చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మదనపల్లె జంట హత్యల కేసు .. విశాఖ మెంటల్ ఆస్పత్రికి దంపతులు పద్మజ , పురుషోత్తం నాయుడు

|
Google Oneindia TeluguNews

మూఢ భక్తి తో ఇద్దరు కుమార్తెలను చంపుకున్న మదనపల్లె జంట హత్యల కేసులో భార్యాభర్తలిద్దరూ మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని వైద్యులు నిర్ధారించి, వారిని విశాఖ మెంటల్ ఆస్పత్రికి తరలించాలని సూచించిన నేపథ్యంలో జైలు అధికారులు వారిని విశాఖపట్నం మానసిక చికిత్స ఆలయానికి తరలించటం కోసం నిర్ణయం తీసుకున్నారు.

కాళికనని నాలుక కోసి తినేసి .. మదనపల్లె హత్యల కేసులో డాక్టర్ లతో భయానక విషయాలుకాళికనని నాలుక కోసి తినేసి .. మదనపల్లె హత్యల కేసులో డాక్టర్ లతో భయానక విషయాలు

 ఈరోజు ఉదయం పోలీసులు విశాఖలోని మానసిక చికిత్సాలయానికి వీరిని తరలించారు.

ఈరోజు ఉదయం పోలీసులు విశాఖలోని మానసిక చికిత్సాలయానికి వీరిని తరలించారు.

మూఢ విశ్వాసాలతో కూతుళ్ళను చంపుకున్న తల్లిదండ్రుల కేసులో షాకింగ్ ట్విస్ట్ లు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లెలో మూఢ భక్తితో కుమార్తెలను హతమార్చిన కేసులో పలు దారుణమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కన్న బిడ్డలను హత్య మార్చి వారు తిరిగి బ్రతికి వస్తారని తల్లిదండ్రులు వింతగా ప్రవర్తించడం, హింసాత్మక ఘటనలకు పాల్పడడం, జుగుప్సాకరమైన పనులను చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తల్లిదండ్రులు చేసిన ఘాతుకాన్ని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసిన అనంతరం కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు వారికి 15 రోజుల రిమాండ్ విధించటంతో వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.

మానసిక వ్యాధి గ్రస్తులుగా భార్యాభర్తలు పద్మజ, పురుషోత్తం నాయుడు

మానసిక వ్యాధి గ్రస్తులుగా భార్యాభర్తలు పద్మజ, పురుషోత్తం నాయుడు

అక్కడ వారు రాత్రి సమయాల్లో చిత్రవిచిత్రంగా కేకలు వేయడం, తానే శివుడు అంటూ అరవడం వంటి ఘటనలకు పాల్పడటంతో వారిని వైద్యపరీక్షల నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు అడిగిన ప్రశ్నలకు కూడా చిత్ర, విచిత్రమైన సమాధానాలు చెప్పిన భార్యాభర్తలు ఇరువురూ మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని, వారిరువురిని జైలు వంటి గదిలో ఉంచి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని, అందరితో కలిసి ఉంచితే ప్రమాదమని, విశాఖపట్నం లోని మానసిక చికిత్స ఆలయానికి రిఫర్ చేస్తున్నామని రుయా ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.

జైల్లో కేకలు , విశాఖ మెంటల్ ఆస్పత్రికి దంపతుల సిఫార్సు .. విశాఖకు తరలింపు

జైల్లో కేకలు , విశాఖ మెంటల్ ఆస్పత్రికి దంపతుల సిఫార్సు .. విశాఖకు తరలింపు

ఆ తర్వాత తిరిగి సబ్ జైలుకు వచ్చిన క్రమంలో కూడా వారిలో ఎలాంటి మార్పు లేదు. రాత్రిపూట పెద్ద పెద్దగా అరుస్తూ ,హాహాకారాలు చేస్తూ మిగతా ఖైదీలకు కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు మదనపల్లి హత్యల కేసు నిందితులు అయిన దంపతులు.

ఈ క్రమంలో విశాఖలోని కష్టోడియన్ కేర్ కు నిందితులను తరలించాలని రుయా ఆసుపత్రి వైద్యుల సిఫార్సులతో జైలు అధికారులు వారిని విశాఖ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అక్కడ వీరిద్దరికీ వైద్యులు చికిత్స చేయనున్నారు.

English summary
Ruya's doctors confirmed that both the husband and wife were suffering from mental illness in the Madanapalle twin murder case in which they killed their two daughters with superstitious devotion. Police rushed them to a psychiatric hospital in Visakhapatnam this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X