చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కల్యాణ్ బర్త్ డే: ప్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్, ముగ్గురు మృతి, ఒక్కో ఫ్యామిలీకి రూ.2 లక్షలు

|
Google Oneindia TeluguNews

అభిమానానికి హద్దు ఉండదు. ఇక సినీతార బర్త్ డే అయితే వేడుకే. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే పడి చచ్చేవారు చాలా మంది. రేపు బుధవారం పవన్ కల్యాణ్ జన్మదినం. ఇందుకోసం భారీగా కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసే పనిలో అభిమానులు నిమగ్నమయ్యారు. అయితే చిత్తూరు జిల్లాలో ప్లెక్సీ కడుతోండగా ప్రమాదం జరిగింది. దీంతో ముగ్గురు చనిపోవడం బాధ కలిగిస్తోంది. చనిపోయిన ముగ్గురు కుటుంబాలకు జనసేన అధినేత ఆర్థికసాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున అందజేస్తామని తెలిపారు.

 25 అడుగుల బ్యానర్

25 అడుగుల బ్యానర్

శాంతిపురంలో పవన్ కల్యాణ్ ప్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు. 25 అడుగులు బ్యానర్లు కట్టే సందర్భంలో కరెంట్ షాక్ తగలింది. ఏడో మైల్ వద్ద బ్యానర్ కట్టే సమయంలో కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ప్లెక్సీ కడుతోన్న ఐదుగురు పడిపోయారు. కరెంట్ షాక్‌నకు గురైన ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. తర్వాత ఇద్దరు చనిపోయారు. దీంతో విషాదం నెలకొంది. తమ అభిమాన తార బర్త్ డే కోసం ప్లెక్సీ కడుతోండగా.. షాక్ తగలి చనిపోయాడు.

 ఇద్దరు ఫరవాలేదు..

ఇద్దరు ఫరవాలేదు..

మరో ఇద్దరికీ ఫరావాలేదు అని వైద్యులు తెలిపారు. వీరికి పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులను సోమశేఖర్, అరుణాచలం, రాజేంద్ర గుర్తించారు. ప్రమాదం మాటలకు అందని విషాదంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభివర్ణించారు. కార్యకర్తల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి తల్లిదండ్రుల గర్భశోకాన్ని అర్థం చేసుకోగలనని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆకాంక్షించారు.

Recommended Video

ఎన్టీఆర్ ఫోటోను వాడేస్తున్నరాజకీయ పార్టీలు| Political Parties Using TDP Founding President NTR Photo
 చంద్రబాబు దిగ్బ్రాంతి

చంద్రబాబు దిగ్బ్రాంతి

పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కడుతుండగా అపశృతి చోటు చేసుకుంది. 25 అడుగుల ఎత్తున పవన్ బ్యానర్ కడుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. శాంతిపురం విద్యుత్ షాక్‌ తగిలి ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విన్నవించారు.

English summary
pawan kalyan birthday: current shock at tied flexi in chittoor, three fans are dead anothers injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X