చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోం క్వారంటైన్ లో రోజా .. నేను సేఫ్ గా ఉన్నా , ఆందోళన వద్దన్న నగరి ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు మొత్తంగా 25,422 కేసులు నమోదు కాగా 292 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు కూడా కరోనా బాధ తప్పడం లేదు. ఎమ్మెల్యేలు,మంత్రులకు కరోనా సెగ తగులుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రజాప్రతినిధులకు భయం పట్టుకుంది .

టీడీపీ క్యాష్ అండ్ క్యాస్ట్ స్ట్రాటజీ ఇదే .. రాజ్యసభలో ఓటేసి.. టీడీపీపై రోజా ఫైర్టీడీపీ క్యాష్ అండ్ క్యాస్ట్ స్ట్రాటజీ ఇదే .. రాజ్యసభలో ఓటేసి.. టీడీపీపై రోజా ఫైర్

తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా అప్రమత్తమయ్యారు. ఆమె, ఆమె కుటుంబ సభ్యులు సైతం కరోనా పరీక్షలు చేయించుకుని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా బారిన పడిన రోజా గన్ మెన్ తిరుపతిలోని స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, రోజా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. దీంతో రోజా పార్టీ కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు.

Roja in Home Quarantine ...says that no need to worry , she and her family is safe

తాను, తన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నామని రోజా తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం తాము సేఫ్ గానే ఉన్నట్లుగా రోజా ప్రకటించారు. ఇక నిన్నటికి నిన్న ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా పాజిటివ్ రావడంతో మంత్రి ధర్మాన కృష్ణదాస్,అతనితో ప్రైమరీ కాంటాక్ట్ వున్నస్పీకర్ తమ్మినేని సీతారాం హోమ్ క్వారంటైన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా రోజా కూడా గన్ మెన్ కు కరోనా వచ్చిన నేపథ్యంలో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.

English summary
Corona positive confirmation of nagari MLA roja's gun man.This is what Nagari MLA Roja have been alerted to. She and her family also underwent corona tests and are currently in the Home Quarantine. Roja said she and her family were healthy no one should worry about their health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X