• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కుటుంబమంతా నగ్నంగా పూజలు.. మృతదేహంపై ముగ్గు వేసి... మదనపల్లె కేసులో భయంకర నిజాలు

|

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసిన మదనపల్లె జంట హత్యల కేసులో భయంకరమైన,విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సమాజంలో ఉన్నత విద్యావంతులుగా,ఉన్నత కుటుంబానికి చెందినవారిగా గౌరవ మర్యాదలున్న ఆ కుటుంబం అత్యంత ఉన్మాద మూఢత్వంలో కూరుకుపోయింది. విపరీత భావాలతో,విచక్షణారహిత ధోరణితో చేజేతులా జీవితాలను నాశనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా పలు కీలక ఆధారాలు వెల్లడయ్యాయి.

బలిదానం చేసుకోవాలనుకున్న దంపతులు

బలిదానం చేసుకోవాలనుకున్న దంపతులు

మదనపల్లెలోని శివనగర్‌లో ఉన్న తమ ఇంట్లో ఇద్దరు కుమార్తెలు అలేఖ్య(27),సాయి దివ్య(22)లను అత్యంత పాశవికంగా హతమార్చిన పద్మజ-పురుషోత్తమ నాయుడు దంపతులు... ఆ తర్వాత తాము కూడా బలిదానం చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో అందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ దంపతులు విపరీతంగా కుమిలిపోతున్నారట. తాము కూడా మరణించి పుణ్య లోకాలకు చేరుకుని ఉండేవారమని వారు వాపోతున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడూ అదే ధ్యాస...

ఎప్పుడూ అదే ధ్యాస...

శివనగర్‌లో కట్టుకున్న మూడంతస్తుల భవనంలోకి పురుషోత్తమ నాయుడు ఏడాది క్రితం గృహ ప్రవేశం చేసినట్లు సమాచారం. మూడంతస్తుల ఆ భవనంలో వీరి ఒక్కరి కుటుంబమే నివాసం ఉండేది. ఇంట్లో తరుచూ ఆధ్యాత్మిక అంశాలు,దెయ్యాలు,ఆత్మలు,దేవుళ్లు... ఇవే విషయాలు చర్చించుకునేవారు. పురుషోత్తమ నాయుడు ఆధ్యాత్మిక,తాంత్రిక పుస్తకాలు ఎక్కువగా చదివేవారు.

ఏ చిన్న సమస్య వచ్చినా ఏదో జరిగిపోతోందని గాబరా పడేవారు... దాని నుంచి బయటపడితే బాబా మహిమ అని భావించేవారు.

వారం రోజుల క్రితం ఆ సంఘటనతో...

వారం రోజుల క్రితం ఆ సంఘటనతో...

వారం రోజుల క్రితం అక్కాచెల్లెళ్లు అలేఖ్య,సాయిదివ్య తమ పెంపుడు కుక్కను తీసుకుని మార్నింగ్ వాక్‌కి వెళ్లిన సమయంలో జరిగిన సంఘటన పురుషోత్తమ నాయుడు కుటుంబాన్ని మరింత మూఢత్వంలోకి నెట్టివేసింది. మూడు రోడ్ల కూడలిలో ఎవరో ముగ్గు వేసి, దిష్టి తీసిన నిమ్మకాయలు పెట్టి పసుపు,కుంకుమ చల్లారు. అది గమనించని అక్కాచెల్లెళ్లు దాన్ని తొక్కుకుంటూ వెళ్లారు. అప్పటినుంచి తమకేదో జరుగుతుందని,తమనేదో వెంటాడుతుందని తీవ్ర భయంతో వణికిపోయారు. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా... వారు కూడా దీనిపై తీవ్రంగా ఆలోచించినట్లు తెలుస్తోంది.

మంత్రగాడితో పూజలు...

మంత్రగాడితో పూజలు...

ఆరోజు నుంచి పెద్ద కుమార్తె అలేఖ్య పూర్తిగా మౌనంగా ఉంటోంది. అలేఖ్య,సాయిదివ్య ఇద్దరూ ఇంట్లో దెయ్యాలు సంచరిస్తున్నాయని అపోహ పడేవారు. ఈ క్రమంలో తమిళనాడు నుంచి ఓ మంత్రగాడిని రప్పించిన పురుషోత్తమ నాయుడు... ఇంట్లో పూజలు చేయించాడు. అతనితో కుటుంబ సభ్యులందరూ తాయిత్తులు కట్టించుకున్నారు. దాదాపు గత వారం రోజులుగా దంపతులిద్దరూ విధులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు.

మృతదేహం నుదుటిపై ముగ్గులు..

మృతదేహం నుదుటిపై ముగ్గులు..

ఆదివారం మధ్యాహ్నం సమయంలో తన గదిలో మ్యూజిక్ వాయించుకుంటున్న సాయి దివ్య ఉన్నట్టుండి బిగ్గరగా అరిచింది. దీంతో ఏమైందోనని తల్లిదండ్రులు,అలేఖ్య ఆమె వద్దకు పరిగెత్తారు. సాయి దివ్య మానసిక రోగిలా ఏవేవో ప్రేలాపనలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో దెయ్యం ఆమెను ఆవహించిందని భావించిన తల్లిదండ్రులు,అలేఖ్య... డంబెల్‌తో కొడితే దెయ్యం పారిపోతుందని ఆమెపై దానితో బలంగా దాడి చేశారు. దీంతో సాయిదివ్య అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అలేఖ్య సాయిదివ్య మృతదేహం నుదుటిపై ముగ్గు వేసి... చెల్లెలి ఆత్మను బయటకు వెళ్లకుండా బంధించానని తల్లిదండ్రులతో చెప్పింది.

  అధిక ఉత్పత్తి తక్కువ డిమాండే కారణం.....!
  నగ్న పూజలు...

  నగ్న పూజలు...

  చెల్లెలిని మళ్లీ బతికించి తీసుకొస్తానని... ఇందుకోసం తననూ చంపాలని తల్లిదండ్రులను అలేఖ్య కోరింది. ఆ తర్వాత పురుషోత్తమ నాయుడు,పద్మజ,అలేఖ్య ముగ్గురూ కలిసి పూజ గదిలో నగ్నంగా పూజలు చేశారు. అనంతరం అలేఖ్య నోటిలో చిన్న రాగి కలశాన్ని ఉంచి... అందులో నవధాన్యాలు పోసి... తలపై డంబెల్‌తో కొట్టి చంపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సాయంత్రం 7గంటలకు పురుషోత్తమ నాయుడు తన సహచర అధ్యాపకుడికి దీనిపై సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం బయటపడింది. ఇప్పటికీ పద్మజ ఇంకా మానసిక రోగిలాగే ప్రవర్తిస్తోంది. బిడ్డలిద్దరూ పుణ్య లోకంలో ఉన్నారని... సోమవారం ఉదయం తిరిగొస్తారని చెబుతోంది. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు.

  English summary
  Madanapalle twin murder case, the family, which was highly educated and respected in the society, was plunged into the most maniacal stupidity.Several key evidences have recently been revealed regarding the incident.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X