చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాహో సోనూ సూద్.. చిత్తూరు పేదకు భారీ సాయం.. ‘కాడెద్దులుగా కూతుళ్లు’ వీడియో వైరల్ కావడంతో..

|
Google Oneindia TeluguNews

కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలకంటే వేగంగా స్పందిస్తూ, పేదలను ఆదుకోవడంతో ముందున్న నటుడు సోనూ సూద్ ఇంకో గొప్ప పని చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన పేద రైతుకు చేయూతనిచ్చేందుకు ఆయన ముదుకొచ్చారు. కనీసం ఎండ్లను కూడా అద్దెకు తీసుకోలేని దుస్థితిలో.. తండ్రి వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన కూతుళ్ల వీడియోను చూసి చలించిన ఆయన.. ఆ రైతు కుటుంబానికి ట్రాక్టర్ కొనివ్వబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు.

Recommended Video

Sonu Sood Help to AP Farmer With Tractor

నిమ్మకాయలు, తాయెత్తులతో కొవిడ్ ఖతం - అంటూ కరోనా బాబా ప్రచారం.. సినీ ఫక్కీలో చివరికి ఇలా..నిమ్మకాయలు, తాయెత్తులతో కొవిడ్ ఖతం - అంటూ కరోనా బాబా ప్రచారం.. సినీ ఫక్కీలో చివరికి ఇలా..

సాయంత్రానికి ట్రాక్టర్.. మీరు చదువుకోండి..

సాయంత్రానికి ట్రాక్టర్.. మీరు చదువుకోండి..

ముందుగా, సోమవారం ఉదయంలోగా మదనపల్లె రైతు ఇంటి రెండు ఎడ్లు ఉంటాయని ట్వీట్ చేసిన సోనూ సూద్.. నిమిషాల్లోనే మనసు మార్చుకుని.. ‘‘ఎద్దులు కాదు.. మీకు ట్రాక్టర్ అయితే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆడ పిల్లలిద్దరూ ఎంచక్కా చదువుకోవచ్చు.. '' అని మరో ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన కొద్ది గంటలకే.. ఆదివారం సాయంత్రానికే కొత్త ట్రాక్టర్ ను పంపించారు సోనూ. వీడియో ద్వారా పేద రైతు కూతుళ్ల కష్టాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన అందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు.

లాక్ డౌన్ కారణంగా ఉపాధికోల్పోయి..

లాక్ డౌన్ కారణంగా ఉపాధికోల్పోయి..

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం మహల్ రాజువారి పల్లెకు చెందిన వీరతాళ్ల నాగేశ్వరరావు.. మదనపల్లె టౌన్ లో టీ కొట్టు నడిపేవారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆయన, 20 ఏళ్ల తర్వాత సొంతూరికి వెళ్లిపోయాడు. తనకున్న కొద్దిపాటి భూమిలో టమాటా సాగు చేయాలనుకున్న నాగేశ్వరరావు.. భూమి దున్నేందుకు ఎద్దులు లేక, ట్రాక్టర్ ను అద్దెకు తీసుకునే స్థోమత లేక సతమతమైపోయాడు. చివరికి..

వైరల్ వీడియో..

వైరల్ వీడియో..

కన్నబిడ్డలనే కాడెద్దులుగా మలచి.. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే.. వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వచ్చారు. ఈ దృశ్యాలను ఓ స్థానిక జర్నలిస్టు తన ట్విట్టర్‌లో అప్ లోడ్ చేశాడు. గంటల వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ అయింది. అది కాస్తా సోనూసూద్ కంట పడడటంతో వెంటనే సాయం చేయడానికి ఆయన ముందుకొచ్చారు.

జగన్ డ్రీమ్-ఏపీ చరిత్రలో అతిపెద్ద లిఫ్ట్ -రాయలసీమ ఎత్తిపోతలపై కీలక పరిణామం- కేసీఆర్ సర్కారు గగ్గోలుజగన్ డ్రీమ్-ఏపీ చరిత్రలో అతిపెద్ద లిఫ్ట్ -రాయలసీమ ఎత్తిపోతలపై కీలక పరిణామం- కేసీఆర్ సర్కారు గగ్గోలు

వెన్నెల.. చందన..

వెన్నెల.. చందన..

కుటుంబం కోసం కాడెద్దులుగా మారిన ఆ ఇద్దరు ఆడపిల్లలో పెద్దమ్మాయి పేరు వెన్నెల. తను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. రెండో అమ్మాయి చందన పదో తరగతి చదువుతోంది. వెన్నెల బైపీసీ స్టూడెంట్. డాక్టర్ కావాలన్నది ఆమె కల అని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీతో నాగేశ్వరరావుకు అనుబంధం ఉంది. కొందరు అడ్వొకేట్లు అతడికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఓ నెల ఇంటి అద్దె కట్టారు. కొంత నిత్యావసరాలు కొనిచ్చారు. కానీ, ఆత్మాభిమానం ఉన్న నాగేశ్వరరావు సొంతంగా పనిచేసుకోవడానికే మొగ్గు చూపాడు. తన రెండెకరాల పొలంలో పంట వేయడానికి నిర్ణయించాడు. కానీ, ఎద్దులు దొరక్క, ట్రాక్టర్ అద్దె చెల్లించలేక ఇలా కుమార్తెల భుజాన భారం వేసి నడిపించాడు.

జగన్ కంటే ముందే సోనూ..

చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు చెందిన పేద రైతు కుటుంబానికి ట్రాక్టర్ కొనిచ్చేందుకు ముందుకొచ్చిన సోనూ సూద్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. లాక్ డౌన్ సమయంలో దేశం నలుమూలలా ఎక్కడ సమస్య తలెత్తినా అక్కడ ప్రత్యక్షమవుతూ సోనూ తన ఉదారతను చాటుకుంటున్నారు. విదేశాల్లో చిక్కుపోయిన భారతీయుల్ని సైతం సొంతగడ్డకు రప్పించి, ఇంటర్నేషనల్ గానూ మంచి పేరు సంపాదించారు. ఇక మదనపల్లె ఘటన విషయానికొస్తే.. సాధారణంగా ఏపీకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సంఘటనలపై జగన్ సర్కారు స్పందింది సాయం చేయడం పరిపాటిగా మారింది. ఈసారి మాత్రం జగన్ కంటే ముందే సోనూ సూద్ పేదలను ఆదుకోవడం గమనార్హం.

నటుడికి నారా లోకేశ్ అభినందనలు..

ఆంధ్రప్రదేశ్ కు చెందిన పేద రైతు కుటుంబానికి నటుడు సోనూ సూద్ సాయం ప్రకటించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. కరోనా కష్టకాలంలో ప్రజల పట్ల ఎంతో దయగా వ్యవహరిస్తూ మంచి పనులు చేస్తున్నారని సోనూను అభినందించారు. చిత్తూరు రైతు కుటుంబానికి చేసిన సాయం కూడా అలాంటిదేనంటూ నటుడికి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.

English summary
After a video of two girls ploughing a farm on Chittoor district of andhra pradesh, was widely shared on the Internet, Bollywood actor Sonu Sood has stepped forward with the promise to provide a pair of Ox to their family, which was forced to resort to the extreme step after suffering a severe blow in the lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X