చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుప్పం వద్ద హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ - ప్రముఖ జువెలరీ కుటుంబానికి తప్పిన ముప్పు

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో తమిళనాడు భూభాగంలోని పంట పొలాల్లో ఓ హెలికాప్టర్ దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన ప్రఖ్యాత ఎస్వీఎన్ జ్యుయెలరీ సంస్థల అధినేత శ్రీనివాసన్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతుండగా.. భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

మీసా భారతి ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో కనిపించని లాలూ తనయ - తేజస్వీ ఇమేజ్ కోసమేనా?మీసా భారతి ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో కనిపించని లాలూ తనయ - తేజస్వీ ఇమేజ్ కోసమేనా?

కోయంబత్తూరు నుంచి తిరుపతి వెళుతోన్న హెలికాప్టర్.. కుప్పం సమీపంలోకి రాగానే ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. కుప్పంకు దగ్గరగా ఉన్న తిరుపత్తూరు జిల్లా గగనతలంలో ఉన్నట్టుండి పొగమంచు కమ్మేయడంతో హెలికాప్టర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు పైలెట్లు విఫలయత్నాలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరుపత్తూరు జిల్లా నంగిలి వద్ద పొలాల్లో దింపేశారు.

Narrow escape for jeweller family as helicopter makes emergency landing enroute Tirupati

ఈ సంఘటన జరిగినప్పుడు హెలికాప్టర్ లో ఇద్దరు పైలట్లు, శ్రీనివాసన్ సహా ఆయన కుటుంబీకులు కలిపి మొత్తం ఏడుగురు ఉన్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగే అయినప్పటికీ హెలికాప్టర్ సురక్షితంగా కిందికి దిగడంతో ప్రమాదం తప్పింది. పంటపొలాల్లో విమానం దిగిన దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో రికార్డు చేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు.

జగన్ సర్కారు అరుదైన రికార్డు - ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు- చైర్మన్లు ఎవరో తెలుసా?జగన్ సర్కారు అరుదైన రికార్డు - ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు- చైర్మన్లు ఎవరో తెలుసా?

Narrow escape for jeweller family as helicopter makes emergency landing enroute Tirupati

వాతావరణం అనుకూలించని కారణంగానే హెలికాప్టర్ అత్యవసరంగా దించేశామన్నపైలట్లు.. వాహనంలో ఎలాంటి టెక్నికల్ సమస్యలు తలెత్తలేదని పోలీసులకు వివరించారు. కొన్ని నిమిషాల తర్వాత వాతావరణం కుదుట పడడంతో హెలికాప్టర్ తిరిగి గాల్లోకి లేచి తిరుపతి దిశగా పయనమైంది.

English summary
A Tamil Nadu-based family of jewellers had a narrow escape after bad weather forced the chopper in which they were travelling to make an emergency landing in Chittoor district of Andhra Pradesh. The helicopter was carrying seven people including two pilots. The helicopter took off from Coimbatore and was heading to hill shrine Tirumala-Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X