చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరిలో బైక్ అంబులెన్స్ నడిపిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా(వీడియో)

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా తన నగరి నియోజకవర్గంలో రెండు బైక్ అంబులెన్స్‌లను ప్రారంభించారు. నగరి, పుత్తూరు ప్రభుత్వ ఆస్పతరులకు చెరొకటి చొప్పున బైక్ అంబులెన్స్‌లను అందజేశారు.
ఈ సందర్భంగా రోజా స్వయంగా బైక్ అంబులెన్స్‌ను నడిపి సందడి చేశారు.

బైక్ అంబులెన్స్‌పై సందడి

బైక్ అంబులెన్స్‌పై సందడి

రోజా స్వయంగా బైక్ అంబులెన్స్ నడపడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ బైక్ అంబులెన్స్‌లను శ్రీ సిటీ హీరో మోటార్స్ కంపెనీ తయారు చేసి అందజేసింది. ఎమ్మెల్యే రోజా కోరిక మేరకు కంపెనీవారు బైక్ అంబులెన్స్‌లను తయారుచేసి అందించారు.

హీరో మోటార్స్ రోజా ధన్యవాదాలు

ఈ సందర్భంగా బైక్ అంబులెన్స్‌లు అందజేసిన హీరో మోటార్స్‌కు రోజా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మెడికల్ ఆఫీసర్లు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ ముఖ్య నాయకులు, హీరో మోటార్స్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

చిత్తూరులో కరోనా కేసులు ఎక్కువే..

చిత్తూరులో కరోనా కేసులు ఎక్కువే..


కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,794 మంది కరోనా సోకగా, 11,918 మంది కోలుకున్నారు. 70 మందిమరణించారు. కొత్త కరోనా కేసులకంటే కొత్తగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,98,125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 99,689 యాక్టివ్ కేసులున్నాయి. 3,94,019 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,417 మంది కరోనా బారినపడి మరణించారు. ఇక చిత్తూరు జిల్లాలో గత 24 గంటల్లో 927 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 953 మంది కోలుకున్నారు. 9 మంది మరణించారు. జిల్లాలో ఇప్పటి వరకు 42,561 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,979 యాక్టివ్ కేసులున్నాయి. 33,109 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 473 మంది కరోనా బారినపడి మరణించారు.

English summary
mla rk roja rides bike ambulance in nagari in chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X