• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ సందర్బాల్లో అక్కడ ఉండే కిక్కు వేరబ్బా అంటున్న ఎమ్మెల్యే రోజా.!మెరుపులు ఖాయమంటున్న ఫాన్స్.!

|

హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజా ఏపని చేసినా, లేదా చేసే పనిని ఎంపిక చేసుకునే విధానంలో చాలా వైవిద్యాన్ని చూపిస్తుంటారు. చాలా వరకు రోజా ఆలోచనలు సాధారణంగా కంటే అసాధరణంగా ఉంటాయనే చర్చ కూడా ఉంది. సినిమాలతో క్షణం తీరిక లేని సమయంలో రాజకీయాల మీద దృష్టి సారించి తన ప్రత్యేకతను చాటుకున్నారు రోజా. రాజకీయాల్లో ఎదురైన ప్రతికూల సమయంలో అనూహ్యంగా ఆమె టీవీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అప్పటినుండి ఆర్కే రోజా సెల్వమణి తిరుగులేని హోస్టుగా తన మార్క్ ను చాటుకుంటున్నారు.

  MLA Roja Cooked & Served Food For Police Medical Municipal Staff
  రోజా సందడే సందడి.. అందుకే ఆ కార్యక్రమాలు అంటే ఆమెకు ఇష్టం..

  రోజా సందడే సందడి.. అందుకే ఆ కార్యక్రమాలు అంటే ఆమెకు ఇష్టం..

  టీవీ షోలలో ఎన్ని సార్లు, ఎంత సుధీర్గ సమయం చూసినా రోజా లాంటి హోస్టులు ప్రేక్షకులకు రవ్వంతయినా బోర్ కొట్టించరు. అంతే కాకుండా ఇప్పుడిప్పుడే టీవి రంగంలోకి వస్తున్న కొత్త జనరేషన్ కి కూడా రోజా బాగా కనెక్టు అవుతున్నారు. కుర్రకారు వేసే పంచ్ లకు ధీటైన సమాధానం వారి పంచ్ ల రూపంలోనే ఇస్తూ తన సమయస్పూర్తిని చాటుకుంటున్నారు నవ్వుల రాణి రోజా. ప్రజా ప్రతినిధిగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూనే బుల్లితెర మీద వినోదాన్ని అందించడంలో యువతరంతో పోటీ పడుతున్నారు రోజా.

  ఓ పక్క ప్రజా సేవ.. మరోపక్క వినోదం.. తన మార్క్ చూపిస్తున్న రోజా..

  ఓ పక్క ప్రజా సేవ.. మరోపక్క వినోదం.. తన మార్క్ చూపిస్తున్న రోజా..

  సెలెబ్రిటీ హోదా వచ్చిన తర్వాత ఆ హోదాను కాపాడుకుంటూనే ప్రేక్షకుల మద్య సుధీర్గకాలం కొనసాగడమనేది చాలా కష్టంతో కూడుకునన్న పని. టీవి షోలకు హోస్టుగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రధానంగా కావల్సింది ఎంటర్ టెయిన్ చేయడంతో పాలు ఓ సందేశాన్ని అందివ్వడం. ఈ రెండు లక్షణాలు రోజాలో టన్నులకొద్ది ఉన్నట్టు తెలుస్తోంది.అందుకే ఆమె ఎన్ని రూపాల్లో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా వాటిలో మొనాటమీ అనేది ఉండకపోడం వలనే రోజా బుల్లి తెర స్టార్ గా కొనసాగుతున్నారు. ఇంత చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటున్న సందర్బంలో కూడా రోజా ఓ ఆసక్తికర అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

  అదే రోజా అభిమతం.. అలరించాలనేదే ఆమె తత్వం..

  అదే రోజా అభిమతం.. అలరించాలనేదే ఆమె తత్వం..

  ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో సినిమా తర్వాత టీవి కార్యక్రమాలే కీలక భూమిక పోషిస్తున్నాయి. టీవి కార్యక్రమాల రూపకల్పన, ప్రేక్షకాదరణ పొందడం, అందుకు తగ్గట్టే ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవడం వంటి అంశాలు టీవి షోలలో ప్రధాన అంశాలుగా మారాయి. ఏదైనా కార్యక్రమానికి రూపకల్పన జరిగితే, ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు ప్రక్షకులను మంత్రముగ్దులను చేయడమే లక్ష్యంగా కాన్సెప్టు సిద్దం చేస్తున్నారు నిర్వాహకులు. ఇక పండగలు,పర్వదినాల్లో వచ్చే ప్రత్యేక కార్యక్రమాలకు పెద్ద యెత్తున పోటీ ఉండడంతో పాటు, టీఆర్పీ రేటింగ్ కూడా అంతే ఉంటుంది. సరిగ్గా అలాంటి కార్యక్రమాల గురించి రోజా అనూహ్యంగా స్పందించారు.

  స్పెషల్ ప్రోగ్రామ్స్ లో ఉండాల్సిందే.. పంచ్ లు విసరాల్సిందే అంటున్న రోజా..

  స్పెషల్ ప్రోగ్రామ్స్ లో ఉండాల్సిందే.. పంచ్ లు విసరాల్సిందే అంటున్న రోజా..

  ప్రస్తుతానికి వినోదపు కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో ప్రసార మాద్యమాల మద్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో ఎక్కువ వినోదాన్ని పంచే షోలలో తాను ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్టు రోజా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. పండగ ప్రత్యేక కార్యక్రమాల్లో తన మార్క్ ఉండాలని, అందుకోసం వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తున్నప్పుడు ట్రంప్ కార్డ్ లాంటి పాత్ర పోషించేందుకు తాను ఎప్పుడూ తహతహలాడుతానని రోజా తన మనసులో మాట చెప్పుకొచ్చారు. అలాంటి ప్రత్యేక కార్యక్రమాల్లో తాను పాలు పంచుకోవడంలో ఉన్న కిక్కే వేరబ్బా అంటున్నారు రోజా. అంతే కాకుండా రోజా ప్రత్యేక
  షోలలో తళుక్కుమన్నప్పుడు టీవీల్లో మెరుపులు పుట్టడం సర్వసాధారణం అంటున్నారు రోజా అభిమానులు.

  English summary
  Mla Roja shows a lot of diversity in the way she chooses what to do, or what not to do. There is also talk that for the most part roja ideas are more unusual than usual.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X