చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌న‌సేన స‌భ‌లో జై జ‌గ‌న్ నినాదాలు : వాగ్వాదం - తోపులాట‌: హైప‌ర్ ఆది కారు పై దాడి..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఎన్నిక‌ల ర‌ణ‌రంగం అప్ప‌డే మొద‌లైంది. జ‌న‌సేన నిర్వహించిన స‌భ‌లో వైసిపి శ్రేణులు ప్ర‌వేశించాయి . జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్న స‌మ‌యంలో ఆందోళ‌న‌కు దిగాయి. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు వారికి అడ్డుకొనే ప్ర‌య‌త్నం చేసారు. రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం - తోపులాట చోటు చేసుకున్నాయి. పోలీసులు రంగ ప్ర‌వేశం చేయాల్సి వ‌చ్చింది. దీంతో.. స‌భ‌కు హాజ‌ర‌నై వారు మ‌ధ్య‌లోనే వెనుతిరుగాల్సి వ‌చ్చింది..

జగన్‌కు షాక్, వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ గుడ్‌బై: ఆ లేఖలో ఏముందంటే, టీడీపీలోకి వెళ్తున్నారా? జగన్‌కు షాక్, వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ గుడ్‌బై: ఆ లేఖలో ఏముందంటే, టీడీపీలోకి వెళ్తున్నారా?

జ‌న‌సేన స‌భ ర‌సాభాస‌గా..

జ‌న‌సేన స‌భ ర‌సాభాస‌గా..

చిత్తూరు జిల్లా పుంగూరు నియోజ‌క‌వ‌ర్గంలోని సోమ‌ల మండ‌లం కందూరు లో జ‌న‌సేన అభిమానులు స‌భ ఏర్పాటు చేసుకున్నారు. ఆ స‌భ జ‌రుగుతున్న స‌మ‌యంలో కొంద‌రు వ‌క్త‌లు జ‌గ‌న్ ను ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేసారు. దీంతో.. ఆ స‌భ‌లోకి వైసిపి శ్రేణులు చొచ్చుకొచ్చారు. జై జ‌గ‌న్ అంటూ నినాదాలు చేసారు. దీనిని ప‌వ‌న్ అభిమానులు ప్ర‌తిఘ‌టిం చారు.

జ‌గ‌న్ - వ‌ప‌న్ అభిమానుల మ‌ధ్య వాగ్వాదం

జ‌గ‌న్ - వ‌ప‌న్ అభిమానుల మ‌ధ్య వాగ్వాదం

జ‌గ‌న్ - వ‌ప‌న్ అభిమానుల మ‌ధ్య వాగ్వాదం..తోపులాట‌లు... కుర్చీలు విసురుకోవటం చోటు చేసుకున్నాయి. అయితే, ఈ స‌భ వ‌ద్ద ఇద్ద‌రు పోలీసు కానిస్టేబుళ్లు మాత్రమే బందోబ‌స్తు కోసం విధుల్లో ఉన్నారు. పెద్ద సంఖ్య‌లో వ‌ప‌న్ అభిమానులు స‌భ‌కు హాజ‌ర‌య్యారు. జ‌గ‌న్ అభిమానులు సైతం స‌భా ప్రాంగ‌ణంలోకి రావ‌టం తో రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. ఆ ఇద్ద‌రు పోలీసుల‌కు వీరిని నిలువ‌రించ‌టం క‌ష్టంగా మారింది.

కుల పిచ్చితోనే ఓట్లు ..ప‌వ‌న్ తోనే భ‌విష్య‌త్తు..

కుల పిచ్చితోనే ఓట్లు ..ప‌వ‌న్ తోనే భ‌విష్య‌త్తు..

స‌భ లో గంద‌ర‌గోళం జరుగుతున్న స‌మ‌యంలోనే హైప‌ర్ ఆది అక్క‌డికి చేరుకున్నారు. ఆయ‌న కారు అద్దాల పై వైసిపి కార్య‌క‌ర్త‌లు కొట్టారు. కారుకు వ‌ల‌యంగా ఏర్ప‌డి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు హైప‌ర్ అదిని స‌భ వేదిక వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. ఎన్నిక‌లు జ‌రిగే ఈ కాలంలో జ‌న‌సేన పై దాడులు చేసి గంద‌ర‌గోళం సృష్టించాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నిస్టుంటార‌ని.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆది సూచించారు. కులపిచ్చితో కొందరు ఓట్లు వేస్తున్నారని, కానీ పవన్‌లాంటి నిస్వార్థ నేతను ఎన్నుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పవన్‌ కల్యాణ్‌కు డబ్బు, పదవి పిచ్చిలేదని, కేవలం ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని ఆది వివ‌రించారు. అప్ప‌టికీ స‌భా ప్రాంగ‌ణంలోనే ఉన్న వైసిపి కార్య‌ర్త‌లు ఆది ప్రసంగానికి అడ్డుతగులుతూ ‘జై జగన్‌' అంటూ నినాదాలు చేస్తూ వేదిక వరకూ వచ్చారు. దీంతో ఆది తన ప్రసంగాన్ని ముగించేశారు. దీంతో..అక్క‌డ ఉన్న పోలీసులు ఆది, మరికొందరు జనసేన నేతలను మరో మార్గం నుంచి తిరుపతికి పంపారు.

English summary
YCP supporters enter in Janasena party meeting and given slogans in favour of jagan. Pawan ans also reacted seriously. In that meeting Jabardasth fame Hyper Adi paticipated in that meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X