చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ బర్త్ డే సందర్భంగా దత్తత: అనాధకు విద్యా, వసతి సదుపాయం, ఎమ్మెల్యే రోజా ఉదారత..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం ఈ రోజు.. బర్త్ డే సందర్భంగా గిప్టులు సాధారణం.. జగన్ అయినందున బోకే ఇచ్చి విష్ చేస్తారు. ప్రతీ ఏడు అన్న అంటూ ఎమ్మెల్యే రోజా కూడా ఇలానే చేసేవారు. కానీ ఈ సారి మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించారు. ఏదైనా మంచి పని చేయాలని అనుకున్నారు. అనుకున్నట్టే ఓ అనాధను దత్తత తీసుకున్నారు. చిన్నారికి వసతి కల్పించి.. విద్యాబుద్దులు నేర్పిస్తానని తెలిపారు. జగన్ బర్త్ డే సందర్భంగా రోజా చేసిన మంచి పనిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Recommended Video

సీఎం జగన్ జన్మదినం రోజున నిరుపేద విద్యార్థినిని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే రోజా
చిన్నారి దత్తత

చిన్నారి దత్తత

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగిడిన రోజా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారు. ట్రస్ట్ ఏర్పాటు చేసి పలువురిని ఆదుకున్నారు. ఆశ్రయం కల్పించి ఆదరణ చూపించారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ నిరంతరాయంగా పనులు కొనసాగిస్తున్నాయి. అయితే సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. #bbbbroja హ్యాష్‌ట్యాగ్‌తో #AdoptGirlChild ప్రారంభించారు. అలా చూడగా.. పల్లిపట్టు పుష్పకుమారి అనాధ బాలిక గురించి తెలిసింది. ఆమెకు భవిష్యత్ అందించాలని రోజా నిర్ణయం తీసుకున్నారు. తన ట్రస్ట్ ద్వారా విద్యా, వసతి సదుపాయం కల్పిస్తున్నారు.

విద్యా, వసతి..

విద్యా, వసతి..

తల్లిదండ్రులు లేని పుష్పకుమారిని దత్తత తీసుకున్నారు. ఆమెకు తన ట్రస్ట్‌ ద్వారా రోజా ఆశ్రయం కల్పించారు. మంచి విద్యను అందించి.. ఆమెను ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు. ట్రస్ట్‌లో వసతి సదుపాయం కల్పించారు. ఆమె బాగా చదివి, ఉద్యోగం సంపాదించాలని కోరుకున్నారు. విద్యార్థి మంచి స్థానానికి ఎదిగితే అందరికీ ఆనందం ఉంటుందని చెప్పారు.

ప్రశంసల జల్లు

ప్రశంసల జల్లు

దత్తతకు సంబంధించి ఎమ్మెల్యే రోజా ఫోటోలు, వీడియోను చేశారు. ఇలాంటి పనులు చేయాలని కోరారు. రోజాను నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇలాంటి పనులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. ఓ మంచి పని ద్వారా రోజా మరింత ఉన్నత స్థానంలో నిలిచారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆమె మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నారు.

English summary
nagari mla rk roja adopts a girl child. rojas charitable trust take child and better education and give shelter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X