• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Strange Rooster : గుడ్లు పెట్టిన కోడిపుంజు... చిత్తూరు జిల్లాలో వింత ఘటన....

|

కోడి పుంజు గుడ్లు పెడుతుందా... ఈ ప్రశ్న వింటే ఎవరైనా సరే అదెలా సాధ్యమంటారు.ప్రకృతి సహజ ధర్మానికి అది విరుద్ధం కదా అని ప్రశ్నిస్తారు. కానీ కొన్నిసార్లు ఎవరూ ఊహించని వింతలు చోటు చేసుకోవచ్చు. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా కొన్ని ఘటనలు జరగవచ్చు. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

చిత్తూరులోని తొట్టంబేడు మండలం పెద్దకన్నలిలోని ఎస్టీ కాలనీలో ఈ వింత చోటు చేసుకుంది. స్థానికుడైన సుబ్రహ్మణ్యంరెడ్డి ఇంట్లో ఉన్న కోళ్లలో ఒక పుంజు ఇటీవల ఐదు గుడ్లు పెట్టింది. దీంతో యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ ఐదు గుడ్లను పుంజు కింద పొదిగేయడంతో అది 5 పిల్లలను పెట్టింది. ఇప్పుడా పుంజు తల్లి కోడిలా పిల్లలను కాపాడుకుంటోంది. ఈ వింత గురించి తెలిసి గ్రామస్తులంతా వచ్చి ఆ కోడి పుంజును,దాని పిల్లలను చూసి వెళ్తున్నారు.వెటర్నరీ అధికారి వీరభద్రరెడ్డి దీనిపై స్పందిస్తూ... జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉంటుందన్నారు. రెండేళ్ల క్రితం ఖమ్మంలోని వెంకటయ్యపాలెంలోనూ ఓ కోడిపుంజు గుడ్లు పెట్టిన ఘటన ఇలాగే అందరినీ ఆశ్చర్యపరిచింది.

strange incident rooster lays eggs in thottembedu village chittoor

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం కమ్మవారిపాలెంలోనూ వింత ఘటన చోటు చేసుకుంది. స్థానికుడైన ఎస్‌కే దస్తగిరి అనే వ్యక్తికి చెందిన మేక కోడి ఆకారంలో ఉన్న మేక పిల్లను ప్రసవించింది. కేవలం పావు కిలో బరువుతో పుట్టిన ఆ కోడి పిల్ల లాంటి మేక.. పుట్టిన కొద్దిసేపటికే మృతి చెందింది. ఒకే ఈతలో అది మొత్తం మూడు మేక పిల్లలకు జన్మనివ్వగా అందులో రెండు ఆరోగ్యంగా ఉన్నాయి. ఒకటి మాత్రం కోడి ఆకారంలో పుట్టి చనిపోయింది.

గతేడాది మహబూబాబాద్ జిల్లాలోనూ ఓ వింత కోడి ఘటన వెలుగుచూసింది. కేసముద్రానికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తి కోడిపిల్లలను తెచ్చి పెంచుకోగా... అందులో ఒకటి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. హుస్సేన్ అన్నం తింటే అది అన్నం తింటుంది... మద్యం తాగితే అదీ తాగుతుంది... అంతేకాదు,మందులోకి మంచింగ్‌లా చికెన్ ముక్కలను తింటుంది. హుస్సేన్ ఎటు వెళ్తే ఆ కోడి అటే వెళ్తుంది. కొత్త ముఖాలు ఎవరైనా ఇంటికి వస్తే వారి పని పడుతుంది. ఆ కోడి ప్రవర్తన నచ్చి హుస్సేన్ దాన్ని ప్రేమగా పెంచుకుంటున్నాడు. పసి పిల్లల్లాగే దాన్ని సాకుతున్నానని సంతోషంగా చెబుతాడు హుస్సేన్.

రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న మరో వింత ఘటనలో ఓ కోడి మెడ కింది భాగం నుంచి గుడ్లు పెట్టడం అప్పట్లో చాలామందిని ఆశ్చర్యపరిచింది.కర్ణాటకలోని మండ్యలో ఈ ఘటన చోటు చేసుకున్నది. శివరామె గౌడ అనే వ్యక్తి గత రెండేళ్ల నుంచి ఓ కోడిని పెంచుకుంటుండగా... ఆ కోడి ఒక రోజు మెడ కింది భాగం నుంచి గుడ్డు పెట్టడంతో అతను ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోడి మెడ కింది నుంచి గుడ్డు పెట్టడాన్ని చూసి చాలామంది నోరెళ్లబెట్టారు. జన్యుపరమైన లోపాలే ఇందుకు కారణమేమో అనే వాదన వినిపించింది.

English summary
In a strange incident a rooster laid eggs in Thottembedu village in Chittoor district.One of the hens in the house of local Subramaniam Reddy recently laid five eggs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X