వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట విషాదం... సోదరుడి మృతి...
ఏపీ ప్రభుత్వ విప్,చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు చెవిరెడ్డి హనుమంత రెడ్డి(45) అనారోగ్యంతో గురువారం(జనవరి 21) మృతి చెందారు. కొద్దిరోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనుమంత రెడ్డి... పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం(జనవరి 22) తుమ్మలగుంటలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. హనుమంత రెడ్డి మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫోన్లో పరామర్శించినట్లు సమాచారం.
House site pattas programme extended till Jan 30 | Oneindia telugu
