చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా ఉద్యోగినిని దుర్భాషలాడి.. దెబ్బలు తినే స్టేజీకి ఉన్నతోద్యోగి..!

|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావరి : మహిళలను వేధిస్తున్న ఘటనలు నిత్యం ఏదో చోట వెలుగుచూస్తునే ఉన్నాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. నిన్నటికి నిన్న హైదరాబాద్‌లో ఓ యువతి పట్ల కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించి సస్పెండయ్యాడు. అదే క్రమంలో ఓ మహిళా ఉద్యోగిని దుర్భాషలాడిన ఉన్నతాధికారి పైత్యం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

మహిళా ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఆ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మహిళా ఉద్యోగిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏఎస్ఓ‌గా పనిచేస్తున్న పీతల సురేశ్ అనే అధికారి మహిళా ఉద్యోగి ప్రసన్న కుమారిని దుర్భాషలాడటం ఉద్రిక్తతకు దారి తీసింది.

senior officer mistreatment with woman employee in east godavari district

కరెంటు కష్టాలు తప్పవా.. ప్రభుత్వ బాకీలే 9 వేల కోట్లా.. డిస్కమ్‌లకు తిప్పలేనా?కరెంటు కష్టాలు తప్పవా.. ప్రభుత్వ బాకీలే 9 వేల కోట్లా.. డిస్కమ్‌లకు తిప్పలేనా?

ప్రసన్న కుమారి పట్ల సదరు ఏఎస్ఓ‌ ప్రవర్తించిన తీరు వివాదస్పదమైంది. ప్రసన్న కుమారిని దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు డీఎస్‌వో ఛాంబర్‌లో సురేశ్‌పై దాడికి యత్నించారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అయితే ఆ సమయానికి అక్కడే ఉన్న డీఎస్‌వో ప్రసాదరావు వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేయడంతో వివాదం సమసిపోయింది. అదలావుంటే ఈ ఘటనను ఖండిస్తూ మహిళా సంఘాల నేతలు సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

English summary
Assistant Section Officer Peetala Suresh at the East Godavari District Office of Civil Supplies mistreatment with junior woman employee. The abuse of Prasanna Kumari has led to tension. Suresh's family members and relatives attempted to attack Suresh. The controversy was compounded by DSO Prasadrao's attempt to convince them to stay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X