చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ కరోనా: భూమన కరుణాకర్ రెడ్డికి పాజిటివ్, నేడు మరోసారి టెస్ట్, తర్వాతే ట్రీట్‌మెంట్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ రెండోసారి కూడా సోకుతోంది. అయితే వైరస్ సోకిన తర్వాత మూడు నెలల వరకు మళ్లీ రాదు అని నిపుణులు తెలిపారు. కానీ వాస్తవం మాత్రం మరోలా జరుగుతోంది. వైరస్ కూడా రూపాంతరం చెందడంతో దానిని శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి మరోసారి కరోనా వైరస్ సోకింది. అయితే వైరస్ నిర్ధారణ కోసం మరోసారి టెస్ట్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.

 మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లో ప్రహ్లాద్ జోషి మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లో ప్రహ్లాద్ జోషి

భూమన కరుణాకర్ రెడ్డి ఆగస్ట్ నెలలో కరోనా వైరస్ సోకింది. ఆ సమయంలో రుయా ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకోవడంతో వైరస్ తగ్గింది. తర్వాత ఆయన మాములుగా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇటీవల మరోసారి కరోనా లక్షణాలు కనిపించాయి. ఎందుకైనా మంచిదని తిరుపతి ల్యాబ్‌లో పరీక్ష నిర్వహించారు. అయితే మరోసారి పాజిటివ్ రావడంతో ఆందోళన చెందారు. కన్ఫామ్ చేసుకునేందుకు మరోసారి పరీక్ష చేయించుకుంటామని తెలిపారు.

mla bhumana karunakar reddy re-infected coronavirus

Recommended Video

Sadineni Yamini పై కేసు వేసిన TTD అధికారులు.. కారణం ఇదే!!

ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రిలో భూమన కరుణాకర్ రెడ్డి పరీక్ష చేయించుకోనున్నారు. ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. పాజిటివ్ వస్తే ఆస్పత్రిలో చేరే అవకాశం ఉంది. ఒకవేళ నెగిటివ్ వస్తే మాత్రం ఇంటికి వెళతారు. ఇంటికెళ్లిన క్వారంటైన్ ఉండాలని వైద్యులు సూచించే అవకాశం ఉంది. అయితే రెండోసారి కరోనా వైరస్ సోకడం మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. భయపడొద్దని, ఏమీ కాదని వైద్యులు ధైర్యం చెబుతున్నారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటే సరిపోతుందని సజెస్ట్ చేస్తున్నారు.

English summary
tirupati ysrcp mla bhumana karunakar reddy re-infected coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X