AP Panchayat elections AP Panchayat elections 2021 Roja lokesh mangalagiri ycp chandrababu jagan mohan reddy ap government andhra pradesh ys jagan amaravati vijayawada ap local body elections local body elections tdp chandrababu naidu రోజా లోకేష్ మంగళగిరి వైసిపి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వైయస్ జగన్ అమరావతి విజయవాడ టిడిపి చంద్రబాబు నాయుడు politics
మరోమారు చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా .. లోకేష్ కు చురకలు
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా మళ్ళీ చంద్రబాబు నాయుడు పై, లోకేష్ పై నిప్పులు చెరిగారు . ఈరోజు విశాఖ వేదికగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన ఉక్కు పరిరక్షణ పోరాట యాత్రలో పాల్గొన్న రోజా ఆ తర్వాత విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం కోసం వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ సైతం రాశారు అని రోజా పేర్కొన్నారు.
జగన్ ఏం పీకాడన్నావ్.. కుప్పం నుండి నిన్నే పీకి పారేశారు : చంద్రబాబుపై రోజా హాట్ కామెంట్స్

చంద్రబాబు విశాఖకు వచ్చి మొసలి కన్నీరు కార్చటం తప్ప చేసిందేమీ లేదన్న రోజా
స్టీల్ ప్లాంట్ అంశంపై సీఎం జగన్ కార్మిక సంఘాలతో కూడా చర్చించారని చెప్పిన రోజా, అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ విశాఖ ఉక్కు కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలే తమ గొంతును వినిపిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు విశాఖకు వచ్చి మొసలి కన్నీరు కార్చటం తప్ప చేసిందేమీ లేదని రోజా వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్ అని పేర్కొన్న రోజా, ఎంతోమంది త్యాగ ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవిర్భవించిందని, దానిని కాపాడుకోవడం కోసం రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్రకి తన పూర్తి మద్దతు ఇచ్చారని స్పష్టం చేశారు.

అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి తాను వ్యతిరేకమని చెబుతున్న చంద్రబాబు, గతంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వారితో చేతులు కలిపారని, అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయని రోజా ఆరోపించారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలలో ప్రజలు టిడిపి నేతలకు బుద్ధి చెప్పారని పేర్కొన్న రోజా, విశాఖ వచ్చిన లోకేష్ అందరి మెడలు వంచుతామని చేసిన వ్యాఖ్యలపై రోజా సెటైర్లు వేశారు.

మంగళగిరిలో లోకేష్ , కుప్పంలో చంద్రబాబు మెడలు వంచిన ప్రజలు
మంగళగిరిలో లోకేష్ కు , కుప్పంలో మీ నాన్న చంద్రబాబుకు ప్రజలు మెడలు బాగానే వంచారని , ఇంకా ఎక్కువ చేస్తే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు, టీడీపీకి బుద్ధి చెప్తామని రోజా హెచ్చరించారు. మొన్నటికి మొన్న కుప్పం నుండి చంద్రబాబుని పీకిపారేశారని వ్యాఖ్యలు చేసిన రోజా ఇప్పుడు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో చంద్రబాబు ని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ కు సైతం చురకలంటించారు.