రోజా వ్యాఖ్యలతో జగన్ టార్గెట్ గా ట్రోల్స్ ... జగనన్న విద్యా కానుకపై రోజాకు దిమ్మ తిరిగే షాక్
రాష్ట్రంలో పేద పిల్లల చదువుల బాధ్యత మేనమామగా తనదేనని, తల్లిదండ్రులపై నయాపైసా భారం పడకుండా వారికి మంచి చదువులు అందించేలా చూస్తానని చెప్పి రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కృష్ణాజిల్లా పునాదిపాడు జడ్పీ హైస్కూల్ లో జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమం నేపథ్యంలో ఏపీ సర్కార్ పై, జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు రోజా గతంలో మాట్లాడిన వీడియో షేర్ చేస్తూ జగన్ , రోజాలను ట్రోల్ చేస్తున్నారు .
లోకేష్ అడ్డంగా దొరికారన్న రోజా .. చంద్రబాబు , లోకేష్ ల స్కామ్స్ పై సీబీఐ విచారణకు డిమాండ్

ఖర్జూర నాయుడు సొమ్మిస్తున్నారా ?నాడు రోజా వ్యాఖ్యలే ఇప్పుడు ఆయుధం
స్కూల్ విద్యార్థులకు ఇచ్చే బెల్టుల పై వైఎస్ఆర్సిపి జెండా రంగు ఉండడంతో పాటుగా, జగన్ పేరు ఉండటంతో గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే రోజా చంద్రబాబు పై చేసిన విమర్శలు గుర్తు చేసి మరీ జగన్ ను ట్రోల్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. అసలు ఇంతకీ ఈ రోజా ఈ వ్యవహారంలో టార్గెట్ చేయడం వెనుక పెద్ద రీజన్ ఉంది. రోజా గతంలో చంద్రబాబు హయాంలో చంద్రన్న కానుకల పేరుతో పథకాలకు ఖర్జూర నాయుడు సొమ్ము ఏమైనా ఇస్తున్నారా అంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు రోజాపై మాటల దాడి చేస్తున్నారు .

జగనన్న సొమ్మిస్తున్నారా ? రాజారెడ్డి సొమ్మిస్తున్నారా
ఇప్పుడు జగనన్న సొమ్మేమైనా ఇస్తున్నారా లేదా రాజారెడ్డి సొమ్మేమైనా ఇస్తున్నారా అంటూ ఈ విషయంపై రోజా మాట్లాడాలంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించిన రోజా ప్రజలకు చంద్రబాబు ఇచ్చేదేమైనా ఖర్జూర నాయుడు సొత్తా , మీ మామ ఎన్టీఆర్ సొత్తా ,లేక నీ కుమారుడు లోకేశ్ సొత్తా అంటూ విమర్శలు గుప్పించారు. గతంలో చంద్రన్న కానుకల విషయంలో రోజా నిప్పులు చెరిగారు.

గతంలో చంద్రబాబును తిట్టిపోసిన రోజా ఇప్పుడు జగన్ పై మాట్లాడాలని సెటైర్లు
చంద్రబాబు పథకాలకు ఆయన పేరు పెట్టుకోవడాన్ని కూడా రోజా విమర్శించారు. భవిష్యత్తులో ఎవరు గుర్తుంచుకోరు అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఆయన పేరు పెట్టుకుంటున్నారు అంటూ నిప్పులు చెరిగారు. ఇక ప్రస్తుతం రోజా వ్యాఖ్యలే టిడిపి నేతలకు ఆయుధాలుగా మారాయి. జగనన్న విద్య కానుక విషయంలో కూడా రోజా ఈ తరహా వ్యాఖ్యలు చేయాలంటూ తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు. బెల్టులు, బ్యాగులు జగనన్న నాన్న ఆస్తి నుండి ఇస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముళ్లు, జనసేన నేతలు రోజా గారికి ఇంకోసారి మళ్లీ ఇలా మాట్లాడే అవకాశం వచ్చింది అంటూ రోజా మాట్లాడాలని అడుగుతున్నారు.

జగన్ ను ఇరకాటంలో పెడుతూ రోజా పై ట్రోల్స్
గతంలో ఆమె మాట్లాడిన వీడియో ని షేర్ చేస్తున్నారు.గతంలో రోజా చేసిన వ్యాఖ్యలు తాజాగా జగన్ ని ఇరకాటంలో పెట్టడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది .
గతంలో చంద్రబాబు దుమ్ము దులిపిన రోజా ఇప్పుడు జగన్ దుమ్ము దులపండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అప్పుడు చంద్రబాబును ప్రశ్నించిన రోజా ఇప్పుడు విద్యా కానుక ఎవరి సొమ్ముతో ఇస్తున్నారని ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరి ఆస్తులను ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించమంటున్నారు . అప్పుడు చంద్రబాబు పేరు పెట్టారని మండిపడిన రోజా ఇప్పుడు జగన్ పేరు పెడితే మాట్లాడరా అంటూ నిలదీస్తున్నారు. మొత్తానికి రోజా గతంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జగన్ ను టార్గెట్ చేయడానికి టిడిపి నేతలకు బాగా పనికొస్తున్నాయి.