AP Panchayat elections AP Panchayat elections 2021 Roja ycp chandrababu jagan mohan reddy ap government andhra pradesh ys jagan amaravati vijayawada ap local body elections local body elections tdp chandrababu naidu రోజా వైసిపి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వైయస్ జగన్ అమరావతి విజయవాడ టిడిపి చంద్రబాబు నాయుడు politics
జగన్ ఏం పీకాడన్నావ్.. కుప్పం నుండి నిన్నే పీకి పారేశారు : చంద్రబాబుపై రోజా హాట్ కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా తరిమికొట్టారని, సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం పీకారు అంటూ ప్రశ్నించిన చంద్రబాబును, కుప్పం ప్రజలు కుప్పం నుంచి పీకిపారేశారని ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారం కోసం అర్రులు చాస్తున్నారు : వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్

చంద్రబాబు మనవడితో ఆడుకోవడానికి ప్రజలు ఇంటికి పంపించారన్న రోజా
ఏపీ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో, మూడవ దశ ఎన్నికలలో అధికార వైసీపీ సత్తా చాటిందని, వైయస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనను ఏపీ ప్రజలు ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా వైసిపి హవా కొనసాగటం అందుకు ఉదాహరణ అని రోజా చెప్పారు. చంద్రబాబు మనవడితో ఆడుకోవడానికి ప్రజలు ఇంటికి పంపించారని రోజా వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ఏం పీకాడని అడిగిన చంద్రబాబును కుప్పం ప్రజలు పీకి పారేశారని రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు.

కుప్పంలో కూడా చంద్రబాబుకు స్థానం లేదు
గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని 23 సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపించిన ప్రజలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో సైతం జగన్మోహన్ రెడ్డికే పట్టం కట్టారని రోజా వ్యాఖ్యానించారు. ఇకనైనా చంద్రబాబు పెద్దరికం నిలుపుకుంటే బాగుంటుందని పేర్కొన్న రోజా వైయస్ జగన్ సంక్షేమ పరిపాలనకు చంద్రబాబు మద్దతునిచ్చి గౌరవం కాపాడుకోవాలని హితవు పలికారు. ఈరోజు చంద్రబాబు నాయుడు స్థానం ఏమిటో ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా అర్థమైంది. కుప్పం లో కూడా ఆయన స్థానం ఏమిటో ఎన్నికల ఫలితాలతో స్పష్టంగా కనిపిస్తోందన్నారు .

జూమ్ కెమెరా లలో జూమ్ డాన్సులు.. పద్ధతి మార్చుకోకుంటే నీకే నష్టం
కుప్పం నియోజకవర్గంలో 90% పంచాయతీలలో వైసీపీ మద్దతుదారుల కు పట్టం కట్టారని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుతో కుప్పం ప్రజలు సైతం విసిగిపోయారని, అందుకు నిదర్శనంగానే ప్రస్తుతం ఫలితాలున్నాయని రోజా వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి పిచ్చి మాటలు మాట్లాడితే, పచ్చ ఛానల్ లో ఇష్టమొచ్చినట్టు రాయిస్తే , జూమ్ కెమెరా లలో జూమ్ డాన్సులు వేసుకుంటూ పద్ధతి మార్చుకోకపోతే చంద్రబాబు ఇంకా ఘోర పరాభవం చూడాల్సి వస్తుందన్నారు .

వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం .. ఒక్క స్థానానికే పరిమితం
చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో 23 స్థానాలను, ఒక్క స్థానానికి ప్రజలు పరిమితం చేస్తారని రోజా ఎద్దేవా చేశారు. ఇకనైనా చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని, అప్పుడే ఆయన గౌరవం తగ్గుతుందని, లేదంటే ప్రజలు తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తారని రోజా వ్యాఖ్యానించారు.