చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్తూరు జిల్లాలో నంది విగ్రహం ధ్వంసం: వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా వరుస ఘటనలు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్లో వరుసగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు వైసీపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. నిన్నటికి నిన్న దేవాలయాలపై జరుగుతున్న దాడులను కుట్రగా అభివర్ణిస్తూ హోంమంత్రి మేకతోటి సుచరిత దేవాలయాలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని, ఆలయాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే .

హోం మంత్రి మాట్లాడిన 24 గంటల్లోపే నంది విగ్రహ ధ్వంసం ... చిత్తూరు జిల్లాలో మరో ఘటన దేవాలయాల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పిన 24 గంటల లోపే మరో దారుణం చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరు మండలం అగర మంగలంలో ఉన్న ఈశ్వర ఆలయంలో నంది విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు . రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నంది విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. నంది విగ్రహాన్ని రెండు ముక్కలుగా ధ్వంసం చేయడం భగవంతుడికి చేసిన అపచారంగా స్థానికులు భావిస్తున్నారు. ఆలయం సమీపంలో సీసీ టీవీ కెమెరాలు లేకపోవటంతో దుండగులను గుర్తించటం కష్టంగా మారింది . విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. దోషులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతుంది.

Nandi idol destroyed in Chittoor district..incidents in temples as a headache for the YCP govt

దాడులకు నైతిక బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అంటున్న ప్రతిపక్ష పార్టీలు, హిందూ సంఘాలు దేవాలయాలకు రక్షణ లేదని హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.ప్రతిపక్ష పార్టీలు ఎన్ని మార్లు విజ్ఞప్తి చేస్తున్నా దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇందుకు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరే కారణమని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన దాడులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఒకపక్క రాజధాని సమస్య, మరోపక్క కరోనా కారణం గా కొనసాగుతున్న కల్లోలం, ఇంకోపక్క ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఏపీలో తాజాగా మత ఘర్షణలకు ప్రేరేపిస్తునట్లుగా జరుగుతున్న ఆలయాలపై దాడులు అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా, ఆలయాలపై జరుగుతున్న దాడులు ప్రశ్నార్థకంగా మారాయి. అసలు ఇంతకీ ఎవరు ఈ దాడుల వెనుక ఉన్నారు అనేది ఏపీ ప్రభుత్వం పట్టుకోలేక పోతుంది. చర్యలు తీసుకుంటామని ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతోంది.

English summary
Another atrocity took place within 24 hours of the state Home Minister Mekatoti Sucharita saying that tough measures were being taken to protect the temples.The Nandi idol was vandalized at the Ishwara Temple at Agara Mangalam in Gangadhar Nellore Mandal in Chittoor district. It seems that unidentified persons destroyed the Nandi idol during the night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X