• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

|
  TDP Former MP N.Sivaprasad Passed Away || చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి

  చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్‌ ఇక లేరు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదు. శివప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ.. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం మధ్యాహ్నం 2:10 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.

  ఏం తమాషాలా?: గ్రామ సచివాలయం పరీక్షల వెనుక భారీ కుంభకోణం: చంద్రబాబు, నారా లోకేష్ అటాక్!

  తిరగబెట్టిన కిడ్నీ సమస్య..

  తిరగబెట్టిన కిడ్నీ సమస్య..

  శివప్రసాద్ కొద్దిరోజులుగా మూత్ర పిండాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇటీవలే ఆయనకు చెన్నైలో చికిత్స చేయించారు. సుమారు రెండు వారాల పాటు ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా మరోసారి మూత్ర పిండాల్లో సమస్యలు తలెత్తినట్లు సమాచారం. దీనితో కుటుంబ సభ్యులు ఆయనను గురువారం ఉదయం మరోసారి చెన్నై ఆసుపత్రికే తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు శివప్రసాద్ కుటుంబీకులకు ఫోన్ చేశారు.

  సమస్య ఎలాంటిదైనా.. తనదైన శైలిలో..

  సమస్య ఎలాంటిదైనా.. తనదైన శైలిలో..

  సమస్య ఏదైనా, ఎలాంటిదైనా.. తనదైన శైలిలో స్పందించడం శివప్రసాద్ కు అలవాటు. రాష్ట్ర విభజన సమయంలో గానీ, ప్రత్యేక హోదా సాధన ఉద్యమ సమయంలో గానీ ఎన్ శివప్రసాద్ అసాధారణ తెగువను ప్రదర్శించేవారు. సాక్షాత్తూ పార్లమెంట్ భవనం ముందు అల్లూరి సీతారామరాజు, జవహర్ లాల్ నెహ్రూ, హిట్లర్, స్వామి వివేకానంద ఇలా జాతీయ, అంతర్జాతీయ స్థాయి నాయకులను మొదలుకుని.. గ్రామీణ వేషధారణలతో క్లిష్టమైన సమస్యలను కూడా ఆకట్టుకునేలా చెప్పగలిగారాయన. తమ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇదీ.. అని స్పష్టంగా చెప్పగలిగడంతో పాటు దాన్ని జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నాయకులు స్పందించేలా చేయడంలో ఎన్ శివప్రసాద్ దిట్ట.

  చంద్రబాబుకు ఆప్తుడు..

  చంద్రబాబుకు ఆప్తుడు..

  చంద్రబాబుకు శివప్రసాద్ అత్యంత ఆప్తుడు. వారిద్దరూ సన్నిహిత మిత్రులు. ఇద్దరిదీ ఒకే జిల్లా. చంద్రబాబు ప్రోత్సాహంతోనే శివప్రసాద్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారని జిల్లావాసులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా లోక్ సభ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో శివప్రసాద్ ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డెప్ప రెడ్డిపై పోటీ చేసిన శివప్రసాద్ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

  నటుడిగా, దర్శకుడిగా

  నటుడిగా, దర్శకుడిగా

  డాక్టర్ ఎన్ శివప్రసాద్ కు నటుడిగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరుంది. ప్రముఖ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఆర్ కే రోజాను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది ఆయనే. పలువురు వర్ధమాన నటులకు జీవితాన్ని ప్రసాదించారు. హాస్య పాత్రలను పోషించారు. అనేక సినిమాల్లో నటించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Former TDP MP Naramalli Sivaprasad who was suffering from Kidney ailment passed away in hospital. He was at 68. As per the latest reports, the senior leader's health declined further early in the morning and the worried family members had shifted him to the Chennai Apollo hospitals for the better treatment. Known for his witty style of staging protests, Sivaprasad is an actor turned politician and a well-known person in the two Telugu states.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more