మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజగదిలో బూడిద, జుట్టు, గాజు ముక్కలు
మదనపల్లెలో మూఢభక్తితో ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులు హతమార్చిన కేసులో దంపతులు పురుషోత్తం నాయుడు పద్మజను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. పోలీసులు జంట హత్యల కేసులో పేర్కొన్న రిమాండ్ రిపోర్ట్ ప్రకారం 27 సంవత్సరాల అలేఖ్య, 22 సంవత్సరాల సాయి దివ్య ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుక్కను తీసుకొని బయటికి వెళ్లి నిమ్మకాయలు మిరపకాయలు ఉంచిన ముగ్గును తొక్కారు.
పాతిపెట్టేందుకు గొయ్యి సిద్ధం చేసి.. పాడెపై స్మశానానికి తీసుకెళ్తుండగా .. మదనపల్లెలో షాకింగ్ ఘటన

దెయ్యం తాయత్తులు కట్టించి , దంబెల్ తో కొట్టి
ఇంటికి వచ్చిన దగ్గరనుండి వారు మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాను చనిపోతానని సాయి దివ్య ఆందోళన వ్యక్తం చేస్తుండగా, అక్క అలేఖ్య కూడా ఆ అనుమానాన్ని బలపరుస్తూ వచ్చింది. ఈ క్రమంలో
తల్లిదండ్రులు వీరిని ఒక భూతవైద్యుడిని పిలిపించి 23వ తేదీన తాయెత్తు కట్టించారు. అప్పటికి సాయి దివ్య తాను చనిపోతాననే భావన నుండి, మానసిక ఆందోళన నుండి బయటకు రాలేదు. తాను చనిపోతానని సాయి దివ్య బిగ్గరగా ఏడుస్తుండగా తల్లిదండ్రులు వేపకొమ్మలతో కొట్టారు. ఆ క్రమంలో మరింత గట్టిగా ఏడవడంతో ఈసారి డంబెల్స్ తీసుకొని దయ్యాన్ని వదిలించాలని తలపై బలంగా మోదారు.

సాయిదివ్యను చంపిన తల్లిదండ్రులు , చెల్లి కోసం అక్క కూడా నోట్లో కలశంతో
ఆ తరువాత నుదిటిపై కత్తితో కోశారు. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సాయి దివ్య ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జరిగిన తర్వాత చెల్లిని తిరిగి ఈ లోకానికి తీసుకు వస్తానంటూ అలేఖ్య తల్లిదండ్రులకు చెప్పింది. అందుకోసం అలేఖ్య తన నోటిలో కలశం పెట్టి డంబెల్ తో తలపై కొట్టమని తల్లిదండ్రులకు చెప్పినట్లుగానే పురుషోత్తం నాయుడు, పద్మజా కలిసి అలాగే నోట్లో కలశం పెట్టి డంబెల్ తో తలపై కొట్టారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అలేఖ్య కూడా మరణించింది.

పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు,గాజు ముక్కలు
ఇక రెండు హత్యలు తర్వాత పురుషోత్తం నాయుడితో ఫోన్ లో మాట్లాడిన గౌరీ శంకర్ అనే విశ్రాంత అధ్యాపకుడు సూచన మేరకు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీడీగా ఉన్న రాజు పురుషోత్తం నాయుడు ఇంటికి వెళ్ళాడు . పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు,గాజు ముక్కలు కనిపించాయి. రాత్రి 9:30 ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు .

జైల్లో పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్న దంపతులు .. రాష్టంలో చర్చనీయంశంగా మర్డర్ మిస్టరీ
నిందితులకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది కోర్టు. అయితే వీరి మానసిక స్థితి సరిగా లేని కారణంగా, జైల్లోనూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ కారణంగా వారిని వైద్య చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్ కు తరలించనున్నారు.
అయితే ఒకే ఇంట్లో అందరూ ఒకే మానసిక స్థితికి రావటం, అందరూ ఒకేలా ఆలోచించటం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది .