా నిర్వహించని పరిస్థితి. ఈ ఏడాది చిన్నగా పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామ్ కోసం విద్యార్థులు సన్నద్దమై వచ్చారు. అయితే పరీక్ష రాస్తుండగా ఓ విద్యార్థి కుప్పకూలాడు. అప్పటికే ఆస్పత్రికి తరలించారు. అయినప్పిటికీ ఫలితం లేకుండా పోయింది. అతను చనిపోయాడని తెలియడంతో.. విషాదం నెలకొంది. ఈ ఘటన తిరుపతి జిల్లా గుడూరులో జరిగింది.

గేటు వద్దకు వచ్చిన సమయంలో నొప్పి..
పరీక్ష రాసేందుకు గుడూరు డీఆర్డీబ్య్లూ కేంద్రానికి సతీశ్ అనే ఇంటర్ విద్యార్థి వచ్చాడు. గేటు వద్దకు వచ్చిన సమయంలో అతను ఇబ్బంది ఉన్నాడు. తనకు ఛాతిలో నొప్పి ఉందని చెప్పినట్టు తెలిసింది. కానీ కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి కూడా కడుపునొప్పి ఉంటుంది. అలా లైట్ తీసుకుని ఉంటాడు. పరీక్ష రాయాలనే ఉద్దేశంతో హాలులోనికి వెళ్లాడు. కానీ అంతలోనే తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయాడు.

గుండెపోటు రావడంతో కుప్పకూలి..
పరీక్ష కేంద్రంలోకి వెళ్లాడో లేదో.. గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. అయినా నో యూజ్.. అతడిని పరీక్షించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. సతీష్ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నాడు. ఇతను సైదాపురం కాగా.. అతని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన విషయం అతని తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. విద్యార్థి మరణంతో పరీక్ష కేంద్రం వద్ద విషాద వాతావరణం నెలకొంది. తోటి స్టూడెంట్స్ బాధతో కనిపించారు.

విద్యార్థులకు హార్ట్ స్ట్రోకా..?
ఇప్పుడు గుండెపోటు రావడం కామన్‌గా మారిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా స్ట్రోక్ వస్తోంది. ఒకప్పుడు 40, 50 దాటితేనే వస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు సిచుయేషన్ మారుతుంది. టైమ్, ఫుడ్, నిద్ర లేకపోవడంతో గుండె ఒత్తిడికి గురవుతుంది. టీనెజర్లు కూడా గుండెపోటు బారిన పడి చనిపోవాల్సి వస్తోంది. ఎంతో భవిష్యత్ ఉన్న యువత ఇలా అర్ధాంతరంగా తనువు చాలించే పరిస్థితి వస్తోంది. సో వారిని ఒత్తిడికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత పేరంట్స్పై ఉంది. నిద్ర, ఆహారం కూడా సరయిన సమయంలో తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.