• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లొంగలేదని మహిళ దారుణహత్య: మృతదేహాన్ని వదలని సెక్స్ శాడిస్ట్..రేప్: ఏపీ వ్యక్తి అరెస్ట్

|

చిత్తూరు: తనతో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడానికి నిరాకరించిందనే కారణంతో ఓ మహిళను అతి దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. ఆమె గొంతు నులిమి హతమార్చాడు. అక్కడితో ఆగలేదతను. ఆ మహిళ మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో అజ్ఙాతంలోకి వెళ్లిపోయాడు. నెల రోజుల తరువాత పోలీసుల చేతికి చిక్కాడతను. వలపన్ని మరీ ఆ దుర్మార్గుడిని పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్‌కు తరలించారు.

అక్రమ సంబంధం కోసం ప్రయత్నించి..

అక్రమ సంబంధం కోసం ప్రయత్నించి..

ఆ కిరాతకుడి పేరు శంకరప్ప. చిత్తూరు జిల్లా ఎద్దులోళ్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది గ్రామం. కర్ణాటకలోని చింతామణి తాలూకా కోనాపుర గ్రామానికి చెందిన ఓ మహిళపై కన్నేశాడు. కోనాపురలో తనకు పరిచయస్తులు ఉండటంతో తరచూ అక్కడికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఓ మహిళకు ప్రేమ పేరుతో దగ్గర కావడానికి ప్రయత్నించాడు. అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడానికి ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ ఉద్దేశాన్ని పసిగట్టిన ఆమె అతన్ని దూరంగా పెట్టింది. ఎంత ప్రయత్నించినప్పటికీ.. లొంగలేదు.

హత్యానంతరం అత్యాచారం..

హత్యానంతరం అత్యాచారం..

దీనితో అతను ఆ మహిళపై కసి పెంచుకున్నాడు. హత్య చేయాలని కుట్ర పన్నాడు. కోనాపురలో తన పొలంలో ఒంటరిగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఉన్న ఆమెపై ఘాతుకానికి తెగబడ్డాడు. అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్య చేశాడు. గొంతు నులిమి చంపేశాడు. మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో తప్పించుకుని పారిపోయాడు. కిందటి నెల 19వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా.. నిందితుడు అప్పటి నుంచీ తప్పించుకుని తిరుగుతున్నాడు.

నెలరోజుల పాటు తప్పించుకుని తిరుగుతూ..

నెలరోజుల పాటు తప్పించుకుని తిరుగుతూ..

కోనాపుర మహిళ హత్య కేసును చింతామణి తాలూకా పరిధిలోని బట్లహళ్లి పోలీసులు నమోదు చేశారు. నిందితుడు శంకరప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని గురించి చాలాచోట్ల విచారించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. పోలీసులు నిరాశ చెందలేదు. శంకరప్ప కోసం తమ గాలింపును కొనసాగించారు. పోలీసులకు చేతికి చిక్కకూడదనే ఉద్దేశంతో అతను ఈ నెల రోజుల కాలంలో పలు సిమ్ కార్డులను మార్చడు. తప్పుడు చిరునామాలతో సిమ్ కార్డులను కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

  Diwali 2020: Restrictions on Crackers | Green Firecrackers Only for 2 Hours | Oneindia Telugu
  సంఘటనా స్థలం నుంచి ఆధారాలు..

  సంఘటనా స్థలం నుంచి ఆధారాలు..

  ఎట్టకేలకు శంకరప్పను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా అతను పలు దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించాడు. మృతదేహంపై అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడని అన్నారు. అతణ్ని సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పూర్తి ఆధారాలను సేకరించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చింతామణి పోలీసులు అధికారులు తెలిపారు. శారీరక సంబంధం పెట్టుకోవడానికి అంగీకరించకపోవడం వల్ల అతను ఆగ్రహానికి లోనై హత్య చేశాడని, మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.

  English summary
  Batlahalli Police in Chitamani in Chikballapur district of Karnataka arrested a man who killed a women and raped her deadbody. Police arrested a Andhra man Shankarappa and remanded in this case.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X